హీరోయిన్స్ కి పోటీ ఇస్తున్న భూమిక!

  • October 4, 2018 / 04:49 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో భూమిక చేసిన ఖుషి మూవీ సంచలన విజయం సాధించింది. అలాగే సింహాద్రి సినిమాలో ఎన్టీఆర్ కి జోడీగా నటించి ఇండస్ట్రీ హిట్ సాధించింది. మహేష్ తో చేసిన ఒక్కడు అయితే ఎన్నో రికార్డ్స్ ని కొల్లగొట్టింది. ఇలా హీరోయిన్ గా అవకాశాలు వస్తున్న సమయంలోనే యోగా గురు భరత్ ఠాకూర్ ని పెళ్లి చేసుకొని సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.  ఆ తర్వాత బాలీవుడ్ మూవీ ఎంఎస్ ధోని చిత్రంతో  సినిమాల్లోకి రీ ఎంట్రి ఇచ్చింది. తెలుగులో నాని ఎంసీఏ చిత్రంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టింది. ఆ చిత్రంతో పాటు సమంత లీడ్ రోల్ పోషించిన యూ టర్న్ సినిమాలో ఐదేళ్లపాపకి తల్లిగా నటించి మెప్పించింది. ఇలా రీ ఎంట్రీలోను వరుస విజయాలు అందుకుంటోంది.

అలాగే నాగచైతన్య హీరోగా నటించిన సవ్యసాచి సినిమాలోనూ భూమిక కీలక రోల్ పోషించింది. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయి విశేషంగా ఆకట్టుకుంది. మాధవన్ విలన్ గా నటించిన ఈ సినిమాలో భూమికని చూడాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అంతకంటే ముందే భూమిక తన ఫోటోలను షేర్ చేసింది. ఇందులో రెడ్ డ్రెస్ లో నేటి హీరోయిన్స్ కి పోటీ ఇస్తోంది. నిజజీవితంలోనూ తల్లి అయినప్పటికీ ఆ ఛాయలు ఎక్కడా కనిపించకుండా కొత్త హీరోయిన్ మాదిరి మెరిసిపోతోంది. ఈ ఫోటో షూట్ తో మరిన్ని అవకాశాలు ఆమె ముందు వాలుతాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus