40 ఏళ్ల కథానాయికల కోసం క్యారెక్టర్లు రాయాలి!

పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున వంటి అందరు హీరోలతో కలిసి నటించడమే కాక సదరు హీరోల కెరీర్ బెస్ట్ హిట్స్ లో భాగస్వామి అయిన భూమిక పెళ్లి అనంతరం సినిమాలకి కాస్త గ్యాప్ ఇచ్చింది. మళ్ళీ రీఎంట్రీలో ఫుల్ బిజీ అయిపోతుంది. నాని కథానాయకుడిగా తెరకెక్కిన “మిడిల్ క్లాస్ అబ్బాయి” చిత్రంతో వదినమ్మగా రీఎంట్రీ ఇచ్చిన భూమిక నాగచైతన్య “సవ్యసాచి”, సమంత “యూ టర్న్” చిత్రాల్లో కీలకపాత్రలు పోషిస్తోంది.

భూమిక ముఖ్యభూమిక పోషించిన “యూ టర్న్” చిత్రం ఈవారం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన భూమిక.. “40 ఏళ్ళు దాటిన విద్యాబాలన్ ఇప్పటికీ సెక్సీ రోల్స్ చేస్తోంది, పైగా ఆమెకు సరైన ఫిజిక్ కూడా ఉండదు. 40 ఏళ్ళు దాటిన మలైకా అరోరా ఇప్పటికీ సూపర్ హాట్ ఫోజులు ఇస్తూ హల్ చల్ చేస్తోంది. కానీ.. మన సౌత్ ఇండియాలో మాత్రం 40 ఏళ్ళు దాటిన కథానాయికలు ఈ తరహా పాత్రలు మాత్రమే పోషించాలని ఫిక్స్ అయిపోయి కూర్చున్నారు.

అందుకే సీనియర్ హీరోయిన్స్ అందరూ షెడ్డుకు వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే.. ఇప్పుడిప్పుడే వారి ఆలోచనా ధోరణిలో మార్పు వస్తోంది. 40 ఏళ్ళు దాటిన కథానాయికలకు కూడా మంచి పాత్రలు రాసే అవకాశం ఉంది. దాని మన దర్శకనిర్మాతలు గమనించాలి. ఇకపోతే.. నాకు స్క్రీన్ టైమ్ గురించి పెద్దగా పట్టింపు లేదు. 2 నిమిషాల పాత్రైనా సరే సినిమాకి కీలకంగా నిలుస్తుంది అని భావిస్తే హ్యాపీగా చేసేస్తాను” అంటోంది భూమిక. మరి భూమిక స్టేట్ మెంట్ చూసిన లేదా విన్న దర్శకులెవరైనా ఆమెలోని నటిని వినియోగించుకొంటారో లేదో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus