భూషణ్‌ కుమార్‌, ప్రభాస్ ల ఫోటోని పోస్ట్ చేసిన చిత్ర బృందం

  • April 17, 2018 / 10:19 AM IST

సుజీత్ డైరెక్షన్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. యువీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ లు భారీ బడ్జెట్ లో నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ వేగంగా సాగుతోంది. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం లేటెస్ట్ షెడ్యూల్ అబుదాబిలో సాగుతోంది. దాదాపు 45రోజుల పాటు జరగబోయే ఈ భారీ షెడ్యూల్ హాలీవుడ్ స్టంట్ మాస్టర్ కెన్నీ బేట్స్ పర్యవేక్షణలో జరగనుంది . ఈ షూటింగ్ లో ప్రభాస్, శ్రద్ధ కపూర్, నీల్ నితిన్ ముకేశ్ తదితరులు పాల్గొంటున్నారు. ఈ సందర్భంలో సినీ విశ్లేషకులు తరణ్‌ ఆదర్శ్‌ ట్విటర్‌ లో ప్రభాస్, బాలీవుడ్‌ నిర్మాత భూషణ్‌ కుమార్‌ కలిసి ఉన్న ఫోటోని షేర్ చేశారు. ఇతనే టీ సిరీస్‌ బ్యానర్‌పై సమర్పించనున్నారు.

నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్‌తో టీ సిరీస్‌ ఒప్పందం కుదుర్చుకుని ‘సాహో’ సినిమాను నిర్మిస్తోంది. దీంతో భూషణ్‌ కుమార్‌ నిర్మాణంలో ప్రభాస్ భవిష్యత్తులో సినిమా చేస్తారని బాలీవుడ్ మీడియా కోడైకూస్తోంది. ఇక సాహో సినిమా విషయానికి వస్తే అబుదాబి షెడ్యూల్ తర్వాత యూనిట్ అంతా కలిసి దుబాయ్ వెళ్తుంది. అక్కడ బుర్జ్ ఖలీఫా పరిసర ప్రాంతాల్లో రిస్కీ ఛేజింగ్ సీన్ షూట్ చేయబోతున్నారు. బాలీవుడ్ సంగీత త్రయం శంకర్ – ఇషాన్ – లాయ్ లు సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ చేయనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus