సంగీత దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన విజయ్ ఆంటోని.. నటుడిగా మారి ‘నకిలీ’ ‘డాక్టర్ సలీమ్’ వంటి హిట్ సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. అయితే ‘బిచ్చగాడు’ సినిమా ఇతన్ని తెలుగు రాష్ట్రాల్లో కూడా పాపులర్ చేసింది. ఆ సినిమా ఒక్క తెలుగులోనే రూ.14 కోట్లకు పైగా షేర్ ని కలెక్ట్ చేసి 10 రెట్లు ప్రాఫిట్స్ ను అందించింది. ‘బిచ్చగాడు’ తర్వాత విజయ్ ఆంటోని నటించిన అనేక సినిమాలు రిలీజ్ అయ్యాయి కానీ ఏది కూడా అంతగా సక్సెస్ కాలేదు.
అయితే ఇప్పుడు ‘బిచ్చగాడు-2’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మే 19న అంటే నిన్న ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. సినిమాకి టాక్ బాగానే వచ్చింది. దీంతో ఓపెనింగ్స్ కూడా చాలా బాగా నమోదయ్యాయి. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం
0.72 cr
సీడెడ్
0.35 cr
ఉత్తరాంధ్ర
0.32 cr
ఈస్ట్
0.20 cr
వెస్ట్
0.14 cr
గుంటూరు
0.22 cr
కృష్ణా
0.18 cr
నెల్లూరు
0.10 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
2.23 cr
‘బిచ్చగాడు2’ (Bichagadu 2) చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.5.85 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.6 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు ఈ చిత్రం ఏకంగా రూ.2.23 కోట్ల షేర్ ను రాబట్టింది.మొదటి రోజు ఈ మూవీ చాలా బాగా కలెక్ట్ చేసింది. అయితే బ్రేక్ ఈవెన్ కు మరో రూ.3.77 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. వీకెండ్ మొత్తం ఇదే జోరు చూపిస్తే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.