Sanjeev Reddy: టాలీవుడ్ కి మరో టాలెంటెడ్ అండ్ సెన్సిబుల్ డైరెక్టర్ దొరికినట్టే..!

కమర్షియల్ పంధాలోనే కాకుండా కంటెంట్ పై ఆధారపడి సినిమాలు తీసే దర్శకులు కరువవుతున్న రోజులు ఇవి. ఎక్కువ శాతం దర్శకులు హీరో మార్కెట్, నిర్మాత బడ్జెట్.. వంటి లెక్కలు దృష్టిలో పెట్టుకునే సినిమాలు చేస్తున్నారు. వాటి కోసం చాలా కాంప్రమైజ్ అవుతున్నారు. కానీ ఓ సెన్సిటివ్ పాయింట్..ని తీసుకుని సెన్సిబుల్ గా డీల్ చేస్తూ యువతని ఆలోచింపజేసేలా సినిమాలు తీసే దర్శకులు తక్కువ మందే ఉన్నారు. అలాంటి వారిలో సంజీవ్ రెడ్డి ఒకరని చెప్పాలి.

Sanjeev Reddy

‘లాగిన్’ అనే హిందీ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన సంజీవ్ రెడ్డి.. విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. తెలుగులో మొదటి సినిమాగా ‘ఎబిసిడి’ చేశారు. అల్లు శిరీష్ కథానాయకుడిగా తెరకెక్కిన ఈ సినిమా టార్గెటెడ్ ఆడియన్స్ ని మెప్పించింది. ముఖ్యంగా ఈ సినిమాలో కామెడీ, మెల్ల మెల్ల మెల్లగా అనే పాట, క్లైమాక్స్ లో ఇచ్చిన మెసేజ్ అన్నీ కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి.

అటు తర్వాత రాజ్ తరుణ్ తో ‘అహ నా పెళ్ళంట'(వెబ్ సిరీస్) చేశారు. అది కూడా యూత్ ను,ఫ్యామిలీ ఆడియన్స్..ను ఆకట్టుకుంది. ఇప్పుడు ‘సంతాన ప్రాప్తిరస్తు’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈరోజు అనగా నవంబర్ 14న రిలీజ్ అయిన ‘సంతాన ప్రాప్తిరస్తు’ కూడా ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ ను రాబట్టుకుంటుంది. సాఫ్ట్ వేర్ జాబ్..లు చేస్తున్న యువత… అందులో వారు ఎదుర్కొంటున్న ఒత్తిడి కారణంగా భవిష్యత్తులో వచ్చే సమస్యల ఆధారంగా ‘సంతాన ప్రాప్తిరస్తు’ ని తెరకెక్కించారు సంజీవ్ రెడ్డి.

ఈ పాయింట్ చుట్టూ అల్లిన కథ.. అందులో నుండి పుట్టిన వినోదం ప్రేక్షకులను అలరించినట్టు స్పష్టమవుతుంది. చెడుని గ్లోబలైజ్ చేయకుండా యువతని ఆలోచింపజేసేలా, ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసేలా సినిమాలు తీస్తున్న సంజీవ్ రెడ్డితో పనిచేసేందుకు యంగ్ హీరోలు సైతం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కచ్చితంగా టాలీవుడ్లో ఈయన ‘నెక్స్ట్ బిగ్ థింగ్’ అనడంలో ఎటువంటి సందేహం లేదు.

నాకు నటన రాదు అని విమర్శించారు: దుల్కర్ సల్మాన్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus