నయన్ టు సమంత… ఓటిటి ఫైట్ కు రెడీ అవుతున్న స్టార్ హీరోయిన్స్..!

50శాతం ఆకుపెన్సీతో థియేటర్స్ తిరిగి ఓపెన్ చేసుకోవచ్చు అని కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చినప్పటికీ.. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల యాజమాన్యం వారు ఇంకా ముందడుగు వెయ్యడం లేదు. దర్శకనిర్మాతలు కూడా ఇప్పటికీ ఓటిటిల్లోనే తమ సినిమాలను విడుదల చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ టైంలో వారి సినిమాలను థియేటర్లలో విడుదల చేసినప్పటికీ జనాలు రాకపోతే భారీ నష్టాలను మూటకట్టుకోవాలనేది వారి భయం కావచ్చు. అందుకే వచ్చే రెండు నెలలు స్టార్ హీరోయిన్ల సినిమాలు ఓటిటిలోనే విడుదల కాబోతున్నాయి.

ఇక్కడ ఇంకో విచిత్రం ఏమిటంటే.. అదే టైంకు మరికొంతమంది స్టార్ హీరోయిన్ల వెబ్ సిరీస్ లు కూడా విడుదలవుతుండడం విశేషం. వివరాల్లోకి వెళితే.. నయనతార నటించిన `ముకుతి అమ్మన్` చిత్రం డిస్నీ హాట్ స్టార్ లో విడుదల కాబోతుంది. ఆర్.జె. బాలాజీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం తెలుగులో కూడా ‘అమ్మోరు తల్లి’ పేరుతో విడుదల కాబోతుంది.తరువాత కాజల్ ప్రధాన పాత్రలో వెంకట్ ప్రభు డైరెక్షన్లో రూపొందిన ‘లైవ్ టెలికాస్ట్’ అనే వెబ్ సిరీస్ కూడా నవంబర్‌లోనే డిస్నీ హాట్ స్టార్ ప్లస్‌లో విడుదల కాబోతుంది.

అంతేకాదు మరోస్టార్ హీరోయిన్ తమన్నా నటించిన ‘నవంబర్ స్టోరీ’ అనే వెబ్ సిరీస్ కూడా నవంబర్‌లోనే డిస్నీ హాట్ స్టార్ ప్లస్‌లో స్ట్రీమ్ అవుతుందని తెలుస్తుంది. వీటితో పాటు సమంత కీలక పాత్ర పోషించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2’ వెబ్ సిరీస్ కూడా అమెజాన్ ప్రైమ్‌లో నవంబర్ నుండీ స్ట్రీమింగ్ కాబోతుందని సమాచారం. ఏమైనా ఈ రెండు నెలలు స్టార్ హీరోయిన్స్ దే హవా అని స్పష్టమవుతుంది.

Most Recommended Video

కలర్ ఫోటో సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన టాప్ 20 టీజర్లు ఇవే..!
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus