Bigg Boss 7 Telugu: ప్రిన్స్ యావార్ చేసిన పనివల్లే గొడవ అయ్యిందా ? దీని వెనక ఉన్నది ఎవరంటే.?

బిగ్ బాస్ హౌస్ లో 4వ వారం ఇమ్యూనిటీ టాస్క్ కోసం పోటీ పడుతున్నారు హౌస్ మేట్స్. అంతేకాదు, 4వ పవర్ అస్త్రా ఎవరైతే సంపాదిస్తారో వాళ్లకి రెండు వారాల ఇమ్యూనిటీ వస్తుంది. దీంతో ఈవారం నామినేషన్స్ లో ఉన్నవాళ్లకి కత్తి మీద సాములాగా ఈ టాస్క్ అయ్యింది. ముఖ్యంగా లాస్ట్ వీక్ డేంజర్ జోన్ వరకూ వెళ్లి వచ్చిన శుభశ్రీ కి ఈ టాస్క్ చాలా ఇంపార్టెంట్ గా మారింది. అందుకే, ప్రిన్స్ యావార్ బజర్ కొడితే తనని సెలక్ట్ చేసుకోమని అడిగింది.

అంతేకాదు, మరోవైపు రతిక కూడా ప్రిన్స్ యావర్ ని బ్రతిమిలాడింది. అందుకే, సెకండ్ టైమ్ జబర్ కొట్టేందుకు ప్రిన్స్ యావార్ గార్డెన్ ఏరియాలోనే కూర్చుండి పోయాడు. దీంతో అతనికి ఫుడ్ తెచ్చిపెడతాను అని శుభశ్రీ చెప్పింది. ఇదే మాట శివాజీ పల్లవి ప్రసాంత్ తో డిస్కస్ చేసాడు. కానీ, ఇది తెలియని హౌస్ మేట్స్ ప్రిన్స్ యావార్ కి రూమ్ సర్వీస్ చేస్తున్నాడు పల్లవి ప్రశాంత్ అంటూ మాటలు విసిరారు. ప్రిన్స్ ఒక్కడే గార్డెన్ ఏరియాలో స్వార్ధంగా తింటుంటే మేము బిగ్ బాస్ హౌస్ లో పని చేయడానికి వచ్చామా అంటూ సణిగారు.

సందీప్ ని ముందు పెట్టి తమ బాధని చెప్పుకున్నారు. సరిగ్గా ఇదే టైమ్ లో ప్రిన్స్ కి ఇంకో రోటీ కావాలని వచ్చిన శివాజీని సందీప్ ప్రశ్నించాడు. ఇది స్వార్ధం గేమ్ కాదా అని అడిగాడు. దీంతో శివాజీ ప్రిన్స్ దగ్గరకి వచ్చి ఇది కరెక్ట్ కాదని చెప్పాడు. ఆ తర్వాత శుభశ్రీ తనకోసం చేస్తానని చెప్పిందని, నాకు ఫుడ్ లేకపోయినా సరే బజర్ కోసం ఇక్కడే ఉంటానని చెప్పానని అన్నాడు ప్రిన్స్. ఇక శివాజీ కిచెన్ లో ఇదే మాట చెప్తుంటే శోభా వినిపించుకోలేదు.

మీరు అస్తమానం జనాలు చూస్తారు చూస్తారు అంటూ పదే పదే చెప్పక్కర్లేదని, నాకు కూడా 28యేళ్లు వచ్చాయ్, మెచ్యూరిటీ ఉందని ఆలోచించగలనని చెప్పింది. దీంతో ఇద్దరికీ మాటకి మాట పెరిగింది. మద్యలో సందీప్ కూల్ చేస్తున్నా కూడా శోభా, శివాజీ ఇద్దరూ కూడా రెచ్చిపోయారు. నేను అంటాను.. అంటాను అంటూ శివాజీ శివాలెత్తిపోయాడు. ప్రజలు చూస్తున్నారంటూ మద్యలో లాగుతూ రాంగ్ గా మమ్మల్ని పోట్రే చేస్తున్నారంటూ శోబాశెట్టి రెచ్చిపోయి కడిగిపారేసింది. నిజానికి జ్యూరీ మెంబర్ గా ఉన్నప్పుడు ఫస్ట్ బజర్ ఎవరు కొట్టారు అనే దానిపైన శివాజీతో ఆర్గ్యూమెంట్ అయ్యింది.

అప్పుడే శోభా ఛాన్స్ కోసం వెయిట్ చేస్తోంది. అందుకే, ఇప్పుడు ఛాన్స్ దొరికేసరికి ఇచ్చిపారేసింది. ఈ గొడవకి కారణం అయిన ప్రిన్స్ కిచెన్ లోకి వచ్చి ఎక్స్ ప్లనేషన్ ఇచ్చాడు. అలాగే, అమ్మా అమ్మా అని పిలుస్తుంటే నెత్తికెక్కేస్తున్నారు. ఇక నుంచీ నా గేమ్ ఏంటో చూపిస్తా అంటూ రెచ్చిపోయాడు శివాజీ. అలాగే, ఇక్కడ ఇంక ఉండాలని లేదు అంటూ బాధపడ్డాడు. ఈ గొడవకి కారణం అయిన ప్రిన్స్ నేను ఫుడ్ తినను అని చెప్పానని అయినా శుభశ్రీ తెచ్చి ఇస్తానని రోటీ చేస్తానని అంటే సరే అన్నానని చెప్పాడు. కానీ, శుభశ్రీ మాత్రం గొడవలో ఇన్వాల్ అవ్వలేదు. దీనిపై వీకెండ్ (Bigg Boss 7 Telugu) నాగార్జున ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తికరం.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus