భారీ సినిమాలు అంటే ఠక్కున గుర్తొచ్చేది బాలీవుడ్. ఇప్పుడైతే బాలీవుడ్ పరిస్థితి బాలేదు కానీ.. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగేది. మళ్లీ నాటి రోజుల్ని తీసుకొచ్చే క్రమంలో బాలీవుడ్ బడా హీరోలు పని చేస్తున్నారు. ఇందులో భాగంగా షారుఖ్ ఖాన్ ‘డంకీ’ అనే సినిమా చేస్తున్నారు. బాలీవుడ్ విలక్షణ దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు బయటికొచ్చాయి. అందులో భారీ యాక్షన్ సీన్ కూడా ఉంది.
అక్రమ వలసల నేపథ్యంలో ‘డంకీ’ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం చాలా రోజుల తర్వాత షారుఖ్ ఖాన్ ముఖానికి రంగేసుకున్నాడు. ‘డంకీ’ సినిమా ఈ ఏడాది ఏప్రిల్‌లో సెట్స్‌పైకి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సినిమా షెడ్యూల్ ఒకటి లండన్, బుడాపెస్ట్‌లో ఇటీవల జరిగింది కూడా. త్వరలో మరో కీలక షెడ్యూల్ షూటింగ్ చేస్తారట. దీని కోసం టీమ్.. సౌదీ అరేబియాకి వెళ్తున్నారట. నవంబరు రెండో వారం నుండి 12 రోజుల పాటు ఈ సినిమా చిత్రీకరణ సౌదీ అరేబియాలో జరుగుతుందట.
ఇక ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర విషయం బయటికొచ్చింది. సినిమా కోసం 500 మందితో భారీ రేస్ సీక్వెన్స్ చిత్రీకరించారట. ముంబయిలో పెద్ద సెట్ వేసి తెల్లవారుజామున చేపట్టిన ఈ షూటింగ్లో షారుఖ్ ఖాన్‌తోపాటు బొమన్ ఇరానీ తదితరులు పాల్గొన్నారట. ఈ సీన్స్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని చెబుతున్నారు. రిస్కీ యాక్షన్ సీన్స్‌లో ఎప్పటిలాగే షారుఖ్ ఖాన్ అదరగట్టేశాడు అని అంటున్నారు. వెండితెరపై ఆ సీన్స్‌కి విజిల్స్ పక్కా అని సమాచారం.
ఇక ఈ సినిమాను డిసెంబరు 22, 2023న విడుదల కానుంది. షారుఖ్‌కి చెందిన రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది. ఇక ఈ సినిమాతోపాటు షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ సినిమా కూడా రూపొందుతోంది. తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకొని, నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.