కర్నాటకలో ‘బాబా హథీరామ్’ కోసం ప్రత్యేకమైన సెట్..?

అక్కినేని నాగార్జున నటించిన మరో భక్తిరస చిత్రం బాబా హథీరామ్. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుపుకుంటున్నాయి. కర్ణాటక, కేరళలోని పలు అందమైన ప్రదేశాల్లో ఈ చిత్రం షూటింగ్ జరుపుకోనుంది. చిత్ర వర్గాల సమాచారం ప్రకారం.. 17 శతాబ్దపు నేపథ్యంలో ఈ చిత్ర కథాంశం సాగనుండగా..కర్ణాటక లోని చిక్ మంగళూర్ లో ఎక్కువ భాగం చిత్రీకరణ జరుపుకోనుంది. అంతేకాకుండా చిక్ మంగళూర్ ప్రాంతంలో ఓ కొండ ప్రాంతపు సెట్ ను వేస్తున్నారట. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ఈ చిత్ర బృందం లొకేషన్ వేటలో ఉండగా.. త్వరలోనే నటీనటులను ప్రకటించే అవకాశం ఉంది. కే రాఘవేంద్ర రావు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మహేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి పరమభక్తుడు బాబా హథీరామ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus