మెగా ఫ్యామిలీ అంటే అభిమానులకు ఆ ఫ్యామిలీలో ఉన్న హీరోలందరూ. అయితే ఎంత కాదు అనుకున్న అల్లు అర్జున్ మెగా వారసుడిగా రాడు. ఇంతకీ విషయం ఏంటంటే…బన్నీ హీరోగా నటిస్తున్న సరైనోడు విషయంలో మెగా ఫ్యామిలీ అంతర్మధనంలో పడినట్లు. ఆ ఫ్యామిలీకి పెద్ద షాక్ తగిలినట్లు టాలీవుడ్ లో వార్త హల్‌చల్ చేస్తుంది. ఇంతకీ ఏం జరిగింది అంటే, గత ఏడాది విడుదలయిన మెగా పవర్ స్టార్ బ్రూస్ లీ, ఈ మధ్యనే విడుదలయిన పవర్ స్టార్ సర్దార్ రెండూ బాక్స్ ఆఫీస్ వద్ద డమాల్ మనడంతో, అభిమానుల ఆశలన్నీ సరైనోడు పైనే ఉన్నాయి. అయితే ఈ సినిమా కనుక భారీ హిట్ అయితే బన్నీ రేంజ్ భారీగా పెరిగి దాదాపుగా టాప్ పొసిషన్ లోకి వచ్చేస్తాడు అని మెగా ఫ్యామిలీ పైకి చెప్పుకోలేని దిగులుతో ఉంది అని తెలుస్తుంది.
అంతేకాకుండా, ‘సరైనోడు’ సినిమాకు పలికిన శాటిలైట్ రైట్స్ ఎమౌంట్ కు సంబంధించిన వార్తలు విషయం సైతం మెగా ఫ్యామిలీని విస్మయానికి గురి చేసింది. ఎప్పుడూ లేనంతగా భారీ యమౌంట్ తో ఈ రైట్స్ అమ్ముడు పోవడం విశేషం. ఈ సినిమా కోసం సన్ నెట్ వర్క్ ఏకంగా రూ.16 కోట్లు వెచ్చించినట్లు చెబుతున్నారు. అయితే అది కేవలం తెలుగు వెర్షన్ కు మాత్రమే కాదు. ఈ సినిమా తెలుగులోనే కాకుండా మళయాళం, హిందీలో సైతం విడుదల అవుతూ ఉండడంతో, అన్ని భాషలకు కలిపి హక్కుల్ని ఒకేసారి కొనుకోలు చేసింది సన్ నెట్ వర్క్. అయితే అదే క్రమంలో ఇప్పటికే ‘సర్దార్ గబ్బర్ సింగ్’ శాటిలైట్ రైట్స్ కేవలం 13 కోట్లకు అమ్ముడుపోగా, మహేష్ ‘బ్రహ్మోత్సవం’ అయితే 11.5 కోట్లకు అమ్ముడైందని తెలుస్తుంది. మరి ఈ రెండింటిని వనక్కి నెట్టి బన్నీ సినిమాకు భారీ డీల్ రావడంతో ఈ సినిమా భారీ హిట్ అయితే మెగా ఫ్యామిలీకి బన్నీనే కాంపిటేషన్ అయిపోతాడు అన్న భయం సైతం మెగా శిబిరానికి ఉన్నట్లు పబ్లిక్ టాక్. చూద్దాం ఏం జరుగుతుందో.