బిగ్ బాస్ హౌస్ లో ఆదివారం అనూహ్యంగా రాజ్ ఎలిమినేట్ అయిపోయాడు. నిజానికి ఓటింగ్ లో లీస్ట్ లో ఫైమా ఉంది. అన్ అఫీషియల్ పోలింగ్స్ లో కూడూ చూసినట్లయితే, ఫైమానే లీస్ట్ లో ఉంది. ఈవిషయం నాగార్జున స్టేజ్ పైన చెప్పాడు కూడా. పబ్లిక్ ఓటింగ్ ప్రకారం ఓటింగ్ లో లీస్ట్ లో ఉన్నవాళ్ల పేరు బోర్డ్ పై ఉంటుందని, అక్కడ ఫైమా పేరు ఉంటే, ఎవిక్షన్ ఫ్రీపాస్ వాడుకోవడం వల్ల తను సేఫ్ అయి రాజ్ ఎలిమినేట్ అవుతాడని హోస్ట్ నాగార్జున చెప్పాడు.
అసలు ఇదేం లాజిక్ అంటూ ఇప్పుడు పబ్లిక్ ప్రశ్నిస్తున్నారు. రాజ్ బోటమ్ లో ఉంటే రాజ్ ని ఎలిమినేట్ చేయాలి. అలాగే, బోటమ్ లో ఫైమా ఉంటే ఫైమా ని చేయాలి. అలా కాకండా ఎవిక్షన్ ఫ్రీపాస్ ఉంది కాబట్టి ఫైమాని సేఫ్ చేస్తే నో ఎలిమినేషన్ ఉండాలి. లెక్క ప్రకారం అలాగే చేయాలి. కానీ, ఇదేం కాన్సెప్ట్ అంటూ పబ్లిక్ ఫైర్ అవుతున్నారు. రాజ్ కి బిగ్ బాస్ అన్యాయం చేశాడని కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఈ ఎవిక్షన్ ఫ్రీపాస్ పెట్టినపుడే హౌస్ లో కన్ఫూజన్ ఏర్పడింది.
బిగ్ బాస్ హౌస్ లో ఎవిక్షన్ ఫ్రీపాస్ వల్ల గతంలో కూడా ఇలాగే చాలా ఎలిమినేషన్స్ జరిగాయి. కానీ, అది పబ్లిక్ ఓటింగ్ ప్రకారమే పంపించామని బిగ్ బాస్ టీమ్ స్టేజ్ పైన నాగార్జునతో చెప్పించారు. లాస్ట్ ఇయర్ కాజల్-ఇంకా రవి ఇద్దరూ ఉన్నప్పుడు రవి ఎలిమినేట్ అయిపోయాడు. దీంతో ఒక్కసారిగా ఇది అన్ ఫెయిర్ అంటూ సోషల్ మీడియా వేడెక్కింది. ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్ రాజ్ విషయంలో కూడా అలాగే జరిగింది.
నిజానికి ఇలాంటింది ఏమైన ఉన్నప్పుడు డబుల్ ఎలిమినేషన్ ప్లాన్ చేయాలి. అప్పుడు ఫైమా పేరు ఉంటే ఫైమా సేఫ్, రాజ్ పేరు రెండోది ఉంటే రాజ్ ఎలిమినేట్ అవుతాడు. అలాకాకుండా బిగ్ బాస్ టీమ్ క్లారిటీ లేకుండా చేశారంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. బిగ్ బాస్ ఫ్రైజ్ మనీలో నుంచీ కొంత కోత విధించి మరీ ఈ ఎవిక్షన్ ఫ్రీపాస్ టాస్క్ ని నిర్వహించాడు. ఈ టాస్క్ లోనే చెక్ పై యునిక్ ఎమౌంట్ రాసిన రాజ్ ఆవారం సేఫ్ అయ్యాడు.
మెరీనా ఎలిమినేట్ అయ్యింది. ఇక ఈవారం రాజ్ నామినేషన్స్ లోకి వచ్చాడు. దీంతో హౌస్ మేట్స్ అందరూ రాజ్ వెళ్లిపోతాడని అనుకున్నారు. అనుకున్నట్లుగానే రాజ్ ఎలిమినేట్ అయిపోయాడు. ఇక రాజ్ ఎక్కడున్న రాజే అనే మాటని ఎలిమినేషన్ లో కూడా నిరూపించాడు రాజ్. మొత్తానికి అదీ మేటర్.
లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..