‘దర్బార్’ విడుదలకు ఆటంకాలు..!

మురుగదాస్ సినిమా అంటే కచ్చితంగా ఏదో ఒక వివాదం చోటుచేసుకుంటూనే ఉంటుంది. గతంలో ‘కత్తి’ ‘సర్కార్’ వంటి సినిమాల విషయంలో కూడా అనేక వివాదాలు చోటు చేసుకున్నాయి. సరిగ్గా విడుదల సమయంలోనే ఎదో ఒక వివాదాలు రావడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. ఇప్పుడు మురుగదాస్.. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీ కాంత్ తో తెరకెక్కించిన ‘దర్బార్’ విషయంలో కూడా అదే సీన్ రిపీట్ అవుతుంది. సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కాబోతున్న ఈ చిత్రం విడుదల నిలిపివేయాలంటూ మద్రాసు హై కోర్టులో కేసు నమోదయ్యింది.

విషయంలోకి వెళితే.. ఈ చిత్రం నిర్మాతలు ఆయిన ‘లైకా ప్రొడక్షన్స్’ వారు.. గతంలో రజినీకాంత్ తో నిర్మించిన ‘2.ఓ’ చిత్రం కోసం మలేషియాకి చెందిన ఎంటర్‌టైన్మెంట్‌ కంపెనీ ‘డీ.ఎం.వై. క్రియేషన్స్‌’ నుండీ 12 కోట్ల వరకూ అప్పుగా తీసుకున్నారట. ఇప్పటికీ ఆ డబ్బుని తిరిగి చెల్లించకపోవడంతో వడ్డీతో కలిపి ఇప్పుడు 23 కోట్ల 70 లక్షలు వరకూ అయ్యిందట. ఇప్పుడు ఈ డబ్బుని చెల్లిస్తేనే కానీ ‘దర్బార్’ సినిమా విడుదల చేయకూడదంటూ ‘డీ.ఎం.వై సంస్థ’ హైకోర్టుని ఆశ్రయించింది. మరి చివరికి ఏమి జరుగుతుందో చూడాలి..!

ఈ ఏడాది ఓవర్సీస్ లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు!
2019లో మరణించిన తారలు?
ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus