Hansika Motwani: హన్సిక పై కేసు నమోదు.. ఏమైందంటే?

సీనియర్ స్టార్ హీరోయిన్ హన్సిక పై గృహ హింస చట్టం కింద పోలీస్ కేసు నమోదవ్వడం చర్చనీయాంశం అయ్యింది. వివరాల్లోకి వెళితే.. హన్సిక సోదరుడు ప్రశాంత్ మోత్వానీ ముస్కాన్ జేమ్స్ అనే టీవీ నటిని పెళ్ళాడాడు. 2020 లో వీరి వివాహం జరిగింది. వీరిది కులాంతర వివాహం. ప్రశాంత్, ముస్కాన్ ను ప్రేమించడంతో.. పెద్దలకు ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకున్నారు.

Hansika Motwani

అయితే కొన్నాళ్ళకు ప్రశాంత్, ముస్కాన్..ల మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో 2022 లోనే విడాకులు తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. అయితే అదే టైంలో తల్లి జ్యోతి, ఆడపడుచు హన్సిక..ల మాట విని భర్త ప్రశాంత్ తనని వేధిస్తున్నాడంటూ ముస్కాన్ జేమ్స్ పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ చేసింది. గృహ హింస(డొమెస్టిక్ వయొలెన్స్) చట్టం 498A కింద హన్సిక పై ప్రశాంత్ అలాగే హన్సిక, జ్యోతి..ల పై కేసు నమోదైంది. ఆ కేసును కొట్టివేయాలని హన్సిక సెషన్స్ కోర్టులో ‘క్వాష్ పిటిషన్’ దాఖలు చేయడం జరిగింది.

అలాగే ముందస్తు బెయిల్ కొరకు కూడా రిక్వెస్ట్ పెట్టుకున్నారు. ముందస్తు బెయిల్ కి అయితే న్యాయస్థానం అంగీకరించింది కానీ.. హన్సిక పిటిషన్ ను మాత్రం కోర్టు కొట్టేసినట్టు సమాచారం. దీంతో హన్సిక మళ్ళీ చిక్కుల్లో పడినట్టు అయ్యింది. మరి రాబోయే రోజుల్లో హన్సిక అలాగే ఆమె కుటుంబంపై న్యాయస్థానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తెలియాల్సి ఉంది.

ఇక హన్సిక కూడా 2022 లో తన బిజినెస్ పార్ట్నర్ అయినటువంటి సోహైల్ కతూరియాని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈమె ఎక్కువ సినిమాల్లో నటించింది లేదు. ‘మై నేమ్ ఈజ్ శృతి’ ‘105 మినిట్స్’ వంటి విమెన్ సెంట్రిక్ సినిమాల్లో నటించింది కానీ.. అవి డిజాస్టర్స్ గా మిగిలిపోయాయి. చాలా మందికి అవి వచ్చి వెళ్లినట్టు కూడా తెలీదు.

 మిరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus