భారీ బడ్జెట్ సినిమాలనే టార్గెట్ చేస్తున్న పైరసీ సంస్థ!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘సాహో’. ‘యూవీ.క్రియేషన్స్’ సంస్థ ఈ చిత్రాన్ని 350 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించింది. ప్రపంచ వ్యాప్తంగా 10,000 స్క్రీన్స్ లో ఈ చిత్రం ప్రదర్శింపబడుతోంది. రెండేళ్ళుగా ఈ చిత్రం కోసం ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ఇండియా వైడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా… ఇప్పుడు ‘సాహో’ టీమ్ కు పెద్ద షాక్ తగిలింది.

ఈరోజు విడుదలైన ఈ చిత్రం కొన్ని గంటల్లోనే ఆన్ లైన్లో దర్శనమివ్వడం అందరికీ షాకిచ్చే విషయం. ‘తమిళ్ రాకర్స్’ అనే వెబ్ సైట్ ‘సాహో’ ను లీక్ చేసింది. హైక్వాలిటీతో ‘సాహో’ చిత్రం లీకవ్వడం విశేషం. ఇక ఈ చిత్రాన్ని ఆన్ లైన్లో డౌన్ లోడ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉందని Bollywoodlife.com వెబ్ సైట్ తెలిపింది. బడా సినిమాలని తమిళ్ రాకర్స్ ఎప్పటి నుండో లీక్ చేస్తూనే వస్తుంది. మరి ఈ విషయం పై నిర్మాతలు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus