Shrian, Srisatya: ఆడియన్స్ వేసిన ప్రశ్నలకి హౌస్ మేట్స్ దిమ్మతిరిగింది..! శ్రీసత్య ఏం చెప్పిందంటే.?

  • November 18, 2022 / 10:22 AM IST

బిగ్ బాస్ హౌస్ లో పార్టిసిపెంట్స్ తమకి నచ్చినట్లుగా గేమ్ ఆడుతుంటారు. తము చాలా జెన్యూన్ గా గేమ్ ఆడుతున్నామని పదే పదే ఆడియన్స్ కి నోటీస్ అయ్యేలా చెప్తుంటారు. కానీ, ఒక్కోసారి కొంతమంది గేమ్ ఆడియన్స్ దృష్టిలో వేరేవిదంగా ఉంటుంది. అది హౌస్ లో ఉన్న పార్టిసిపెంట్స్ గుర్తించలేరు. వీకండ్ నాగార్జున గారు ఇచ్చిన ఇన్ పుట్స్ ఆధారంగానే వాళ్లు గేమ్ ని మార్చుకుంటూ వెళ్తుంటారు. అయితే, ఈసారి బిగ్ బాస్ ఆడియన్స్ అడిగే ప్రశ్నలకి జవాబు ఇమ్మని హౌస్ మేట్స్ కి ఛాన్స్ ఇచ్చాడు. దీంతో ఆడియన్స్ ఏం అడుగుతారు అనేది ఆసక్తిగా హౌస్ మేట్స్ ఎదురుచూశారు.

ఫస్ట్ శ్రీహాన్ కి వచ్చిన ప్రశ్న : హౌస్ లో కెప్టెన్ గా ఉన్నప్పుడు కీర్తితో రూడ్ గా మాట్లాడుతూ వంట చేయాల్సిందే అని చెప్పావ్. దానికి ఆమె వంటరాదని చెప్పినా వినలేదు. కానీ, శ్రీసత్య విషయంలో ఆమె వంట రాదని చెప్పిన ఎందుకు అలా చెప్పలేదు. అని అడిగారు. ఇండైరెక్ట్ గా శ్రీసత్యకి ఫెవరెటిజం చూపిస్తున్నావా అనే పంచ్ శ్రీహాన్ కి తగిలింది. దీనికి శ్రీహాన్ ఏదో ఆన్సర్ ఇస్తూ కవర్ చేయాలని చూశాడు. శ్రీసత్య నాతో ఎప్పుడు అలా చెప్పలేదని చెప్పి ఉంటే ఖచ్చితంగా తనకి కూడా అలాగే చెప్పేవాడ్ని అని అన్నాడు. ఇక పక్కనున్న కీర్తి తెగ సంరపడిపోయింది.

తర్వాత ఫైమా ఫ్రశ్న : ఫైమా మీరు మొదట్లో చాలా ఎంటర్ టైనింగ్ గా ఉండేవారు. కానీ, తర్వాత స్వార్ధపరులుగా మారిపోయారు. ఇందులో మీ అసలు రంగు ఏది ? దీనికి ఫైమా ఆటమీద ఎక్కువ ఫోకస్ పెట్టానని, ఎంటర్ టైన్మెంట్ అందుకే పక్కన పెట్టానని చెప్పింది. కసి బాగా పెరిగిందని ఆటలో చూపిస్తున్నానని చెప్పింది. ఆదిరెడ్డి ప్రశ్న : ఒక రివ్యూవర్ గా మీకు గేమ్ బాగా తెలుసని అనుకుంటారు. కానీ, నామినేషన్స్ లో సిల్లీ పాయింట్స్ తెస్తారు. మీకంటే స్ట్రాంగ్ ప్లేయర్స్ ని నామినేట్ చేయండి. అప్పుడు మీరు స్ట్రాంగ్ ప్లేయర్ అని ఒప్పుకోండి.

దీనికి ఆదిరెడ్డి నేను స్ట్రాంగ్ ప్లేయర్ తో గేమ్ ఆడేందుకు ఇష్టడతాను అని, నామినేషన్స్ లో నేను సిల్లీ పాయింట్స్ చెప్పనని అది మీకు అలా అనిపిస్తోందని అన్నాడు. అంతేకాదు, రివ్యూవర్ గా కాకుండా నన్ను ప్లేయర్ గా, కంటెస్టేంట్ గా చూడమని రిక్వస్ట్ చేశాడు. శ్రీసత్య ప్రశ్న : ఇనాయ తన ఫ్రెండ్ సూర్యని వెన్నుపోటు పొడిచిందని చెప్పారు. కానీ, మీరు రేవంత్ ని మూడుసార్లు నామినేట్ చేశారు. కెప్టెన్సీ లో తనకి సపోర్ట్ చేయలేదు. అర్జున్ ని యూజ్ చేస్కున్నారు. తన గేమ్ ని కూడా మీరే ఆడి తనని తిరిగి నామినేట్ చేశారు. మీరు చెప్పేవి మీరు పాటిస్తున్నారా.. ?

ఈ ప్రశ్నకి ఎలా ఆన్సర్ ఇవ్వాలో తెలియక కాసేపు ఆలోచించిన శ్రీసత్య ఏదో కవరింగ్ ఆన్సర్ ఇచ్చేసింది. టాస్క్ లో ఎవరైనా ఒకటే అని, అర్జున్ ని కేవలం టాస్క్ కోసమే సర్వీసెస్ చేసి డబ్బులు తీస్కున్నానని క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు, తన ఫ్రెండ్స్ అయినా కూడా తప్పుచేస్తే తప్పకుండా నామినేట్ చేస్తానని, అవసరం అయితే శ్రీహాన్ ని కూడా నామినేట్ చేయడానికి వెనకాడను అంటూ మాట్లాడింది. నేను ఏదైనా చెప్తానో అదే పాటిస్తాను అని కూడా క్లారిటీ ఇచ్చేసింది. ఆడియన్స్ అడిగిన ప్రశ్నలకి మిగతా హౌస్ మేట్స్ అందరూ బాగా ఎంజాయ్ చేశారు. ఈపాయింట్స్ పైన తర్వాత నామినేషన్స్ లో ఎవరు ఆర్గ్యూమెట్ చేస్తారు అనేది చూడాలి.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus