ఓటీటీ వల్ల నష్టాలు పాలైన కుర్ర హీరోల సినిమాలు..!

  • December 10, 2019 / 02:49 PM IST

ఇప్పటి రోజుల్లో సినిమా చూడాలంటే.. చాలా ఈజీ అయిపొయింది. ఆన్లైన్ లో బుక్ చేసుకుని తాఫీగా సినిమా టైం కు థియేటర్ కు వెళ్తున్నారు. బోలెడన్ని మల్టీ ప్లెక్స్ లు ఉన్నాయి. అనుకూలమైన టైమింగ్స్ లో షో లు ఉంటున్నాయి. కానీ ఒకప్పటి పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉండేది అన్న సంగతి తెలిసిందే. సినిమాకి వెళ్ళాలి అంటే.. ఓ గంట ముందు థియేటర్ కు వెళ్ళి అక్కడ లైన్లో నిలబడేవారు. అక్కడ దొరకక పోతే బ్లాక్ లో ఎంతైనా పెట్టి టికెట్ కొనేవారు. ఇప్పుడు అసలు ఆ పరిస్థితి లేదు. పెద్ద సినిమానో లేక సూపర్ హిట్ టాక్ వస్తేనే థియేటర్ కు వెళ్తున్నారు. లేకపోతే వెంటనే పైరసి లో చూద్దాం.. పోనీ క్లారిటీ కోసం ఓ 4 వారాలు ఎదురు చూస్తే చాలు ఏదో ఒక ఓటీటీ ప్లేట్ ఫామ్లో వచ్చేస్తుంది… అనుకుంటూ లైట్ తీసుకుంటున్నారు ప్రేక్షకులు.

నవంబర్ 15 న విడుదలైన సందీప్ కిషన్ ‘తెనాలి రామకృష్ణ బి.ఏ.బి.ఎల్’ చిత్రం అప్పుడే ఓటీటీ ప్లాట్ ఫామ్లోకి వచ్చేస్తుందని సమాచారం. ఈ చిత్రంలో కామెడీ బాగుంది అని కొంతమంది చెప్పినప్పటికీ.. చిత్ర యూనిట్ సభ్యులు కూడా సక్సెస్ మీట్ లు అంటూ తిరిగినప్పటికీ ప్రేక్షకులు థియేటర్ కు వెళ్ళలేదు. దీంతో ఈ చిత్రానికి నష్టాలు తప్పలేదు. ఇక విజయ్ దేవరకొండ తన సొంత బ్యానర్ పై నిర్మించిన ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాకి కూడా డీసెంట్ టాక్ వచ్చింది. వీకెండ్ వరకూ జనాలు బాగానే వెళ్ళారు కానీ ఆశించిన స్థాయిలో కాదు. ఈ చిత్రాన్ని కూడా ఆన్లైన్ లో చూసుకోవచ్చు లే అని లైట్ తీసుకున్నారు. విజయ్ కు ఈ చిత్రం మంచి లాభాల్నే ఇచ్చింది కానీ ఒక్క నైజాం మినహాయిస్తే మిగిలిన డిస్ట్రిబ్యూటర్ లు నష్టపోయారు అనే చెప్పాలి. ఈ చిత్రం కూడా ఇప్పుడు ‘హాట్ స్టార్’ లో దర్శనమివ్వబోతుందని సమాచారం. ఇలా అయితే ప్రేక్షకులు పూర్తిగా సినిమాలు చూడటానికి థియేటర్లకు వస్తారా అనే అనుమానం కూడా కలుగుతుంది.

24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ అండ్ లైక్స్ సాధించిన లిరికల్ సాంగ్స్ ఇవే!
30 సౌత్ ఇండియన్ హీరోయిన్లు మరియు వారి చైల్డ్ హుడ్ పిక్స్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus