‘బిగ్ స్నేక్ కింగ్’ ట్రైలర్ అండ్ మూవీ రిలీజ్ డేట్ అప్డేట్

Ad not loaded.

యెలూరు సురేంద్ర రెడ్డి సమర్పణ లో బుద్ధ భగవాన్ ప్రైవేట్ లిమిటెడ్ లో వస్తున్న సినిమా “బిగ్ స్నేక్ కింగ్ “మార్చి 3న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్, అవుతున్న ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఫిబ్రవరి 14న జరుగుతుంది.

 

చైనాలోని ఒక గ్రామంలో, ఆ గ్రామానికి చెందిన లీ కొంతమంది గ్రామస్తులని అక్రమ తవ్వకాల కోసం ఒక గుహ దగ్గరకి తీసుకువెళ్తాడు. అయితే, వారి కారణంగా వందేళ్లుగా నిద్రపోతున్న అతిపెద్ద పాము అనూహ్యంగా నిద్రలేస్తుంది. ఆ గ్రామస్థులు తప్పించుకునే సమయంలో, లీ మాత్రమే బ్రతికి బయటపడతాడు. కొన్ని రోజుల తర్వాత, ఆ పెద్ద పామును తరిమికొట్టడానికి గ్రామ పెద్దలు యాగాలు చేయడం ప్రారంభిస్తారు. అప్పుడు మాహారాజు కుమారుడు చెంగ్ ఆ గ్రామానికి వచ్చి వారికి సహాయం చేస్తాడు. లీ కుమార్తె మింగ్ యు కూడా అతనితో కలిసి సహాయం చేస్తుంది. వారిద్దరూ పెద్ద పామును గ్రామస్తుల నుండి దూరంగా మళ్లించి డైనమైట్తో చంపేస్తారు. చివరగా, భూమిపై ఏ ప్రాణికి హాని చేయకూడదని గ్రామస్తులందరూ ప్రతిజ్ఞ చేస్తారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus