‘బిగ్ బాస్ 3’ లేటెస్ట్ అప్డేట్..?

‘బిగ్ బాస్’ షో తెలుగులో కూడా బాగా పాపులరయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మొదటి సీజన్ ను ఎన్టీఆర్, రెండో సీజన్ ను నాని హోస్ట్ చేసారు. ఇక మూడో సీజన్ ను నాగార్జున హోస్ట్ చేయబోతున్నాడని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ ప్రోమోని విడుదల చేసారు. ఆ ప్రోమోలో హోస్ట్ ఎవరనేది చూపించలేదు. అయితే హోస్టే నాగార్జునేనని రెవీల్ చేస్తూ మరో ప్రోమోని షూట్ చేస్తున్నారట. మార్కెట్ వాతావరణాన్ని తలపించే ఓ సెట్ ఈ ప్రోమో కోసం ప్రత్యేకంగా వేశారని సమాచారం. ఇదిలా ఉండగా ఈ షో లో ఇప్పటి వరకూ కంటెస్టెంట్స్ ఎవరనేది విషయం పై రక రకాల వార్తలు వస్తున్నప్పటికీ ఫైనల్ అయిన పేరు మాత్రం శ్రీముఖి,లాస్య లు మాత్రమే అని తెలుస్తుంది.

ఈ షో కోసం వారికీ భారీ మొత్తాన్ని పారితోషికంగా ఇస్తున్నారట. శ్రీముఖికి రూ.50 లక్షలు.. లాస్యకు రూ.30 లక్షలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అది కూడా సింగిల్ పేమెంట్ గా ఇస్తున్నారట. షోలో ఎన్ని వారలు ఉన్నా .. వీరికి ఆ అమౌంట్ హౌస్ లోకి వెళ్ళే ముందే అందుతుందని సమాచారం. ఒకవేళ.. వీరే ఫైనలిస్ట్ లు అయితే మాత్రం.. రెమ్యునరేష తో ప్రైజ్ మనీ కూడా అందుతుందన్నది తెలిసిన సంగతే. షో కి మంచి క్రేజ్ రావడం కోసం వీరిద్దరికి ఇంత భారీ మొత్తం ముట్టజెబుతున్నట్టు తెలుస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus