బిగ్ బాస్ 4: నాగ్ యాంకరింగ్ పై ఆడియన్స్ ఫైర్..!

బిగ్ బాస్ సీజన్ – 3 జరిగేటపుడు నాగార్జున యాంకరింగ్ పై వచ్చిన విమర్శలు మళ్లీ ఇప్పుడు మొదలవుతున్నాయి. అప్పట్లో అస్సలు నాగ్ ఎపిసోడ్స్ చూడలేదని, జస్ట్ లైక్ దట్ వచ్చి యాంకరింగ్ చేశారని చాలామంది ఆడియన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టి ధ్వజమెత్తారు. అయితే, సీజన్ 3 లాస్ట్ కి వచ్చేటపుడు నాగ్ యాంకరింగ్ దుమ్మురేపాడని ఇదే కామెంట్స్ చేసినవాళ్లు పోస్ట్ లు పెట్టారు. ఇప్పుడు సీజన్ 4 స్టార్ట్ అయినపుడు నాగ్ యాంగరింగ్ సూపర్బ్ అని, పార్టిసిపెంట్స్ మాత్రం బాగోలేదని విమర్శలు వచ్చాయి. షోకి వస్తున్న అనూహ్యమైన రెస్పాన్స్ చూసిన తర్వాత , రేటింగ్స్ చూసిన తర్వాత ఈసీజన్ కూడా బాగుందని అన్నారు చాలామంది. పార్టిసిపెంట్స్ కి బాగా అలవాటు పడ్డారు.

అయితే, రీసంట్ గా బిగ్ బాస్ ఈ సీజన్ లో రీజన్ లేకుండా చేస్తున్న పనులని మాత్రం దుమ్మెత్తిపోస్తున్నారు. ముఖ్యంగా ఎలిమినేషన్ అనేది సరిగ్గా జరగట్లేదని బాగా విమర్శలు వచ్చాయి. కానీ నాగార్జున స్టేజ్ పైన వీటిని కొట్టిపారేశారు. ఎలిమినేషన్ అనేది పబ్లిక్ ఓటింగ్ ప్రకారమే జరుగుతోందని, అందుకే పబ్లిక్ ఓట్లు వేయడం నేను మీకు ప్రామిస్ చేస్తున్నా అన్నాడు. దీంతో ఆడియన్స్ కాస్త చల్లబడ్డారు. కానీ, ఇప్పుడు నోయల్ స్టేజ్ పైన హౌస్ మేట్స్ తో ప్రవర్తించిన తీరుని చాలామంది తప్పుబడుతున్నారు. నోయల్ అడగడంలో తప్పులేదు కానీ, తోటి హౌస్ మేట్స్ న ఒంటికాలిపై నించోబెట్టి అడగడం అనేది ఏంటని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, నాగార్జున యాంకర్ గా స్టేజ్ పైన ఉన్నప్పుడు అసలు రెస్పెక్ట్ లేకుండా ఇలా మాట్లాడటం కరెక్టేనా అని వాదిస్తున్నారు. కొంతమంది అయితే, నోయల్ చేసింది కరెక్టే అని, నాగ్ కావాలనే అవకాశం ఇచ్చారని కూడా చెప్తున్నారు.

ఈ టైమ్ లో నాగార్జున అస్సలు రియాక్ట్ అవ్వకపోవడం, అసలు ఏం జరిగింది అనేది ఆడియన్స్ కి వీడియో అయినా చూపించకపోవడాన్ని తప్పు బడుతూ ఫైర్ అవుతున్నారు. ఇప్పటివరకూ నాగ్ యాంకరింగ్ ని సూపర్బ్ అని అన్నవాళ్లు ఇప్పుడు నోయల్ చేసిన పనికి నాగ్ పై ఫైర్ అవుతున్నారు. అంతేకాదు, నోయల్ కోసం ఎలిమినేషన్ ఎత్తేయడమేంటి అని కూడా ప్రశ్నిస్తున్నారు. ఈసారి అయినా ఫైయిర్ గా ఎలిమినేషన్స్ రిజల్డ్స్ ని పబ్లిక్ కి చూపించాలని డిమాండ్ చేస్తున్నారు. అదీమేటర్.

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus