Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » బిగ్‌బాస్‌ 33 వ రోజు రివ్యూ: చాలా రోజుల తర్వాత ఓ మంచి ఎపిసోడ్‌!

బిగ్‌బాస్‌ 33 వ రోజు రివ్యూ: చాలా రోజుల తర్వాత ఓ మంచి ఎపిసోడ్‌!

  • October 10, 2020 / 11:26 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్‌బాస్‌ 33 వ రోజు రివ్యూ: చాలా రోజుల తర్వాత ఓ మంచి ఎపిసోడ్‌!

ఉదయాన్నే హుషారైన పాట… తర్వాత కాసిన్ని ముచ్చట్లు, ఆ తర్వాత ఓ టాస్క్‌… అదయ్యాక ఇంకొన్ని ముచ్చట్లు.. ఆ తర్వాత ఓ సరదా టాస్క్‌.. అదీ అయ్యాక ఇంకొన్ని సరదాలు… ఇదీ బిగ్‌బాస్‌ షో చూసే ప్రేక్షకుడు ఆశించేది. అలాంటి రోజు ఈ 33వ రోజు. అవును శుక్రవారం ఎపిసోడ్‌లో ఇలాంటివన్నీ జరిగాయి. ఇంకా ఈ రోజు ఏమేం చూపించారంటే!

* మార్నింగ్‌ మస్తీలో భాగంగా బిగ్‌బాస్‌ ఈ రోజు ఇంటి సభ్యులను ఏదైనా జీవిత సందేశం ఇవ్వమని ఆదేశించాడు. దీంతో నోయల్‌, అవినాష్‌, గంగవ్వ తమ జీవితంలో జరిగిన కొన్ని విషయాలను వివరించారు. వాటి నుంచి తెలుసుకోవాల్సింది ఏంటి, ఆచరించాల్సింది ఏంటి అనే వివరాలు కూడా చెప్పారు. తన తల్లి తనకు మంచి స్నేహితురాలని, ఆమె కోసం ఇక్కడకు వచ్చానని నోయల్‌ చెప్పాడు. ఓ తల్లిగా ఆమె పడ్డ కష్టం గురించీ వివరించాడు.

Click Here-> ఆత్మహత్య చేసుకుందామనుకున్న అవినాష్‌… ఏమైందంటే?

Click Here-> చనిపోయిన బిడ్డతో బస్సెక్కిన గంగవ్వ…

* బిగ్‌బాస్‌ ఈ వారం లగ్జరీ బడ్జెట్‌ టాస్క్‌ ఇచ్చాడు. రెండు స్లైడ్స్‌ పెట్టి వాటికి తాడు పెట్టాడు. ఆ తాడు పట్టుకొని పైన ఉన్న బొమ్మ జుట్టుకు అందించిన ట్యాగ్స్‌ తీసుకురమ్మని చెప్పాడు. ఇందులో అఖిల్‌ 11, మెహబూబ్‌ 12 ట్యాగ్స్‌ తీసుకున్నారు. అలా మెహబూబ్‌ టాస్క్‌లో గెలిచాడు.

* ఈ టాస్క్‌ తర్వాత… అఖిల్‌ గత లగ్జరీ బడ్జెట్‌ ఎంపిక నాటి విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. ‘గత టాస్క్‌ సమయంలో నేను తప్పుగా ఫుడ్ ఆర్డర్‌ చేశానని అందరూ అన్నారు. కానీ ఇప్పుడు అలా వచ్చిన ఫుడ్‌ను అందరూ తింటున్నారు’ అంటూ గుర్తు చేశాడు. లగ్జరీ ఫుడ్‌ ఎంపికలో నేను సరిగ్గా పని చేయలేదని నన్ను నామినేట్‌ చేశారు అంటూ వీక్షకులక హింట్‌ ఇచ్చాడు.

* కొత్త కెప్టెన్‌ సోహైల్‌ నిద్ర పోతున్నాడంటూ బిగ్‌బాస్‌కు ఆరియానా లింక్‌ ఇచ్చింది. పదే పదే కెమెరాను చూస్తూ విషయం న్యాక్‌గా చెప్పేసింది. దీంతో ఇంట్లో చాలా రోజుల తర్వాత కుక్కలు మొరిగాయి. అన్నట్లు పాత కెప్టెన్‌ కుమార్‌ సాయి విషయంలోనూ ఇలానే జరిగింది.

* బిగ్‌బాస్‌ ఎవరికీ కనిపించడు.. మాటలు మాత్రమే వినిపిస్తాయి. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఈసారి బిగ్‌బాస్‌ను మీ మధ్యకే తీసుకొస్తా అంటూ బిగ్‌బాస్‌ కొత్త టాస్క్‌ను క్రియేట్‌ చేశాడు. అది కాస్త ఓవర్‌ అనిపించినా… బిగ్‌బాస్‌ ఆత్మ ఆవహించాక అవినాష్‌ చేసిన సందడి అయితే సూపర్‌. ఒక్కో ఇంటి సభ్యులు అడిగిన ప్రశ్నలకు బిగ్‌బాస్‌ ఆత్మ సమాధానాలిచ్చింది.

Click Here -> ఆత్మతో బిగ్‌బాస్‌ హౌస్‌మేట్స్‌ రచ్చ రచ్చ

* చాలా రోజుల తర్వాత సాగదీత టాస్క్‌లు లేకపోవడంతో ఇంటి సభ్యులు ఈ రోజు జాలీగా కనిపించారు. అమ్మ రాజశేఖర్‌, అవినాష్‌, ఆరియానా, సోహైల్‌, కుమార్‌ సాయి, అఖిల్‌, దివి సరదాగా పాటలు పాడుకుంటూ కనిపించారు. ప్రేమ పాటలు, విరహ గీతాలు, రీమిక్స్‌ పాటలు పాడుకుంటూ ఎంజాయ్‌ చేశారు. పాటలకు ఫన్నీగా స్టెప్పులు వేస్తూ అలరించారు.

* రాత్రి అందరూ నిద్రపోతున్న సమయంలో మోనాల్‌, దివి, అమ్మ రాజశేఖర్‌, అవినాష్‌ మధ్య ఓ చర్చ జరిగింది. చర్చ అనడం కంటే మోనాల్‌ బ్రెయిన్‌ వాష్‌ చేయడానికి ట్రై చేశారు. మోనాల్‌కు నేనంటేనే ఇష్టం అంటూ అఖిల్‌, అభిజీత్‌ అనుకుంటున్నారని దివి చెప్పింది. నామినేషన్‌ కంటే ముందు ఇద్దరితో మాట్లాడి ‘నువ్వంటే ఇష్టం అని క్రియేట్‌ చేయడం’ నీ మిస్టేక్‌ అంటూ దివి మోనాల్‌కు చెప్పింది. అయితే అఖిల్‌ను నమ్మొచ్చు అని మాస్టర్‌ అంటే… ఇద్దరూ జెన్యూన్‌ అని దివి చెప్పింది. మరి ఈ మాటలు మోనాల్‌ వింటుందో, లేదంటే గతంలోలాగే మళ్లీ అఖిల్‌, అభిజీత్‌ మధ్య చర్చకు పెడుతుందో చూడాలి.

Most Recommended Video

చిన్నపిల్లలుగా మారిపోయిన ‘బిగ్ బాస్4’ కంటెస్టెంట్స్.. ఎలా ఉన్నారో మీరే చూడండి..!
‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!
భీభత్సమైన బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరోలే తరువాత భయంకరమైన డిజాస్టర్లు కూడా ఇచ్చారు…!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abijeet
  • #Abijeet Duddala
  • #Akhil Sarthak
  • #Alekhya Harika
  • #Amma Rajasekhar

Also Read

R.B.Choudary: సీనియర్ స్టార్ నిర్మాత ఆర్.బి.చౌదరి మృతి

R.B.Choudary: సీనియర్ స్టార్ నిర్మాత ఆర్.బి.చౌదరి మృతి

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

related news

Brahmastra 2: ‘బ్రహ్మాస్త్ర 2’ ని టేకప్ చేయనున్న ‘రామాయణ’ నిర్మాత!

Brahmastra 2: ‘బ్రహ్మాస్త్ర 2’ ని టేకప్ చేయనున్న ‘రామాయణ’ నిర్మాత!

trending news

R.B.Choudary: సీనియర్ స్టార్ నిర్మాత ఆర్.బి.చౌదరి మృతి

R.B.Choudary: సీనియర్ స్టార్ నిర్మాత ఆర్.బి.చౌదరి మృతి

2 hours ago
Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

7 hours ago
Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

7 hours ago
Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

8 hours ago
Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

8 hours ago

latest news

R Balki: టాలీవుడ్‌ నుండి బాలీవుడ్‌ ఈ విషయం నేర్చుకోవాలి.. స్టార్ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

R Balki: టాలీవుడ్‌ నుండి బాలీవుడ్‌ ఈ విషయం నేర్చుకోవాలి.. స్టార్ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

6 hours ago
Vijay: పాలిటిక్స్‌లో బంపర్‌ ఎంట్రీ.. మరి విజయ్‌ సినిమాల్లోకి వచ్చినప్పుడు ఏమైందో తెలుసా?

Vijay: పాలిటిక్స్‌లో బంపర్‌ ఎంట్రీ.. మరి విజయ్‌ సినిమాల్లోకి వచ్చినప్పుడు ఏమైందో తెలుసా?

6 hours ago
Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

1 day ago
Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

1 day ago
Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version