బిగ్‌బాస్ ఇంట్లో బయటకు కనిపించే నవ్వు నవ్వు కాదు.. బయటకు అన్న మాట మనసులో మాట కాదు. చూపించే ప్రేమ మనసులో ఉండదు అంటుంటారు. గతంలో చాలా సార్లు ఇది బయట పడింది. అందుకే ఎవరి మనసులో ఎవరు ఏమనుకుంటున్నారో నాగార్జున బయటకు తీసుకొచ్చారు. గతంలో వివిధ సందర్భాల్లో ఇంటి సభ్యులు ఒకరి గురించి ఒకరు అన్న మాటలు వినిపించాడు. అవి ఎవరు అన్నారో ఊహించమన్నాడు. కొంతమంది సరిగ్గా చెబితే.. ఇంకొందరు చెప్పలేకపోయారు.
* ‘టాస్క్ సమయంలోవ క్రూర మనస్తత్వం ఉంటుంది’ అని అవినాష్ గురించి ఎవరో అన్నారని నాగ్ చెప్పాడు. అలా అన్నది దివి అని అవినాష్ సరిగ్గానే ఊహించాడు. ‘పేడలో బటన్స్’ టాస్క్ సమయంలో దివి చాలాసేపు ఆడుతోందని అవినాష్ కెమెరా ముందుకు వచ్చి చెప్పాడట. దాంతో దివి అలా అనుకుంది.
* మెహబూబ్‌ను ఉద్దేశిస్తూ ‘ఫ్రెండ్‌షిప్ సర్కిల్ సెట్ చేసుకుని.. వాళ్లను స్వార్థపూర్వకంగా వాడుకోవాలని అనుకుంటాడు. స్వార్థపరుడు కానీ.. స్నేహం కోసం అన్నట్లు కలరింగ్ ఇస్తాడు’ అని కుమార్ సాయి అన్నాడు. ఈ మాటలు అతనే అన్నాడని మెహబూబ్ ఊహించేశాడు. గేమ్, టాస్క్ టైమ్‌లో ఓ గ్రూపు పెట్టుకుని వాళ్లు గెలవాలని చూస్తాడు అని కుమార్ చెప్పాడు.
* లాస్యది మోసపూరిత నవ్వు అని అమ్మ రాజశేఖర్ మాస్టర్ అన్నారు. కానీ లాస్య ఫస్ట్ అటెంప్ట్‌లో చెప్పలేకపోయింది. ఆ మాట అన్నది దివి అనుకుంది. అయితే రెండో ప్రయత్నంలో మాస్టర్ అని చెప్పింది.
* అభిజీత్‌కు చాలా అహంకారం అని ఇంట్లో ఒకరు అన్నారని నాగ్ చెప్పాడు. ఆ మాట అన్నది అఖిల్ అనుకుని అభిజీత్ చెప్పాడు. తర్వాత మోనాల్ పేరు చెప్పాడు. కానీ ఇద్దరూ రాంగ్. ఇంట్లో ఆ మాట అన్నది దివి అని నాగార్జున చెప్పారు. మోనాల్, అఖిల్‌ను తప్పుగా అర్థం చేసుకున్నావని అభితో నాగ్ చెప్పారు.
* నోయల్‌ది తాత్కాలిక స్నేహం అంటూ అవినాష్ గతంలో ఒకసారి అన్నాడు. అయితే నోయల్ అతనని గుర్తించలేకపోయాడు. అమ్మ రాజశేఖర్, దివి పేర్లు చెప్పాడు. అవన్నీ తప్పయిపోయాయి.
* ఇంట్లో పెద్ద గొంతేసుకుని పాటలు పాడుతోందని, అతిగా స్పందిస్తోందని, కొన్నిసార్లు హద్దులు దాటుతోందంటూ ఆరియానా గురించి ఒకరు అన్నారని నాగ్ చెప్పారు. అయితే ఆరియానా ఆ మాటలు ఎవరన్నారో చెప్పలేకపోయింది. లాస్య, మోనాల్ పేర్లు చెప్పింది. కానీ ఆ మాటలు అన్నది మెహబూబ్.
* దివికి చాలా అహంకారం అని, ఇంట్లోవాళ్లపట్ల అగౌరవంగా ఉంటుందని, సభ్యత లేకుండా మాట్లాడుతుందని ఒకరు అన్నారట. ఆ మాటలు అన్నది అవినాష్ లేదా లాస్య అనుకుంది. అయితే ఆ ఇద్దరి పేర్లూ కరెక్ట్ కాదని నాగ్ చెప్పారు. అయితే ఆ మాట అన్నది మోనాల్.
* అఖిల్ గురించి అభిజీత్ గతంలో ఓ మాట అన్నాడు. ‘‘తనను తాను నిజాయతిపరుడుగా, ఎటువంటి వంచనలేని మనషిగా చూపించుకుంటాడు. కానీ కాదు’’ అభిజీత్ అన్నాడు. అయితే అఖిల్ తొలుత కుమార్ సాయి పేరు చెప్పాడు. అది తప్పనేసరికి అభిజీత్ పేరు చెప్పాడు అఖిల్.
* మోనాల్ ఓ అబద్దాలు కోరు అని అభిజీత్ అన్నాడట. అయితే మోనాల్ తొలుత ఆ మాట అన్నది దివి అనుకుంది. కానీ రాంగ్ అయ్యింది.
* అమ్మ రాజశేఖర్ ఇంట్లో అందరినీ ఏమారుస్తాడని, దానిని నిజాయతి ముసుగులో దాచుకుంటాడని అభిజీత్ అన్నాడు. అమ్మ రాజశేఖర్ కరెక్ట్‌గానే గెస్ చేశాడు. హోటల్ టాస్క్ సమయంలో మాస్టర్ ఏమార్చాడని అభిజీత్ చెప్పాడు.