బిగ్‌బాస్‌4: అమ్మ ఇల్లిల్లూ తిరిగి చీరలమ్మేది… నాన్న రిక్షా తొక్కేవాడు!

  • October 16, 2020 / 06:10 PM IST

బిగ్‌బాస్‌ ఇంటికి వచ్చినవాళ్లందరి నవ్వులు వెనుక, సరదాల వెనుక.. చాలా పెద్ద కథే ఉంటుంది. ఆ మాటకొస్తే ప్రతి ఒక్కరి వెనుక ఓ కథ ఉంటుంది అనుకోండి. కానీ తమను తాము నిరూపించుకోవడానికి, ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్‌ చేయడానికి ఇంట్లోకి వచ్చిన వారి జీవితంలో ఆ కీలకమైన సంఘటన, కష్టం ఏంటో తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. అందుకేనేమో బిగ్‌ బాస్‌ ప్రతి సీజన్‌లో అలాంటి రోజు తీసుకొచ్చాడు. బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్లకు తమ ఓల్డ్‌ మెమొరీస్‌ చూపించి… వాళ్లను పాత రోజులకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత తమ జీవితంలో కీలకమైన సంఘటనలు చెప్పమన్నాడు.

* నా తొమ్మదేళ్ల వయసులోనదే నా జీవితంలో పెద్ద మార్పు వచ్చింది. పేదరికం అంటే ఏంటో తెలిసింది. నా స్కూల్‌ ఫీజు ₹50 కట్టడానికి కూడా అమ్మ దగ్గర డబ్బులు లేవు. అప్పుడు మా అమ్మ ఊళ్లో ఇళ్లిల్లూ తిరిగి చీరలు అమ్మిది. అలా మమ్మల్ని పెంచి పెద్దవాళ్లను చేసిందంటూ మోనాల్‌ తన కుటుంబాన్ని గుర్తు చేసుకుంది.

Click Here – ఒకటిన్నర నెలలు ఆవకాయతోనే అన్నం తిన్న హారిక

* సోహైల్‌ వాళ్ల నాన్న సింగరేణిలో పని చేస్తారు. ఆ కష్టంతోనే ఇంట్లో ఐదుగురు సంతానాన్ని పెంచారు. అయితే అతను గనిలో పని చేసే రోజుల్లో తల మీద ఓ బొగ్గు రాయి పడింది. ఆ ప్రభావం ఇటీవల తెలిసిందట. తలలో బ్లడ్‌ క్లాట్‌ అయ్యింది. మా నాన్న నా హీరో. నన్ను సింగరేణి ముద్దు బిడ్డ అంటుంటాడు. నేను ఇక్కడికి రావడం గర్వంగా చెప్పుకుంటాడు అంటూ ఆనందంగా చెప్పాడు సోహైల్‌.

* ‘‘నా కోసం మా కుటుంబం మొత్తం చాలా కష్టపడింది. గుంటూరులో కూరగాయల వ్యాపారం చేసేవాడు మా నాన్న. వయసు పైబడుతుంటే నాన్నకు ఆసరాగా మా ఇద్దరి అన్నదమ్ముల్లో ఒకరు ఉండిపోవాల్సి వచ్చింది. అప్పుడు మా తమ్మడు ఎంతో పెద్దవాడిలా ఆలోచించి వాడు ఉండిపోయాడు. అలా వాళ్లు కష్టపడితేనే నేను ఇంజినీరింగ్‌ చేయగలిగాను’’ అని మెహబూబ్‌ చెప్పాడు. అమ్మకు ఓ కన్ను లేదు. వైద్యం చేయించుకుంటే నయమవుతుందని తెలిసినా చేయించుకోకుండా నా కోసమే ఆలోచించారు. నాకు బైక్‌ కొనాలి, మొబైల్‌ కొనాలి, నేను బాగుండాలనే చూసుకున్నారు. మా తమ్ముడికి ఏం చేయలేదు. అంతలా నా కోసం త్యాగం చేసిన వారి కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను అని చెప్పాడు మెహబూబ్‌.

Click Here – అంతా రాజకీయాలే… ₹500 కోసం పని చేశా: ఆరియానా

* ‘‘అమ్మంటే నాకు చాలా ఇష్‌టం. డ్యాన్సర్‌గా చేస్తున్నప్పటి నుంచి నేను సంపాదించిన డబ్బులు ఆమెకే ఇచ్చేవాణ్ని. ఆ సమయంలో నాన్నను పెద్దగా కేర్‌ చేసేవాణ్ని కాదు. అమ్మ ఆస్తి విషయం చర్చకు వచ్చేసరికి.. అమ్మ నాకే ఇవ్వమంది. కానీ మా కుటుంబ సభ్యులు ఆమె మనసు మార్చేసి నాకు కొన్నాళ్లు దూరం చేశారు. కొన్నాళ్లకు ఆమె ఆస్తి మొత్తం కొట్టేసి ఆరోగ్యం బాగోలేదని ఆసుపత్రిలో జాయిన్‌ చేసి నాకు ఫోన్‌ చేశారు. వెళ్లి చూస్తే పరిస్థితి అస్సలు బాగోలేదు. వెంటనే హైదరాబాద్‌ తీసుకొచ్చేశాను. ఇక్కడ ఓ పెద్ద స్టార్‌ సాయంతో పెద్ద ఆస్పత్రిలో జాయిన్‌ చేశాను. ఇక లాభం లేదని ఆ డాక్టర్లు చెప్పేశారు. దీంతో చిన్న ఆస్పత్రిలో జాయిన్‌ చేశాను. అక్కడ కొన్ని రోజులు వైద్యం అందాక ఆమ్మ చనిపోయింది’’ అంటూ తన గతం గురించి వివరించాడు అమ్మ రాజశేఖర్‌ మాస్టర్‌. అందుకే డబ్బులకు విలువ ఇవ్వొద్దు. కేవలం మనుషులు, ప్రేమను మాత్రమే విలువ ఇవ్వాలి. ప్రేమ ఇప్పడు కోల్పోతే మళ్లీ రాదు అంటూ జీవిత సత్యం చెప్పాడు మాస్టర్‌.

Click Here – మా ఆయనకు ఐడెంటిటీ ఇవ్వలేదు: లాస్య

* ‘‘మా చదువు, జీవితం కోసం అమ్మ, నాన్న పట్నం వచ్చేశారు. బతుకు బండి నడపడానికి నాన్న రిక్షా తోలేవారు. ఇస్త్రీ పని, మేస్త్రీ పని కూడా చేశారు. అలానే మమ్మల్ని ఇంతవాళ్లను చేశారు. మా నాన్న చిరంజీవికి పెద్ద ఫ్యాన్‌. ఆయన సినిమా పాటలు రిలీజ్‌ అయితే… క్యాసెట్‌ ఎంత కష్టమైనా కొనుక్కొచ్చేవారు. ఇంట్లో టేప్‌రికార్డర్‌లో ఆ పాటలే. కొన్నాళ్ల తర్వాత ‘ఈగ’లో ఓ చిన్న పాత్ర చేశాను. ఆ తర్వాత ‘నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్‌’ అనే సినిమా చేశాను. దానిని సంధ్య 35 ఎంఎంలో వేశారు. పక్కన 70 ఎంఎంలో ‘ధృవ’ ఆడుతోంది. ఓ రోజు మా నాన్నను థియేటర్‌కి తీసుకెళ్లి నా సినిమా చూపించాను. సినిమా సమయంలో నాతో అభిమానులు సెల్ఫీలు దిగుతుంటే మా నాన్న చూసి సంతోషించారు. ఆ తర్వాత నా హీరో అయినా మా నాన్నతో సెల్ఫీ దిగాను’’ అంటూ నోయల్‌ తన జీవితం గురించి చెప్పాడు.

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus