బిగ్‌బాస్‌ 4: ఆరో రోజు భలే ముచ్చట్లు!

బిగ్‌బాస్‌లో తొలి వీకెండ్‌లో తొలి రోజు గడిచిపోయింది. ఈ రోజు బిగ్‌బాస్‌లో చాలా విషయాలు జరిగాయి. ఇంట్లో జరిగిన విషయాల గురించి నాగార్జున రివ్యూ చేశాడు. కట్టప్ప ఎవరు అనే లాంగెస్ట్‌ టాస్క్‌కు ఓ ముగింపు ఇచ్చాడు. అలాగే ముగ్గురుని ఎలిమినేషన్‌ నుండి సేఫ్‌ చేశాడు. ఇంకా ఆరో రోజు టెలీకాస్ట్‌లో ఏం జరిగిందంటే…

* ఈ వీకెండ్‌ని నాగార్జున ‘బాహుబలి’ పాటతో మొదలుపెట్టాడు. డ్యాన్సర్ల కత్తి విన్యాసాల స్టెప్పుల మధ్య బాస్‌ నడుచుకుంటూ వచ్చి కత్తి తిప్పితే రెండు కళ్లు చాలలేదనుకోండి. బ్లూ అండ్‌ బ్లూ డ్రెస్‌ నాగ్‌ కుర్రాడిలా కనిపించాడంటే అతిశయోక్తి కాదు.

* ఈ వారం నామినేషన్‌లో ఉన్న వారి కోసం పోలైన ఓట్లు… బిగ్‌ బాస్‌ చరిత్రలోనే తొలిసారట. కాల్స్‌, హాట్‌స్టార్‌ యాప్‌లో పోలైన ఓట్లు కలిపి ఏకంగా ఐదు కోట్ల ఓట్లు నమోదైనట్లు నాగ్‌ గర్వంగా చెప్పాడు. గంగవ్వ నామినేషన్‌లో ఉండటమూ ఓ కారణమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

* ‘హవ్వా హవ్వా.. ’పాటను గంగవ్వకు డెడికేట్‌ చేసేలా హౌస్‌మేట్స్‌ ఓ పాట పాడారు. ‘అవ్వ… అవ్వ’ అంటూ పాట పాడుతూ చుట్టూ తిరుగుతూ సందడి చేశారు. మధ్య గంగవ్వ చప్పట్లు కొడుతూ తెగ ఎంజాయ్‌ చేసింది. డ్యాన్స్‌ చేసిన వారిలో మెహబూబ్‌, లాస్య, నోయల్‌, అమ్మ రాజశేఖర్‌, సోహైల్‌, సుజాత, ఉన్నారు.

* ఇంటిలో అమ్మ రాజశేఖర్‌, సూర్యకిరణ్‌తోనే తనకు సమస్య అని హారిక చెప్పింది. వాళ్లు తనను బాగా డిస్ట్రబ్‌ చేస్తున్నారని చెప్పింది. మమ్మల్ని గైడ్‌ చేయడానికే వచ్చారా… అని గట్టిగానే అంది. కూర్చొని అందరితో పని చేయిస్తున్నారని హారిక అంది. సోహైల్‌, ఆరియానాతోనే తనకు ఇబ్బందిగా ఉందని, ఇంకొన్నాళ్లు అయితే మార్పు వస్తుందేమో అని హారిక, అభిజిత్‌ అభిప్రాయపడ్డాడు.

* గంగవ్వ బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎన్నాళ్లు ఉంటానో చెప్పేసింది. వీలైనంతవరకు ఇంట్లో ఉంటా… మరీ ఇబ్బంది అవుతోంది అంటే వారం ముందే బిగ్‌బాస్‌కి చెప్పేస్తాను అని గంగవ్వ క్లారిటీ ఇచ్చేసింది.

* ఇంట్లో అమ్మాయిలు ఎంత మంది, అబ్బాయిలు ఎంతమంది అనే చర్చ వచ్చింది. అబ్బాయిలు ఏడుగురు ఉంటే, అమ్మాయిలు ఎనిమిది మంది ఉన్నారు అని అమ్మ రాజశేఖర్‌ అన్నారు. కళ్యాణి ఈ రెండు లిస్ట్‌లో చూపించక్కర్లేదు అని పంచ్‌ వేశాడు అమ్మ రాజశేఖర్‌. దానికి ఎప్పటిలాగే సూర్యకిరణ్‌ పడీ పడీ నవ్వేశాడు. ఆఖరికి ఆమెను సంచాలక్‌గా తేల్చారు.

* బిగ్‌బాస్‌ హౌస్‌లో మరో గాసిప్‌కి అమ్మ రాజశేఖర్‌, సూర్యకిరణ్‌ ట్రాక్‌ వేశారు. ఎవరో అబ్బాయి ఎక్సర్‌సైజ్‌ చేస్తుంటే… ఆరియానా గ్లాస్‌ వెనుక నుండి కసిగా చూసిందంటూ ఓ పుకారు తీసుకొచ్చాడు. ఆ విషయాన్ని ఆమెకే చెప్పడం గమనార్హం. అయితే ఆ అబ్బాయి ఎవరనేది చెప్పలేదు. అంతకుముందే నీకు ఈ ఇంట్లో ఓ అబ్బాయిని పార్టనర్‌గా సెట్‌ చేస్తా అని కూడా చెప్పాడు. ఆరియానా చూస్తోందని ఆ అబ్బాయి తెగ ఎక్సర్‌సైజ్‌ చేశాడనీ చెప్పారు. ఆఖరికి ఆ అబ్బాయి మెహబూబ్‌ అని తేల్చేశాడు.

* ఈ రోజు బిగ్‌ బాస్‌ హౌస్‌లో తొలిసారిగా వర్షం పడింది. స్విమ్మింగ్‌ పూల్‌లో బాయ్స్‌ అందరూ స్నానం చేస్తుంటే ఈ లోగా వర్షం పడింది. అబ్బాయిలు పూల్‌లో ఉన్న సమయంలో దివి కూడా స్నానం చేసింది. దీంతో బిగ్‌బాస్‌ ‘వర్షం’ టైటిల్‌ సాంగ్‌ వేశాడు. దీంతో హౌస్‌మేట్స్‌ అందరూ స్టెప్పులేశారు. దివి, దేవీ చిన్నపిల్లల్లా పూల్‌లో స్టెప్పులేయడం ముచ్చటగా ఉంది.

* లగ్జరీ బడ్జెట్‌ కోసం తమ దగ్గరున్న 2000 పాయింట్లను వాడుకునే అవకాశం బిగ్‌ బాస్‌ ఈ రోజు ఇచ్చాడు. ఈ క్రమంలో సూర్యకిరణ్‌ కోపంగా రియాక్ట్‌ అవ్వడం నాగార్జున గమనించాడు. ‘ప్రతి దానికి ఆయనకు కోపమే’ అని నాగ్‌ అన్నాడు. బడ్జెట్‌ రాసేటప్పుడు గోల గోల అవ్వడం గంగవ్వకు కూడా నచ్చలేదు. ఆ విషయాన్ని సూర్యకిరణ్‌ దగ్గర అంది.

* అభిజీత్‌కి నాగార్జున ఓ బిరుదు కూడా ఇచ్చాడు. ‘మిస్టర్‌ గాసిప్‌ కింగ్‌’ అంటూ సెటైర్‌ వేశాడు. ఎందుకన్నాడో తర్వాత చెప్తాడేమో చూడాలి. ఆ టైమ్‌లో అభిజీత్‌, అఖిల్‌… మోనాల్‌ గురించి మాట్లాడుకుంటున్నారు.

* గంగవ్వ తన జీవితంలో బ్యాడ్‌ ఫేజ్‌ గురించి హౌస్‌మేట్స్‌కి చెప్పింది. భర్తతో తన బతుకు ఎలా సాగిందో వివరించింది. మద్యానికి అలవాటుపడి భర్త తనను బాధపెట్టిన వివరాలు అన్నీ చెప్పింది. ‘భర్త కొట్టినా నీకు కోపం రాలేదా’ అని అమ్మ రాజశేఖర్‌ అడిగితే… ‘నాకు ఎవరూ దిక్కులేరని అందుకనే ఊరుకున్నా’ అని చెప్పింది గంగవ్వ. ఇలాంటి కష్టాలు పడి జీవితాన్ని జీవించింది కాబట్టే… స్పెషల్‌ పార్టిసిపెంట్‌గా హౌస్‌కి వచ్చింది.. ఏమంటారు.

* అఖిల్‌ను అందరూ కట్టప్ప అనడం తనకు నచ్చడం లేదని సుజాతతో సోనాల్‌ చెప్పింది. ఈ విషయంలో అఖిల్‌ చాలా బాధపడ్డాడని.. అందరినీ దూరం పెట్టినా.. నేను తనను సపోర్టు చేశానంటూ చెప్పుకొచ్చింది మోనాల్‌.

* బిగ్‌బాస్‌ హౌస్‌లో తనకు నిద్ర పట్టడం లేదని గంగవ్వ అంది. ఇంట్లో వాళ్లంతా రాత్రిళ్లు గొడవలు చేయడం వల్లనే కదా అని నాగ్‌ అన్నాడు. దానికి ఫర్వాలేదు… నేను పల్లెటూరి నుండి రావడం వల్ల అలా అనిపిస్తోంది.. అయినా నన్ను అందరూ బాగా చూసుకుంటున్నారులే అని చెప్పింది. పెద్దన్న బిగ్‌బాస్‌, నడిపన్న నాగార్జున… మీ కొడుకులు నా మేనల్లుళ్లు అని గంగవ్వ అంది. ఈ విషయమూ చెబుతూ.. గంగవ్వ ఓ పాట కూడా పాడింది.

* గంగవ్వ మాట్లాడే పదాలు కొన్ని అర్థం కావడం లేదని, ప్రేక్షకులూ అదే అనుకుంటున్నారని నాగ్‌ అన్నాడు. కొంచెం నెమ్మదిగా మాట్లాడమని అన్నాడు. అయితే మళ్లీ ఏమైందేమో… ‘నువ్వు మారకు మేమే మారతాం.. అర్థం చేసుకుంటాం’ అని నాగ్‌ విషయం క్లోజ్‌ చేసేశాడు. ఎందుకు ఆమెను ఏమైనా అంటే.. ట్రోలింగ్‌ వస్తుందేమో అని భయపడ్డాడేమో.

* నైబర్‌ హౌస్‌తో నోయల్‌ మాట్లాడిన స్టైల్‌ చాలాబాగుందని నాగ్‌ పొడిగేశాడు. ఆ వెంటనే ‘నువ్వు ఓవర్‌ థింకింగ్‌ అనుకుంటా…’ అని మునగచెట్టు నుండి దించేశాడు. ఓవర్‌ థింకింగ్‌ విషయంలో నోయల్‌ ఏం చెప్పినా.. నాగ్‌ కన్వీన్స్‌ అవ్వకుండా ‘ఓవర్‌ థింకింగ్‌’ నీ లక్షణం అని తేల్చేశాడు నాగ్‌. హౌస్‌లో ఉన్నవాళ్లలో చాలామంది ఇదే మాట అన్నారు. ఓవర్‌ థింకింగ్‌ను కాస్త తగ్గించుకుంటే మంచిది అని సూచించారు.

* అరియానాను… నాగ్‌ అరవానా అని మార్చేశాడు. కారణం ఆమె ప్రతిదానికీ అందరి మీద అరుస్తోంది. నువ్వు సాఫ్ట్‌గా అడిగితే ఎవరైనా, ఏదైనా చేస్తారు కదా అని నాగ్‌ సజెస్ట్‌ చేశాడు. బిగ్‌బాస్‌ నిలదీయమని అనేసరికి… టెంపో లూజ్‌ అయిపోయాను అని ఆరియానా క్లారిఫికేషన్‌ ఇచ్చింది.

* నైబర్‌హౌస్‌లో ఆరియానాను వీపుపై కూర్చొబెట్టుకొని సోహైల్‌ బస్కీలు తీసిన విషయాన్ని నాగ్‌ గుర్తు చేశాడు. అంతేకాదు మరోసారి ఈ రోజు బస్కీలు తీయించి చూపించాడు. అఖిల్‌ను కూడా అలా ట్రై చేయమని చెప్పాడు నాగ్‌.

* అఖిల్‌ అంటే ఇంట్లో అందరికీ ఇష్టం కదా… అంటూ అన్న నాగ్‌, గంగవ్వను అఖిల్‌ చూసుకునే విధానం సూపర్‌ అని పొగిడేశాడు. అఖిల్‌కు చెమట పడితే మోనాల్‌ తుడిచిన విషయం గురించి కూడా ప్రస్తావించాడు నాగ్‌.

* మోనాల్‌ను ‘నర్మద’ అంటూ నాగ్‌ పంచ్‌ వేశాడు. ఎప్పుడూ ఏడవొద్దని సూచించాడు. నువ్వు నవ్వుతుంటే బాగుంటావని కాంప్లిమెంట్‌ కూడా ఇచ్చాడు. వంట గదిలో క్లీన్లీనెస్‌ గురించి కూడా చర్చ వచ్చింది. అయితే వడ్డించేటప్పుడు కోపంతో ఉండకూడదని మోనాల్‌కు నాగ్‌ సూచించాడు. మోనాల్‌ కొన్ని తెలుగు పదాలు కూడా నేర్చుకొని మాట్లాడింది. భలే ముచ్చటగా మాట్లాడింది తెలుసా.

* లాస్య విషయంలో ఏదో వెలితి కనిపిస్తోందని నాగ్‌ అన్నాడు. బాబును మిస్‌ అవుతున్నావా అని అడిగితే… ఆ ఉంది కానీ బాగానే ఆడుతున్నానని చెప్పింది. అయితే బిగ్‌బాస్‌ ఇచ్చిన కనెక్షన్‌ మెహబూబ్‌ గురించి కూడా ఇంకా తెలుసుకోలేదని నాగ్‌ అన్నాడు. మెహబూబ్‌కు కూడా నాగ్‌ ఇలాంటి సలహానే ఇచ్చాడు. నీ టాలెంట్‌ని చూపించాలి… అందరితో నువ్వు కనెక్ట్‌ అవ్వాలని సూచించాడు. చూద్దాం మెహబూబ్‌లో ఎలాంటి మార్పు వస్తుందో.

* అభిజిత్‌ యాంగర్‌ మేనేజ్‌మెంట్‌ ఇష్యూని నాగార్జున రెయిజ్‌ చేశారు. కోపాన్ని కంట్రోల్‌ చేసుకోవాలి కదా అని కూడా అన్నారు. ఇంట్లో పెద్ద ఫ్యామిలీ అయ్యి… గారాబం ఎక్కువ అవ్వడం వల్ల కోపం వస్తోందా అని కూడా అడిగాడు. లాంఛింగ్‌ స్టేజీ మీద మోనాల్‌ ఫొటోను చూసి పెళ్లి చేసుకుంటా అని అన్నావు కదా అనే విషయమూ గుర్తు చేశాడు.

* దివి సైలంట్‌గా ఉంటూ… అందరి గురించి తెలుసుకున్న విధానాన్ని, చెప్పిన విధానాన్ని నాగ్‌ మెచ్చుకున్నాడు. అమ్మ రాజశేఖర్‌తో కనెక్షన్‌ ఎలా ఉందనే విషయమూ అడిగి తెలుసుకున్నాడు.

* బ్రేక్‌ టైమ్‌లో షో మీద రాసుకున్న ర్యాప్‌ సాంగ్‌ని హౌస్‌ మేట్స్‌ పాడి వినిపించారు. పాట మొత్తం అయ్యాక గంగవ్వ అందరికీ పంచ్‌ వేసింది. ‘ఏంది ఈ గోల… చెవులు గిల్‌ మంటున్నాయి’ అంటూ గయ్‌ మంది. దానికి నాగ్‌ కూడా సపోర్టు చేశాడు.

* దేవి నాగవల్లి తనలో వచ్చిన మార్పును వివరించి చెప్పింది. గతంలో ఉన్న దేవీ వేరు… ఇప్పుడు దేవీ వేరు అంటూ డ్యాన్స్‌లు, పాటలు, అర్థం చేసుకోవడం లాంటి వివరాలు ఇచ్చింది. అంతేకాకుండా… ఇంటి మేట్స్‌లో గమనించిన విషయాన్నీ చెప్పింది. అందరూ చిన్న చిన్నవాటికి అలుగుతున్న విషయాన్నికూడా చెప్పింది.

* వంట గది క్లీన్‌గా ఉంచమని అడిగిన మోనాల్‌పై అమ్మ రాజశేఖర్‌ కోపగించిన విషయాన్ని నాగ్‌ ప్రస్తావించాడు. అది మంచి పద్ధతి కాదని సూచించాడు. దానికి అమ్మ రాజశేఖర్‌ మాస్టర్‌ కూడా ‘సరే సర్‌.. ఆ రోజు ఆకలితో ఉండటం వల్ల అలా అనేశాను. మార్చుకుంటాను’ అని చెప్పాడు. ఆ రోజు దివితో మాస్టర్‌ కలిపిన పులిహోర కూడా చర్చకు వచ్చింది.

* ‘అనవసరమైన వాటిలో లెక్చర్లు ఇవ్వడం సరికాదు’ అని సూర్యకిరణ్‌కు నాగార్జున సూచించారు. ‘తెలిసింది చెప్తే’ బాగుండదు కదా అని కూడా చెప్పాడు. ఇంట్లో వాళ్లను కూడా అదే మాట అడిగి చెప్పించాడు. కరాటే కళ్యాణి గురించి కూడా నాగ్‌ అదే మాట అన్నారు.

* బిగ్‌బాస్‌, నాగార్జునకు చెప్పేసి బయటకు వెళ్లిపోతాను అని గంగవ్వ చెప్పిన విషయం గుర్తుందిగా. నాగార్జున ఆ టాపిక్‌ తెచ్చి… మేమెవరం చెప్పడానికి ‘ప్రేక్షకులు చెబుతారు..’ అంటూ గంగవ్వ ఎన్నాళ్లు ఉండేది ప్రేక్షకుల ఇష్టం అని తేల్చేశాడు నాగ్‌. ఇది నిజమే అంటారా?

* ఈ రోజు సేఫ్‌ అయినవాళ్ల వివరాలు చెప్పే ముందు నాగ్‌ ఓ గేమ్‌ ఆడించారు. కొన్ని మెడల్స్‌ ఇచ్చి ఎవరి మెడలో వేస్తారా అని ఆరియానా – సోహైల్‌ని అడిగారు. సుజాత మెడలో ఊసరవెల్లి మెడల్‌ వేశారు. ఆమె రోజుకోలా ఉంటోంది… ఒక రోజు సరదాగా, ఒక రోజు ఏడుస్తూ… ఇలా చాలా షేడ్స్‌ చూపిస్తోందని కారణంగా చెప్పారు. తొలుత అర్థం కాకుండా… తర్వా తర్వాత అర్థమవుతుందని దివికి కాకరకాయ బ్యాడ్జ్‌ వేశారు. సెటిల్డ్‌, కామ్, రొమాంటిక్‌, కేరింగ్‌, గుడ్‌, పొలైట్‌ లాంటి గుణాలు చెప్పి అఖిల్‌కు రొమాంటిక్‌ మెడల్‌ ఇచ్చారు. కళ్యాణికి అగ్గిపెట్టె మెడల్‌ ఇచ్చారు. ప్రతి విషయాన్ని, గొడవను సాగ దీసి, ఇక్కడిదక్కడ చెప్పి పెద్దది చేస్తోందని ఆరోపించారు. డ్రమటిక్‌గా మాట్లాడుతోందని హారికను డ్రామా క్వీన్‌ చేశారు. అయితే దీనికి నాగ్‌ ఒప్పుకోలేదు.

ఇంట్లో ఏ పనీ చేయడం లేదని సూర్యకిరణ్‌కు బద్దకం ట్యాగ్‌ ఇవ్వగా, కొన్ని విషయాల్లో అనవసరంగా ఆడిపోసుకున్నాడని అభిజీత్‌ను చెత్తకుండి ట్యాగ్‌ ఇచ్చారు. ఇక సందడి ఉండే నోయల్‌ లౌడ్‌ స్పీకర్‌ అయ్యాడు. స్ట్రాంగ్‌ కంటెస్టెంట్ అయిన గంగవ్వకు తోపు ట్యాగ్‌ రాగా, నిస్వార్థంగా ఉండే దేవీ నాగవల్లికి పర్‌ఫెక్ట్‌ ట్యాగ్‌ వచ్చింది. ఎప్పుడూ ఏడ్చే మోనాల్‌కు క్రై కిడ్‌ మెడల్‌ వేశారు. గుంటూరు మిర్చి లాంటి మెహబూబ్‌కు మిర్చి ట్యాగ్‌ ఇవ్వగా, లాస్యకు బకరా ట్యాగ్‌ ఇచ్చారు. అందరినీ ఎప్పుడూ నవ్వించే అమ్మ రాజశేఖర్‌కు జోకర్‌ ట్యాగ్‌ ఇచ్చారు.

* బోర్‌గా నడిచిన కట్టప్ప స్కిట్‌కు నాగ్‌ బంపర్‌ హిట్‌ క్లైమాక్స్‌ ఇచ్చాడు. స్టాంపుల టాస్క్‌లో పడిన ఓట్ల ఆధారంగా లాస్య (4) , సూర్యకిరణ్‌ (3), నోయల్‌ (3), అమ్మ రాజశేఖర్‌ (3), అఖిల్‌ (1)ను నిలబెట్టారు. వీరిలో ఎవరిని ‘కట్టప్ప’ చేస్తారు అని మరోసారి నాగ్‌ అడిగాడు. ఆరు ఓట్లతో లాస్యను కట్టప్పగా ఇంట్లో వాళ్లు ఫిక్స్‌ చేశారు. అయితే ఇక ఆమెనే కట్టప్ప అనుకుంటున్న సమయంలో నాగ్‌ ట్విస్ట్‌ చేశాడు. అసలు ఇంట్లో కట్టప్పనే లేడని… మీలో ఉన్న అనుమానమే కట్టప్ప అని తేల్చేశాడు. మరి లాస్యను ఏం చేశారనేగా… వెరైటీగా ఈ వారానికి ఇంటి కెప్టెన్‌ని చేశారు. కనెక్షన్‌ పెంచుకోండి అని బిగ్‌బాస్‌ చెబితే ఎవరూ ముందుకు రాలేదు కానీ… అనుమానించమంటే మాత్రం ముందుకొచ్చారు అంటూ నాగ్‌ చెప్పాడు.

* ‘బిగ్‌బాస్‌ ఇంట్లో ఉండాల్సిన వ్యక్తి’ అంటూ ‘ఫిల్మీ ఫోకస్‌’ ముందుగా చెప్పిన అభిజీత్‌ ఫస్ట్ సేఫ్‌ అయ్యాడు. ప్రేక్షకులు అత్యధిక శాతం ఓట్లు వేయడంతో అభిజీత్‌ సేఫ్‌ అయినట్లు నాగ్‌ ప్రకటించాడు. సేఫ్‌ అయిన పేర్లలో రెండోది చెప్పడంతో అందరూ షాక్‌ అయ్యారు. అనూహ్యంగా సెకండ్‌ సేఫ్‌ పేరును సుజాతగా ప్రకటించాడు బిగ్‌ బాస్‌. మూడో సేఫ్‌ అయిన పర్సన్‌ నేమ్‌ అందరూ ఊహించిన పేరు గంగవ్వ. ప్రేక్షకుల అత్యధిక ఓట్లు సంపాదించిన మూడో పార్టిసిపెంట్‌గా గంగ్వను ప్రకటించాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus