బిగ్‌బాస్‌ 4: పప్పు బాగోలేదు… ప్రవర్తన బాగోలేదు.. పని బాగోలేదు!

బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి ఒకరిని పంపించాలంటే ఉన్న ఏకైక మార్గం ఎలిమినేషన్‌. దీని కోసం తొలుత ఇంటి సభ్యులు కొంతమందిని నామినేట్‌ చేయాలి. అలా ఐదో వారం కోసం ఇంట్లో నామినేషన్‌ ప్రక్రియ ముగిసింది. ఈ క్రమంలో తొమ్మిది మంది నామినేట్‌ అయ్యారు. అందులో ఎవరు, ఏం కారణాలు చెప్పి నామినేట్‌ చేశారో చూద్దాం.

అఖిల్‌: అభిజీత్‌, అమ్మ రాజశేఖర్‌

నేను ఒరేయ్‌ అన్నాను అని అభిజీత్‌ అంటున్నాడు. అయితే ఎప్పుడు అన్నానో క్లారిటీ ఇవ్వేలేదు అందుకే నామినేట్‌ చేస్తున్నా. నేను పర్మిషన్‌ తీసుకొని రా అని మాత్రం అన్నాను అని వివరించాడు. ఇక అమ్మ రాజశేఖర్‌ను నామినేట్‌ చేస్తూ… ‘అతనికి ఓటమి నచ్చదు. కొన్ని విషయాల్లో ఆయన చేసింది కరెక్ట్‌ అంటారు. కానీ ఇతరులు అదే పని చేస్తే తప్పు అంటారు’ అని కారణం చెప్పాడు.

ఆరియానా: అఖిల్‌, అమ్మ రాజశేఖర్‌

లగ్జరీ బడ్జెట్‌ రాసే సమయంలో 16 మంది కోసం షాపింగ్‌ చేయాలి అని బిగ్‌బాస్‌ చెప్పారు. కానీ మీరు ఆ పని కరెక్ట్‌గా చేయలేదు. అందుకే నామినేట్‌ చేస్తున్నా అని ఆరియానా చెప్పింది. ఇక ఇంట్లో పని చేస్తున్నా, సరిగ్గా చేయడం లేదని అంటున్నారు అంటూ అమ్మ రాజశేఖర్‌ను నామినేట్‌ చేసింది ఆరియానా.

లాస్య: దివి, నోయల్

వంట గదిలో పాత్రలు కడగను అంటోంది దివి. ఏ పని చెప్పినా చేసేలా ఉండాలి. ఆమె కిచెన్‌లో ఉంటే క్లీన్‌గా ఉండదు అందుకే నామినేట్ చేస్తున్నా లాస్య అంది. రెండో నామినేషన్‌గా నోయల్‌ను ఎంచుకుంది. ఇటీవల నాగార్జున గారితో ‘లాస్య ఫేక్‌’ అని చెప్పాడు. అప్పటి నుంచి సరిగ్గా ఉండలేకపోతున్నాను. గ్యాప్‌ వచ్చింది. అందుకే ఈ నామినేషన్‌ అని చెప్పింది లాస్య.

అవినాష్‌: అఖిల్‌, మోనాల్‌

లగ్జరీ రాసే క్రమంలో అందరి కోసం కాకుండా… అతనికి దగ్గరవాళ్ల కోసం ఫుడ్‌ ఆర్డర్‌ పెట్టాడు అంటూ అఖిల్‌ గురించి అవినాష్‌ అన్నాడు. ఇక హిట్‌ మ్యాన్‌ నామినేషన్‌ సమయంలో ‘నేను సేఫ్‌ గేమ్‌ ఆడుతున్నా’ అంటూ మోనాల్‌ నన్ను అంది. అందుకే ఈ నామినేషన్‌.

సుజాత: అఖిల్‌, ఆరియానా

లగ్జరీ టాస్క్‌ సమయంలో 16 మందికి తీసుకోమని చెప్తే… వినకుండా కొంతమందికే తీసుకున్నావ్‌ అంటూ అఖిల్‌ను నామినేట్‌ చేసింది. ఆ తర్వాత నామినేషన్‌ సమయంలో మాస్టర్‌తో మాట్లాడిన విషయం గురించి ప్రస్తావిస్తూ ఆరియానాను నామినేట్‌ చేసింది. ఆ చరచ నువ్వు కెప్టెన్‌తో మాట్లాడాలి అని సూచించింది.

కుమార్‌ సాయి: నోయల్‌, సుజాత

గత నామినేషన్‌ సమయంలో పాత విషయాలు చెప్పి, సరైన కారణం లేకుండా నన్ను నామినేట్‌ చేయాలని చూశావు. అందుకే ఇప్పుడు నేను నామినేట్‌ చేస్తున్నా. ఇతరుల మీద డిపెండెంట్‌గా ఉందంటూ సుజాతను కూడా నామినేట్‌ చేశాడు.

సోహైల్‌: అభిజీత్‌, నోయల్

ఇంటి పనుల విషయంలో మనం ఓ చర్చ అనుకున్నాం. కానీ నువ్వు ఆ పని చేయలేదు. మళ్లీ నేనే చేసుకున్నా అంటూ అభిజీత్‌ను నామినేట్‌ చేశాడు. కిల్లర్‌ కాయిన్స్‌ ఆఖరి టైమ్‌లో నువ్వు మమ్మల్ని (సోహైల్‌, మెహబూబ్‌) సపోర్టు చేస్తావ్‌ అనుకుంటే మాట తప్పావ్‌ అంటూ నోయల్‌ను కూడా నామినేట్‌ చేశాడు.

మెహబూబ్‌: సుజాత, లాస్య

మెహబూబ్‌ రాత్రంతా కష్టపడి కాయిన్స్‌ సంపాదించాక.. సుజాత స్విచ్‌ కాయిన్‌తో తీసేసుకుంది. దీంతో మెహబూబ్‌ కెప్టెన్సీ పోటీ నుంచి వైదొలిగాడు. దీనినే కారణంగా చెబుతూ సుజాతను నామినేట్‌ చేశాడు. ‘కిల్లర్‌ కాయిన్స్‌’ టాస్క్‌ సమయంలో నేను, సోహైల్‌ మీకు సపోర్టు చేశాం. కానీ ఆఖరులో మీరు మాకు సపోర్టు చేయలేదు అంటూ లాస్యను కూడా నామినేట్‌ చేశాడు. లాస్య: మీ కోసం సపోర్టు చేశాం. కానీ మీరు ఆఖరికి ఆయనకు సపోర్టు చేయలేదు.

గంగవ్వ: నోయల్‌, అభిజీత్‌

ఇంట్లో ఒక్కడే కూర్చొని ఉంటాడు. ఎవరితోనూ పెద్దగా కలవడు అంటూ అభిజీత్‌ను నామినేట్‌ చేసింది గంగవ్వ. అలాగే ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్న నోయల్‌ను ఇంటికి పంపించేద్దాం అంటూ రెండో నామినేషన్‌ పూర్తి చేసింది.

అమ్మ రాజశేఖర్‌: అఖిల్‌, ఆరియానా

అఖిల్‌ అన్ని విషయాల్లో క్లారిటీగా వింటాడు. అయితే లగ్జరీ బడ్జెట్‌ ఎంపిక విషయంలో బిగ్‌బాస్‌ చెప్పింది సరిగ్గా వినలేదు అని అంటున్నాడు. అది నచ్చక నామినేట్‌ చేస్తున్నాను అని మాస్టర్‌ చెప్పారు. అలాగే ఇంటి పని విషయంలో ఆరియానా సరిగ్గా వ్యవహరించడం లేదంటూ ఆమెను నామినేట్‌ చేశాడు.

హారిక: అఖిల్‌, మోనాల్‌

మోనాల్‌తో రెండో వారం నుంచే పరిచయం తగ్గిపోయింది. ఎప్పుడు మాట్లాడినా ‘నేను హర్ట్‌ అయ్యా’ అని ఏవో చెప్పేది. దీంతో ఆమెతో నా కనెక్షన్ తగ్గిపోయింది అంటూ నామినేట్‌ చేసింది హారిక. అలాగే అఖిల్‌తో మాట్లాడదాం అంటే ఒకరిని దాటుకొని వెళ్లాల్సి వస్తోంది. మొదట్లో ఇద్దరి రిలేషన్‌ బాగుండేది. దాంతోపాటు ‘ఉక్కు హృదయం’ టాస్క్‌ సమయంలో ‘రెయిజ్‌ యువర్‌ హ్యాండ్‌’ అంటూ క్రిటిసైజ్‌ చేశాడు అనే కారణాలు చెబుతూ నామినేట్‌ చేసింది హారిక.

దివి: లాస్య, సోహైల్‌

లాస్య వండిన పప్పు వల్ల ఇంట్లో అందరికీ వాంతులు అవుతున్నాయి అనే కారణంతో లాస్యను దివి నామినేట్‌ చేసింది. ‘కాయిన్స్‌’ గేమ్‌ టైమ్‌లో హర్ట్‌ చేశావ్‌ అంటూ సోహైల్‌ను నామినేట్‌ చేసింది.

మోనాల్‌: హారిక, అవినాష్‌

సరైన కారణం లేకుండా అవినాష్‌ నన్ను నామినేట్‌ చేశారు… అందుకే నేను నామినేట్‌ చేస్తున్నాను. అలాగే మీరు నా మీద చేసే కామెడీ కూడా నచ్చడం లేదు అని కూడా మోనాల్‌ చెప్పింది. తర్వాత హారికను నామినేట్‌ చేసింది. అభిజీత్‌తో నాకు సమస్య వస్తే… నాకు అతని నుంచి కారణం కావాలి. కానీ మీ నుంచి కాదు అనే కారణం చెప్పింది.

అభిజీత్‌: సోహైల్‌, అఖిల్‌

అఖిల్‌ నువ్వు కన్ఫెషన్‌ రూమ్‌లో కన్‌ఫ్యూజ్‌ అయ్యావంటే నమ్మను. అది నీ ఫాల్ట్‌. నీకు హెడ్‌ స్ట్రాంగ్‌, ఆటిట్యూడ్‌ ఇష్యూస్‌ ఉన్నాయి. అది నీ మేనరిజం ఇవ్వొచ్చు. కానీ నువ్వలా ఉండటం వల్ల కొందరికి నచ్చదు. అందులో నేనూ ఒకడిని అంటూ నామినేట్‌ చేశాడు. అలాగే కోపం తగ్గించు.. భయమేస్తోంది అంటూ సోహైల్‌ను నామినేట్‌ చేశాడు.

నోయల్‌: అమ్మ రాజశేఖర్‌, సోహైల్‌

సరైన కారణం లేకుండా స్వాతి దీక్షిత్‌ను నామినేట్‌ చేశారు. దీంతో ఆమె ఎలిమినేట్‌ అయిపోయింది. ఇంట్లో ఆమెకు ఉండే అవకాశం ఇచ్చి ఉంటే ఇంకోలా ఉండేది. మీరు ఆడిన సేఫ్‌ గేమవల్ల ఆమెకు అవకాశం లేకుండా పోయింది అంటూ అమ్మ రాజశేఖర్‌ మాస్టర్‌ను నామినేట్‌ చేశాడు. ఆ తర్వాత సోహైల్‌ తనను నామినేట్‌ చేసిన విషయం చర్చకు వచ్చి అతనని నామినేట్‌ చేశాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus