బిగ్ బాస్ 4: మోనాల్ వ్యధ..అఖిల్ కధ..!

బిగ్ బాస్ హౌస్ లో ప్రతిసీజన్ లో ఎలిమినేట్ అయిపోయినవాళ్లు తిరిగి రీయూనిన్ గా టాప్ – 5 మెంబర్స్ ని పలకరించడానికి వస్తూ ఉంటారు. లాస్ట్ రెండురోజులు వారితో ఉండి పార్టీలో మునిగితేలతారు. ఈ ప్రక్రియ ఫస్ట్ సీజన్ నుంచీ మనం చూస్తున్నదే. అయితే, ఈసారి మాత్రం కోవిడ్ నిబంధనల కారణంగా కేవలం గ్లాస్ డోర్స్ కి మాత్రమే కంటెస్టెంట్స్ ని పరిమితం చేశారు. దీంతో హౌస్ లోకి సోలోగా పొద్దున్నే వచ్చిన మోనాల్ అఖిల్ తో కాసేపు మాట్లాడింది. హౌస్ మేట్స్ అందర్నీ పలకరిస్తూనే, ఈ గ్లాస్ డోర్ తీసేస్తే బాగుండు అంటూ మాట్లాడింది.

ఇక అఖిల్ తో మాట్లాడుతూ నాకు అస్సలు బయటకి వెళ్లిన తర్వాత రాత్రిళ్లు నిద్రపట్టలేదు అని, బిగ్ బాస్ హౌస్ లోకి మళ్లీ వస్తున్నాను అంటే, అస్సలు నిద్రరాలేదు అని, తెల్లవారుఝామున 3.30 వరకూ మెలకువగా ఉన్నానని చెప్పుకొచ్చింది. అలాగే, నువ్వు వెళ్లిపోయాక నాకు కూడా నిద్రరాలేదు మోనాల్ అంటూ అఖిల్ కూడా తన కథని చెప్పాడు. ఇద్దరూ కాసేపు ముచ్చడించుకున్న తర్వాత, బయట ఎలా ఉంది అని అడిగితే, ఆ కథ వేరేగా ఉంది రండి..రండి అంటూ మాట్లాడింది మోనాల్. అలాగే, తను హౌస్ మేట్స్ గురించి చెప్తూ గాలిలోకి బెలూన్స్ ని వదిలిపెట్టింది.

ఇక మోనాల్ చాలా అందంగా ఉన్నావ్ అంటూ అఖిల్ చెప్తుంటే తెగ సిగ్గుపడిపోయింది. అఖిల్ నెంబర్ వన్ అంటూ మాట్లాడేసరికి అఖిల్ విన్నర్ అని బాగా ఫీల్ అయ్యిపోయాడు. దూరంగా ఉన్న అభిజిత్ మోనాల్ చాలా బాగున్నావ్ అంటూ సైగల ద్వారానే చెప్పాడు. ఇక హారిక తనదైన స్టైల్లో మోనాల్ ని పలకరించగా, అరియానా తనకి సారీ చెప్పింది. హౌస్ లో హర్ట్ చేసి ఉంటే సారీ అని మీరందరూ వెళ్లిపోయాక నాకు లోన్లీనెస్ తెలుస్తోందని చెప్పింది. సోహైల్ ఎప్పటిలాగానే డ్యాన్స్ చేస్తూ ఫుల్ ఎగ్జైట్మెంట్ తో మోనాల్ ని పలకరించాడు. అందరిగురించి మాట్లాడుతూ మోనాల్ మెరుపుతీగలా వచ్చి వెళ్లిపోయింది. అదీ మేటర్. మరిన్ని ఇంట్రస్టింగ్ బిగ్ బాస్ అప్ డేట్స్ కోసం ఫిల్మీ ఫోకస్ కి లాగిన్ అవ్వండి.

[yop_poll id=”1″]

Most Recommended Video

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus