‘బిగ్ బాస్5’ ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ గెట్ టూ గెదర్.. ఫోటో వైరల్..!

  • November 2, 2021 / 11:09 PM IST

‘బిగ్ బాస్5’ ప్రారంభమై 9 వారాలు పూర్తికావస్తోంది.ఇప్పటికే 8 మంది ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘బిగ్ బాస్’ హౌస్ లో 11 మంది ఉన్నారు. ఫస్ట్ వీక్ సరయూ, సెకండ్ వీక్ ఉమాదేవి, థర్డ్ వీక్ ల‌హ‌రి, ఫోర్త్ వీక్ న‌ట‌రాజ్ మాస్ట‌ర్, ఫిఫ్త్ వీక్ మీదా, సిక్స్త్ వీక్ శ్వేతా వ‌ర్మ‌, సెవెంత్ వీక్ ప్రియ‌, ఎయిత్ వీక్ లోబో ఎలిమినేట్ అవ్వడం జరిగింది. ఇదిలా ఉండగా..

హౌస్ నుండీ ఎలిమినేట్ అయినవాళ్ళంతా ఇటీవల గెట్ టు గెదర్ అవ్వడం విశేషం. దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ లిస్ట్ లో ఇటీవల ఎలిమినేట్ అయిన లోబో మాత్రం లేడు. అంటే లోబో ఎలిమినేట్ అవ్వడానికి ముందే వీళ్ళు గెట్ టు గెదర్ అయినట్టు స్పష్టమవుతుంది. వీళ్ళు గెట్ టు గెదర్ ఎందుకైనట్టు అనే అనుమానం అందరికీ రావచ్చు.అందుతున్న సమాచారం ప్రకారం…

నటరాజ్ మాస్టర్ ఇంట్లో ఓ చిన్న ఫంక్షన్ జరిగిందట. అందుకే వీళ్ళంతా ఒక్క చోట కలిసినట్టు తెలుస్తుంది. ఉమాదేవి, లహరి, ప్రియా, హమీదా, శ్వేతావర్మ లు ఈ వేడుకలో సందడి చేయడం మనం వీడియోలో చూడొచ్చు. ఇక గెట్ టూ గెదర్ లో సరయూ కూడా ఉన్నట్లు సమాచారం. అయితే ఫొటోల్లో, వీడియోల్లో మాత్రం సరయూ ఎక్కడా కనిపించ లేదు.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!


రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus