Arjun Ambati: బిగ్ బాస్ కోసం భారీగా రెమ్యూనరేషన్ అందుకుంటున్న అర్జున్ !

బిగ్ బాస్ 7 కార్యక్రమం ప్రస్తుతం తెలుగులో ఎంతో విజయవంతంగా ప్రసారమౌతూ ప్రేక్షకులను సందడి చేస్తుంది. ఉల్టా పుల్టా అంటూ ఈ కార్యక్రమం ఈసారి ప్రేక్షకుల అంచనాలకు అందని విధంగా ప్రసారం అవుతుంది.14 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇప్పటికే ఐదు వారాలను పూర్తి చేసుకొని ఐదుగురు కంటెస్టెంట్లను హౌస్ నుంచి బయటకు పంపించేశారు. ఇకపోతే ఈ ఆదివారం ఏకంగా వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి పంపించారు.

ఈ విధంగా ఐదుగురు కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లినప్పటికీ వీరందరిలో అర్జున్ అంబటి సీరియల్ నటుడిగా అందరికీ ఎంతో మంచి సుపరిచితమే. ఇలా అర్జున్ వైల్డ్ కార్డు ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడంతో ఆటపై మరింత ఆసక్తి కూడా పెరిగిందని చెప్పాలి. ఇలా వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా కొత్తవాళ్లు హౌస్ లోకి వెళ్ళినప్పుడే బిగ్ బాస్ కొత్త కంటెస్టెంట్లకు పాత కంటెస్టెంట్లకు మధ్య గొడవ కూడా పెట్టారు.

ఇకపోతే సీరియల్స్ ద్వారా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి (Arjun Ambati) అర్జున్ అంబటి గురించి తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈయన సీరియల్స్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అలాంటి అర్జున్ సీరియల్ అన్ని వదిలేసి బిగ్ బాస్ కార్యక్రమంలోకి వెళ్లడంతో ఈయన బిగ్ బాస్ లో కొనసాగడం కోసం ఎంత మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకున్నారు అనే విషయాల గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి.

అర్జున్ ఒకరోజు సీరియల్స్ కోసం తన కాల్ షీట్స్ ఇస్తే దాదాపు పాతికవేల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటారట. ఇలా ఒకరోజు సీరియల్ కోసం పాతిక రూపాయలు అందుకునే ఈయన బిగ్ బాస్ కార్యక్రమానికి రావడంతో ఇక్కడ ఒక రోజుకు సుమారు 35 వేల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తుంది. ఇలా రెండు నెలల పాటు హౌస్ లో కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్ని రోజులపాటు హౌస్ లో ఉంటే అన్ని రోజులు రోజుకు 35 వేలు చొప్పున రెమ్యూనరేషన్ అందుకోబోతున్నారని తెలిసి అందరూ షాక్ అవుతున్నారు.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus