Bigg Boss 7 Telugu: టాస్క్ లో గెలిచింది ఎవరు ? ఇమ్యూనిటీ వచ్చేది ఎవరికంటే.?

బిగ్ బాస్ హౌస్ లో 4వ వారం ఇమ్యూనిటీ టాస్క్ లో ప్రిన్స్ యావార్ ఇంకా పల్లవి ప్రశాంత్ ఇద్దరూ కూడ కంటెండర్స్ అయిన సంగతి తెలిసిందే. హౌస్ లో జరిగిన ఏడుపు టాస్క్ లో ఇద్దరూ తమ కన్నీళ్లని గ్లాసులో నింపి ఇద్దరూ కూడా అమర్ ఇంకా గౌతమ్ లని ఓడించారు. వారి లాకర్స్ లో ఎక్కువ ఏమౌంట్ తో కంటెండర్స్ అయ్యారు. అయితే, బిగ్ బాస్ మూడో కంటెండర్ కోసం ఇంట్లో గలాటా గేమ్ ని సృష్టించాడు.

విచిత్రమైన వేషాలతో, హౌస్ మేట్స్ క్రియేటివిటీని వాడి బిగ్ బాస్ ని మెప్పిస్తారో వారిని మూడో కంటెండర్ గా చేస్తానని చెప్పాడు బిగ్ బాస్. దీంతో హౌస్ మేట్స్ చిత్ర విచిత్రంగా రెడీ అయ్యారు. అమర్ దీప్ ఒకవైపు అబ్బాయిగా, మరోవైపు అమ్మాయిగా వేషం వేసుకున్నాడు. టేస్టీ తేజ ఇంట్లోని కూరగాయలోత డ్రెస్ చేసుకుని విచిత్రంగా రెడీ అయ్యాడు. అలాగే, గిన్నెలు – స్పూన్స్ ఒంటికి చుట్టుకుని పల్లవి ప్రశాంత్ రెడీ అయ్యాడు.

శుభశ్రీ అయితే రోటీ రాణీ అంటూ తన గెటప్ కి తానే సైటర్ వేస్కుంటూ రెడీ అయ్యింది. ప్రియాంక దెయ్యం గెటప్, ప్రిన్స్ యావార్ ముసలోడి గెటప్ , గౌతమ్ స్పైడర్ మాన్ అంటూ జీ మాన్ గా రెడీ అయ్యాడు. రతిక అయితే తన ఒంటికి దిండ్లు నింపుకుని లడ్డూ అమ్మాయిగా తయారైంది. ఇలా ఇంట్లోని ప్రాపర్టీస్ ని ఉపయోగిస్తూ చక్కగా రెడీ అయ్యారు హౌస్ మేట్స్. వీళ్లతోనే రాత్రి అంతా పార్టీ ఉంటుందని గేమ్ ఆడించి, ర్యాంప్ వాక్ చేయించాడు బిగ్ బాస్.

వీళ్లలో శుభశ్రీ జిగేల్ రాణీ సాంగ్ కి డ్యాన్స్ చేసి అందరి మెప్పు పొందింది. మూడో కంటెండర్ గా సెలక్ట్ అయ్యింది. ఇక ప్రిన్స్ యావార్, పల్లవి ప్రశాంత్ , శుభశ్రీ ఈ ముగ్గురిలో ఒకరికి ఖచ్చితంగా ఇమ్యూనిటీ వస్తుంది. మరో రెండు వారాలు వీరికి ఇమ్యూనిటీ లబిస్తుంది. ప్రస్తుతం ఈవారం నామినేషన్స్ లో యావార్, ఇంకా శుభశ్రీ ఉన్నారు. వీరిద్దరిలో ఎవరు గెలిచినా ఈవారం సేఫ్ అయిపోతారు. ఎప్పటిలాగానే కింగ్ నాగార్జున శనివారం ఎపిసోడ్ లో (Bigg Boss 7 Telugu) ఇమ్యూనిటీ ఎవరు గెలిచారో ఎనౌన్స్ చేస్తాడు. అదీ మేటర్.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus