Bigg Boss 7 Telugu Winner: రైతుబిడ్డే రాజు..ఆ ఒక్క మాటతో పల్లవి ప్రశాంత్ విజేత అయ్యాడు..నాగార్జున ఒక్కసారి షాక్..!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విజేతగా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ నిలిచాడు. ఆఖరి వరకూ చాలా ఉత్కంఠంగా జరిగిన గ్రాండ్ ఫినాలో ఎపిసోడ్ లో అమర్ దీప్ ఇంకా పల్లవి ప్రశాంత్ ఇద్దరూ మాత్రమే మిగిలారు. దీంతో హౌస్ మేట్స్ అందరిలో, ఆడియన్స్ అందరిలో టెన్షన్ మొదలైంది. ఫైనల్ గా కౌంట్ డౌన్ ఎండ్ అయ్యేసరికి నాగార్జున పల్లవి ప్రశాంత్ చేతిని గాల్లోకి లేపి విజేతగా ప్రకటించారు. దీంతో స్టేజ్ పైన ఎమోషనల్ అయిపోయుడు పల్లవి ప్రశాంత్. అంతేకాదు, తన స్పీచ్ తో అందరి మనసులో మరోసారి దోచుకున్నాడు. అసలు గ్రాండ్ ఫినాలే ఆఖరి నిమిషంలో ఏం జరిగిందంటే.,

హోస్ట్ నాగార్జున స్వయంగా హౌస్ లోకి వెళ్లి ఫైనల్ గా మిగిలిన అమర్ దీప్ ఇంకా పల్లవి ప్రశాంత్ ఇద్దరినీ చేతులు పట్టుకుని మరీ స్టేజ్ పైకి తీస్కుని వచ్చాడు. బిగ్ బాస్ తెలుగు సీజన్ లో ఆఖరి మజిలీకి తీసుకుని వచ్చాడు. ఇక కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యేసరికి అందరి ముఖాలు టెన్షన్ లో నిండిపోయాయి. ముఖ్యంగా అమర్ దీప్ భార్య తేజస్వి చాలా టెన్షన్ పడిపోయింది. నిజానికి లాస్ట్ మినిట్ లో విన్నర్ ఎనౌన్స్ చేసేందుకు మహేష్ బాబు వస్తాడని అనుకున్నారు. కానీ, మహేష్ బాబు రాలేదు. అయితే, నాగార్జున ఎవి చూసిన తర్వాతే విన్నర్ ని ఎనౌన్స్ చేశారు. అమర్ దీప్ చేతిని వదిలేసిన నాగార్జున సింపుల్ గా పల్లవి ప్రశాంత్ విన్నర్ అని చెప్పగానే ప్రశాంత్ నాగార్జున కాళ్లమీద పడిపోయాడు. అంతేకాదు, వెక్కి వెక్కి ఏడుస్తూ ఎమోషనల్ గా స్పీచ్ ఇచ్చాడు.

ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటానని, అక్కలకి, చెల్లెళ్లకి అందరికీ ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ చెప్పాడు. తెలుగు రెండు రాష్ట్రాల ముద్దుబిడ్డ – ఈ రైతుబిడ్డని గెలిపించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపాడు. బిబి ట్రోఫీని పట్టుకుని నా మాట నిలబెట్టుకుంటా అంటూ నాగార్జునకి హామీ ఇచ్చాడు. అమర్ దీప్ కి – రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ కి ఇద్దరికీ మద్యలో కొద్దిగా మాత్రమే తేడా ఉందని చెప్పారు హోస్ట్ నాగార్జున. అంతేకాదు, అమర్ దీప్ మాట్లాడుతూ నాకు సపోర్ట్ చేసిన అందరికీ పాదాభివందనాలు అంటూ చెప్పాడు. నేను పుట్టిన ఊరు అనంతపురం ప్రజలందరికీ పాదాభివందనం అంటూ ఎమోషనల్ గా స్పీచ్ ఇచ్చాడు అమర్ దీప్. అమర్ దీప్ ని స్టేజ్ పై నుంచీ పంపించేసిన తర్వాత పల్లవి ప్రసాంత్ కి స్టార్ మా బిజినెస్ హెడ్ రాఘవ గారు వచ్చి పల్లవి ప్రసాంత్ కి 35 లక్షల చెక్ ఇచ్చారు. ఈ చెక్ తీస్కున్న ప్రశాంత్ ఈ డబ్బుని పేద రైతులకి ఖర్చుపెడతానని చెప్పేసరికి స్టేజ్ అంతా చప్పట్లతో దద్దరిల్లిపోయింది. 35 లక్షల చెక్ తో పాటుగా, బ్రీజా కార్ ఇంకా జాస్ అలూకాస్ వారి 15 లక్షల విలువ గల డైమండ్ నెక్లెస్ ని అందజేశారు. ఇవన్నీ తీసుకుని పల్లవి ప్రశాంత్ బాగా ఎమోషనల్ అయిపోయాడు.

ప్రతి రోజూ బిగ్ బాస్ షోలోకి రావాలని కలగన్నాను అని, నాగార్జున గారి ప్రోత్సాహం వల్లే నేను బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చానని , నాగార్జున గారి నవ్వు వల్లే ఆకలి బాధలు తీరాయని, అలాగే 35 లక్షల రూపాయలు ఈ డబ్బుని రైతులకే ఇస్తానని పంచుతానని , జై జవాన్ జైకిసాన్, మళ్లీ వచ్చానంటే తగ్గేదేలే అంటూ స్పీచ్ ఇచ్చాడు. అలాగే కార్ మా నాన్నకి, డైమండ్ నెక్లెస్ మా అమ్మకి ఇస్తానని చెప్పాడు పల్లవి ప్రశాంత్. ఫైనల్ గా ఈ సీజన్ విన్నర్ గా నిలిచి ఒక కామన్ మాన్ పవర్ చూపించాడనే చెప్పాలి. అదీ మేటర్.

 

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus