Pallavi Prashanth: 500 ఏళ్ల నిరీక్షణ ఫలించిన వేళ!

Advertisement

అయోధ్య వేదికగా బాల రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరిగింది. సోమవారం జరిగిన ఈ మహా క్రతువులో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరై సందడి చేశారు. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఈ కార్యక్రమంలో టాలీవుడ్ నుంచి మొదలుకొని బాలీవుడ్ వరకు ఎంతో మంది సినీ సెలబ్రిటీలో పాల్గొనే సందడి చేశారు. ఇక అయోధ్య వెళ్ళలేనటువంటి వారందరూ కూడా సోషల్ మీడియా వేదికగా శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం గురించి పోస్టులు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఇలా ఎంతో మంది సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేశారు. శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా దేశవ్యాప్తంగా జైశ్రీరామ్ అనే నినాదాలు వినపడ్డాయి. ఈ క్రమంలోనే అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగబోతున్నటువంటి తరుణంలో బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ చాలా వినూత్నంగా రామ భక్తిని చాటుకున్నారు. అయోధ్య బాల రాముడు ప్రాణ ప్రతిష్ట జరుగుతున్నటువంటి తరుణంలో ఈయన కూడా కాషాయ దుస్తులను ధరించి నదీ తీరంలో కూర్చుని వెనుక కాషాయపు జెండా పెట్టుకొని ధ్యానం చేస్తూ కనిపించారు.

ఇందుకు సంబంధించినటువంటి ఫోటోలను పల్లవి ప్రశాంత్ (Pallavi Prashanth) సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ..500 ఏళ్ల నిరీక్షణ ఫలించిన వేళ, ‘జై శ్రీరామ్‌’ అంటూ తన పోస్టుకు క్యాప్షన్‌ ఇచ్చాడు. ప్రస్తుతం ఈయన షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రైతు బిడ్డగా యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ ఎంతో ఫేమస్ అయినటువంటి పల్లవి ప్రశాంత్ ఏకంగా బిగ్ బాస్ కార్యక్రమంలోకి కామన్ మాన్ గా ఎంట్రీ ఇచ్చి విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus