Ariyana, Sohel: నీపై నాకు కోపం తగ్గలేదు..అరియనా కామెంట్స్ వైరల్!

బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో అరియనా ఒకరు. ఈమె రెండు సార్లు బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. ఇలా బిగ్ బాస్ కార్యక్రమంలో ద్వారా ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి ఈమె సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా కనిపిస్తుంటారు. పలు సందర్భాలలో బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేసే అరియనా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.

ఇక సోషల్ మీడియా వేదికగా అరియనా చేసే గ్లామర్ షో మామూలుగా ఉండదని చెప్పాలి. పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ ఫోటోలకు ఫోజులు ఇవ్వడం బికినీ ధరించి ఫోటోలకు ఫోజులు ఇవ్వడం చేస్తుంటారు. ఇలా సోషల్ మీడియా ద్వారా ఎంతో పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె ఇటీవల బిగ్ బాస్ కంటెస్టెంట్ సోహెల్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

సోహెల్ పట్ల అరియనా ఇంస్టాగ్రామ్ వేదికగా స్పందిస్తూ.. సోహెల్ నీపై నాకు ఏమాత్రం కోపం తగ్గడం లేదు. నువ్వు చేసే పనులన్నీ చేసేసి అరియనా నా బెస్ట్ ఫ్రెండ్ అంటూ చివరిలో క్యూట్ గా చెబుతూ ఉంటావు అసలు నువ్వంటేనే నాకు పడద. ఏది ఏమైనా నీ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను అంటూ ఈమె చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

అసలు అరియనా (Ariyana) సోహెల్ మీద కోప్పడటానికి గల కారణం ఏంటి అనే విషయాలను మాత్రం ఈమె తెలియజేయలేదు కానీ తన సినిమా మాత్రం మంచిగా ఆడాలని కోరుకున్నారు. ఇక తన నిర్మాణంలోనే సోహెల్ హీరోగా నటించిన బూట్ కట్ బాలరాజు సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాలో మేఘ లేఖ హీరోయిన్ గా నటించారు.

https://www.youtube.com/watch?v=AB3NTLOlmAg

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus