Ritu Chowdary: ‘బిగ్ బాస్ 9’… ఎవ్వరూ ఊహించని విధంగా ఎలిమినేట్ అయిన రీతూ చౌదరి

‘బిగ్ బాస్ సీజన్ 9’ క్లైమాక్స్ కి చేరుకుంది. 13 వారం నామినేషన్స్ లో సుమన్ శెట్టి,తనూజ, డెమాన్ పవన్, సంజన, రీతూ,భరణి వంటి 5 మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉన్నారు. వీళ్ళకి పడ్డ ఓటింగ్స్ ప్రకారం చూసుకుంటే.. తనూజ తప్ప.. మిగిలిన వారంతా డేంజర్ జోన్‌లో ఉన్నట్టు తెలుస్తుంది.కొన్ని వారాలుగా చూసుకుంటే.. సుమన్ శెట్టి, సంజన కనుక నామినేషన్స్ కి వస్తే లీస్ట్ ఓటింగ్‌ వాళ్ళు సేవ్ అవుతున్నారు.

Ritu Chowdary

ఈసారి నామినేషన్స్‌లో వీళ్ళిద్దరూ ఉండటంతో.. కచ్చితంగా వీళ్ళలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అవుతారు అని అంతా అంచనా వేశారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా రీతూ చౌదరి ఎలిమినేట్ అయినట్టు సమాచారం. ఈ ఎలిమినేషన్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జనాలందరికీ పెద్ద షాక్ ఇచ్చేదే అనే చెప్పాలి.సోషల్ మీడియాలో అయితే రీతూ చౌదరికి ఓట్లు వేయాలని కాంపెయిన్స్ గట్టిగానే జరుగుతున్నాయి.

ఆమె టీం ఈ విషయంలో ఫుల్ డ్యూటీ చేస్తుంది అని అర్ధం చేసుకోవచ్చు. కానీ ఓటింగ్స్ పరంగా చూసుకుంటే.. ఆ కాంపెయిన్స్ కి తగ్గట్టు ఉండటం లేదు. గత వారంలో సంజనతో రీతూ చౌదరి గొడవ పెత్తున హాట్ టాపిక్ అయ్యింది. ఆ గొడవలో సంజనని రీతూ టార్గెట్ చేయడం అనేది ఆడియన్స్ కి నచ్చలేదు. అక్కడ సంజనపై ఆడియన్స్ కి సింపతీ పెరిగింది. అందువల్ల ఓటింగ్ విషయంలో ఊహించని మార్పు చోటు చేసుకుంది.

రీతూ కూడా గేమ్ విషయంలో సీరియస్ గా ఉండదు.. కానీ డీమోన్ పవన్ తో లవ్ ట్రాక్ నడుపుతూ వైరల్ కంటెంట్ ఇస్తుంది అనే కారణంతో బిగ్ బాస్ ఆమెను బిగ్ బాస్ హౌస్లో ఉండేలా చేశాడు.. ఆడియన్స్ కి మాత్రం ఆమెపై ఎటువంటి పాజిటివ్ ఒపీనియన్ లేదు అనే చెప్పాలి. ఫైనల్ గా ఈ శనివారం రీతూ బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చేసింది. కానీ ఎవ్వరూ ఏమాత్రం ఊహించని ఎలిమినేషన్ ఇది.!

అప్పుడు ‘మసాలా’.. ఇప్పుడు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus