టాలీవుడ్ కి మరో హీరో పరిచయం కాబోతున్నాడు.అతను ఓ హీరోయిన్ తమ్ముడు కావడం విశేషం. ఆ స్టార్ హీరోయిన్ మరెవరో కాదు నివేదా థామస్. ‘జెంటిల్ మన్’ ‘నిన్నుకోరి’ ‘జై లవ కుశ’ వంటి సినిమాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన నివేదా థామస్.. తర్వాత ‘దర్బార్’ ‘వకీల్ సాబ్’ వంటి స్టార్ హీరోల సినిమాల్లో బలమైన పాత్రలు చేసి తన ఇమేజ్ ను ఇంకా పెంచుకుంది.
ప్రస్తుతం ’35’ వంటి కంటెంట్ ఉన్న సినిమాల్లో ప్రధాన పాత్రలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది. ఇప్పుడు ఆమె సోదరుడు నిఖిల్ థామస్ కూడా హీరోగా ఇచ్చేందుకు రెడీ అయ్యాడు.అతను హీరోగా ‘బెంగళూరు మహానగరంలో బాలక’ అనే సినిమా రూపొందుతోంది. ఇటీవల దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ వదిలారు.
మహి – రాజ్ వంటి ఇద్దరు టాలెంటెడ్ దర్శకులు కలిసి తెరకెక్కిస్తున్న సినిమా ఇది. ద్వయం ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఫస్ట్ లుక్ తోనే ఆసక్తిని పెంచింది. ‘సయా క్రియేషన్స్’ ‘ఫాల్కన్ ఎంటర్‌టైన్‌మెంట్స్’ సంస్థలపై అఖిల్ యమ్మన్న, ఎంఎస్ఎన్ మూర్తి, సీహెచ్ వీ శర్మ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.’జాతిరత్నాలు’ ‘మ్యాడ్’ సినిమాలా రచయిత ప్రవీణ్ స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. విశ్వదీప్ సంగీత దర్శకుడు.
మల్లు నాయక్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.నివేదా థామస్ సినిమా అంటే కచ్చితంగా.. అందులో బలమైన కంటెంట్ ఉంటుంది అని ఆడియన్స్ నమ్ముతారు. కమర్షియల్ గా ఆమె ఎంతవరకు అచీవ్ చేసినా.. ఆ మంచి పేరు అయితే సంపాదించుకుంది.మరి ఆమె సోదరుడు నిఖిల్ థామస్ కి కూడా అలాంటి ఇమేజ్ ఉందో లేదో చూడాలి.