Lokesh Kanagaraj: లోకేష్ ‘కన్ఫ్యూజన్’ యూనివర్స్.. బన్నీనా? అమీరా? అసలు ట్విస్ట్ ఇదే!

లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU) గురించి మనందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు ఈ స్టార్ డైరెక్టర్ ప్రాజెక్టుల విషయంలో ఒక కొత్త ‘కన్ఫ్యూజన్ యూనివర్స్’ నడుస్తోంది. కార్తి ‘ఖైదీ 2’ కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తుంటే, లోకేష్ మాత్రం పాన్ ఇండియా స్టార్ల చుట్టూ తిరుగుతున్నారు. నటుడిగా బిజీ అవుతూనే, దర్శకుడిగా తన తర్వాతి సినిమా ఎవరితో అనేది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లా మార్చేశారు. ఒక్క సినిమా కోసం ఇద్దరు భారీ స్టార్ల పేర్లు వినిపిస్తుండటం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.

Lokesh Kanagaraj

గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో ఒకటే హడావిడి నడుస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో లోకేష్ ఒక భారీ సూపర్ హీరో సినిమా ప్లాన్ చేస్తున్నారని గట్టిగా ప్రచారం జరిగింది అసలు ఈ సూపర్ హీరో స్క్రిప్ట్ మొదట సూర్య, ఆ తర్వాత అమీర్ ఖాన్ కోసం రాసిందేనని, చివరికి అది బన్నీ చేతికి వచ్చిందనే టాక్ వినిపించింది. అమీర్ ఖాన్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది కాబట్టే బన్నీ లైన్ లోకి వచ్చారని అంతా భావించారు.

కానీ ఇక్కడే సీన్ రివర్స్ అయ్యింది. అమీర్ ఖాన్ సినిమా అటకెక్కిందని అంతా అనుకుంటున్న టైమ్ లో, స్వయంగా ఆయనే మైక్ పట్టుకుని ఒక బాంబ్ పేల్చారు. “గత నెలలోనే లోకేష్ తో మాట్లాడాను. మా ఇద్దరి కాంబినేషన్ లో సినిమా ఉంది. చర్చలు పాజిటివ్ గా జరుగుతున్నాయి” అని క్లారిటీ ఇచ్చారు. దీంతో ఇండస్ట్రీ వర్గాలకు, ఫ్యాన్స్ కు ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయ్యింది.

ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే.. అమీర్ ఖాన్ తో లోకేష్ సినిమా ఆన్ లో ఉంటే, మరి బన్నీ ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటి? అల్లు అర్జున్ తో అనుకున్న సూపర్ హీరో కథే ఇప్పుడు అమీర్ ఖాన్ తో చేస్తున్నారా? లేక అమీర్ కోసం పూర్తిగా కొత్త కథ రాస్తున్నారా? అనేది ఎవరికీ అర్థం కావడం లేదు. ఒకవేళ ఒకే స్క్రిప్ట్ అయితే.. బన్నీ డ్రాప్ అయ్యారా లేక అమీర్ ఖాన్ మళ్లీ రేసులోకి వచ్చారా అనేది తెలియాల్సి ఉంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus