Ariyana: ఎన్నారైతో ప్రేమలో పడ్డ అరియనా!

‘బిగ్ బాస్’ సీజన్ 4లో కంటెస్టెంట్ గా పాల్గొన్న అరియానా గ్లోరీ తన ఆటతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. హౌస్ లో ఉన్నంత కాలం సోహైల్ తో గొడవ పడుతూ వార్తల్లో నిలిచేది. అయితే ఆమె ముక్కుసూటితనంతో అభిమానులను సంపాదించుకుంది. చాలా మంది సెలబ్రిటీలు సైతం అరియానాకు సపోర్ట్ చేస్తూ పోస్ట్ లు పెట్టేవారు. హౌస్ నుండి బయటకు వచ్చిన తరువాత ఈ బ్యూటీ చాలా బిజీ అయిపోయింది. రీసెంట్ గా ఓ బోల్డ్ ఇంటర్వ్యూతో ట్రెండింగ్ లో నిలిచింది.

దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో అరియనాకు ఉన్న బంధం గురించి తెలిసిందే. ఆయన ఇంటర్వ్యూ ద్వారానే అరియనా ఫేమస్ అయింది. తాజాగా మరోసారి వర్మను ఇంటర్వ్యూ చేసి వార్తల్లో నిలిచింది ఈ బ్యూటీ. ఈ ఇంటర్వ్యూలో అరియనా బాయ్ ఫ్రెండ్ టాపిక్ కూడా వచ్చింది. అయితే ఆమె ఆన్సర్ చేయకుండా తప్పించుకుంది. ఇప్పుడు ఆమె బాయ్ ఫ్రెండ్ కి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అరియనా బిగ్ బాస్ షోలోకి అడుగుపెట్టకముందే ఆమె ఒక ఎన్నారైతో డేటింగ్ లో ఉందని సమాచారం.

వృత్తిరీత్యా అతను ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్నాడు. కానీ హైదరాబాద్ లో పని చేస్తున్నప్పుడే అరియానాతో డేటింగ్ మొదలుపెట్టారట. ఏది ఏమైనా.. అరియనా సోషల్ మీడియాలో ఎలా ట్రెండింగ్ లో ఉండాలో తన గురువు వర్మ దగ్గర నుండి నేర్చుకున్నట్లుంది!

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus