ఆ హీరో ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ లో బుక్కైనందుకు 5 వేలు జరిమానా…!

ఈ మధ్య రోడ్డు ప్రమాదాలు ఎక్కువయ్యాయి. నిర్లక్ష్యంగా స్పీడ్ గా డ్రైవింగ్ చేస్తూ వారితో పాటు అమాయక ప్రాణాల్ని కూడా బలితీసుకుంటున్నారు. వీరిలో ఎక్కువ శాతం మందుబాబులు ఉండడం గమనార్హం. దీంతో పోలీసులు ఈమధ్య ఎక్కువగా.. చెకింగ్ లు నిర్వహించి ‘డ్రంకెన్ డ్రైవ్’ చేసే వారిపై తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో కొంతమంది సినీ సెలబ్రిటీలు కూడా దొరుకుతుండడం ఆశ్చర్యం కలిగించే విషయం. తాజాగా ఓ ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్ మరియు హీరో అయిన ప్రిన్స్ కూడా ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ లో దొరికేసాడు.

హైదరాబాద్… బాచుపల్లిలోని ‘వీఎన్ఆర్ కాలేజీ వద్ద ‘డ్రంకెన్ డ్రైవ్’ లో పోలీసులకి దొరికాడు ప్రిన్స్ . ఈ నెల 24న ఇది జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తుంది. ఈ కేసు బుక్కైన నేపథ్యంలో కూకట్ పల్లి 4వ మెట్రోపాలిటన్ స్పెషల్ కోర్టుకు ప్రిన్స్ హాజరుకావడంతో ఈ వార్త వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో కోర్టు వారు ప్రిన్స్ కు 5 వేల రూపాయలు జరిమానా విధించారు. ప్రిన్స్ ఇలా ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ లో దొరకడం మొదటిసారి కాబట్టి తక్కువ జరిమానాతోనే కోర్టు వారు సరిపెట్టినట్టు తెలుస్తుంది. లేకపోతే మరింత ఎక్కువ జరిమానాతో పాటు… జైలు శిక్ష కూడా పడి ఉండేదని సమాచారం. ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన ‘బిగ్ బాస్ సీజన్ 1’ లో కంటెస్టెంట్ గా పాల్గొని ప్రేక్షకులని అలరించాడు ప్రిన్స్.

“జార్జ్ రెడ్డి” సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ సాధించిన సౌత్ సినిమా టీజర్లు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus