గెలిచే వచ్చావని అంటున్నారు.. కుమార్ సాయి కామెంట్స్!

బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ గా పాల్గొన్న కుమార్ సాయి ఆరో వారం ఎలిమినేషన్ లో బయటకి వచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొన్ని టీవీ, యూట్యూబ్ ఛానెల్స్ ఆయన ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన చెబుతోన్న విషయాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఇప్పటికే హౌస్ మేట్స్ గురించి చెప్పిన కుమార్ సాయి తాజాగా తన ఫ్యామిలీ లైఫ్ గురించి మాట్లాడారు. ప్రేమించి అమ్మాయిని పెళ్లి చేసుకొని హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నట్లు చెప్పారు.

దేవుడు తనకు అందమైన భార్యనిచ్చాడని అన్నారు. ఓ సినిమాలో హీరోగా నటించిన సమయంలో తన భార్యతో పరిచయం ఏర్పడిందని.. ఆ తరువాత ఆరు నెలల్లో ఒకరినొకరు ప్రేమించుకొని, పెళ్లి చేసుకున్నట్లు చెప్పారు. తన భార్యకు హౌస్ వైఫ్ గా ఉండడం ఇష్టమని, ప్రస్తుతం ఇంట్లోనే ఉంటూ పిల్లలను చూసుకుంటుందని అన్నారు. ఇక బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు.. ప్రతివాడు తన మెడ పట్టుకొని గెంటేస్తుంటే ఇంట్లో వాళ్లకు కంగారు ఉంటుందని అన్నారు.

తను ఇలాంటి విషయాలను పెద్దగా పట్టించుకోనప్పటికీ.. తనను ప్రేమించిన వాళ్లు బాధ పడతారనే ఫీలింగ్ ఉందని అన్నారు. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చే వరకు తనపై జనాల్లో పాజిటివ్ ఫీల్ ఉందని తెలియదని.. దీంతో గేమ్ సరిగ్గా ఆడలేకపోయానని.. తన భార్యకి చెబుతుంటే.. ఆమె ‘నువ్ చాలా బాగా ఆడావు.. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఓడిపోయి వచ్చావని అనిపించట్లేదు. గెలిచే వచ్చావని మాకు అనిపిస్తుంది’ అంటూ చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నాడు.

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus