బిగ్ బాస్ హౌస్ లో రోజంతా జరిగే ఫుటేజ్ ను గంటకు ఎడిట్ చేసి ప్రేక్షకులకు అందిస్తారు. హౌస్ లో రోజంతా ఏం జరుగుతుందనే విషయాలు ఎలిమినేట్ అయి వచ్చిన సభ్యులు కొందరు ఇంటర్వ్యూలలో చెబుతుంటారు. హౌస్ లో తాము చేసింది చూపిస్తేనే కదా ప్రేక్షకులకు నచ్చి ఓట్లు వేసేది. అలా కాకుండా వాళ్లు ఎవరికి ఓట్లు రావాలనుకుంటారో వాళ్లనే ఎక్కువగా చూపిస్తుంటారని చెబుతుంటారు. ఇందులో ఎంతవరకు నిజముందనే విషయం బిగ్ బాస్ నిర్వాహకులకే తెలియాలి.
అలానే ఓట్ల ఆధారణంగానే ఎలిమినేషన్లు ఉంటాయని అంటారు కానీ బయటకి వచ్చిన ప్రతీ కంటెస్టెంట్ కూడా తమకు ఓట్లు బాగా వేశారని.. బయటకి వచ్చిన తరువాత తెలుస్తోందని.. తమను ఎందుకు ఎలిమినేట్ చేశారో తెలియడం లేదని చెబుతుంటారు. ఈ సంగతి కూడా బిగ్ బాస్ నిర్వాహకులకే తెలియాలి. ఇదిలా ఉండగా.. ఈ వారం ఎలిమినేట్ అయిన కుమార్ సాయి.. హౌస్ లో ఉన్నన్ని రోజులు టాస్క్ లలో బాగా పెర్ఫార్మ్ చేశారు. అయితే కుమార్ సాయికి సంబంధించిన బయటకి రాని టాస్క్ ఒకటి ఉందని తెలుస్తోంది.
అదే వేగంగా పిండి రుబ్బే టాస్క్. ఈ టాస్క్ లో పిండి బాగా రుబ్బి.. ఎక్కువ దోసెలు వెయ్యాలి. ఈ టాస్క్ కారణంగా కుమార్ సాయి చేతికి కాస్త గాయం కూడా అయినట్లు సమాచారం. ఆ కారణంగానే టాస్క్ ఫుటేజ్ మొత్తం చూపించలేదని తెలుస్తోంది. అంతేకాదు.. గాయానికి సరైన మెడికల్ ఎయిడ్ కూడా ఇవ్వలేదని.. బయటకి వచ్చిన కుమార్ తన సన్నిహితుల దగ్గర బాధపడినట్లు తెలుస్తోంది. మరి మిగిలిన కంటెస్టెంట్ లు బయటకి వచ్చినప్పుడు ఇంకెన్ని విషయాలు చెబుతారో చూడాలి!