ప్రియుడితో బిగ్ బాస్ కంటెస్టెంట్ నిశ్చితార్థం… ఫోటో వైరల్!

‘బిగ్ బాస్‌ 8’ సోనియా (Sonia Akula) సైలెంట్ గా ఎగేజ్మెంట్ చేసుకుని షాకిచ్చింది.ప్రియుడు యష్‌ వీరగోనితో ఆమె ఎంగేజ్మెంట్ జరిగినట్టు తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాస్తవానికి బిగ్ బాస్ కి వెళ్లకపోతే ఉంటే.. ఈపాటికే సోనియా పెళ్లి అయిపోయి ఉండేదట. ఆమె బిగ్ బాస్ కి వెళ్ళక ముందే.. పెళ్లి ఫిక్స్ చేసుకుంది. అయితే సడన్ గా బిగ్ బాస్ ఆఫర్ రావడంతో కొన్నాళ్ళు పెళ్లిని పోస్ట్ పోన్ చేసుకున్నట్టు తెలుస్తుంది.

Sonia Akula

కొద్దిరోజుల క్రితమే సోనియా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చింది.అయితే మళ్ళీ నామినేషన్ టాస్క్ కోసం ఆమెను హౌస్ లోపలికి పంపారు లెండి. కానీ సోనియా పెళ్లి వ్యవహారాన్ని జనాలు పెద్దగా పట్టించుకోలేదు. మొన్న అంటే నవంబర్ 21 న గురువారం సోనియా- యష్..ల నిశ్చితార్థం వేడుక కొద్దిపాటి బంధువులు, మిత్రుల సమక్షంలో జరిగినట్లు సమాచారం. కానీ తన ఎంగేజ్మెంట్ ఫోటోలు సోనియా సోషల్ మీడియాలో వెంటనే షేర్ చేయలేదు. దీంతో అవి ఫేక్ ఏమో అని అంతా అనుకున్నారు.

ఏదేమైనా డిసెంబర్ లో వీరి పెళ్లి జరగబోతుందట. ఇదిలా ఉండగా.. సోనియా పెళ్లి చేసుకోబోతున్న యష్ కి ఇది రెండో వివాహం. గతంలో అతనికి వేరే అమ్మాయితో పెళ్లి జరిగింది. పిల్లలు కూడా ఉన్నారు. కానీ సోనియా దగ్గరయ్యాక యష్ కి తన భార్యతో గొడవలు రావడంతో.. విడాకులు తీసుకోవడం జరిగిందట. ప్రియుడు పేరు చెప్పకుండా హౌస్లో ఉన్నప్పుడు సోనియా.. ఈ విషయాన్ని తోటి కంటెస్టెంట్ ప్రేరణకి  (Prerana) చెప్పింది.]

సత్యదేవ్ ‘జీబ్రా’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus