సమంత హోస్టింగ్.. షాకింగ్ టీఆర్ఫీ రేటింగ్!

బుల్లితెరపై నెంబర్ వన్ రియాలిటీ షోగా దూసుకుపోతుంది బిగ్ బాస్. ప్రస్తుతం నాల్గో సీజన్ నడుస్తోంది. ఇటీవల ఈ షో స్టేజ్ పై సమంత సందడి చేసిన సంగతి తెలిసిందే. దసరా పండుగ స్పెషల్ ఎపిసోడ్ కి గెస్ట్ హోస్ట్ గా బాధ్యతలు నిర్వర్తించింది సమంత. హోస్ట్ నాగార్జున ‘వైల్డ్ డాగ్’ సినిమా షూటింగ్ కోసం మనాలీ వెళ్లాల్సి రావడంతో బిగ్ బాస్ టీమ్ సమంతను తీసుకొచ్చింది. తన మామ లేని లోటుని సమంత భర్తీ చేసింది.

ఈ ఎపిసోడ్ తో సమంత కు ప్రేక్షకాదరణ లభించింది కానీ కొందరు సమంతను, బిగ్ బాస్ షోని ట్రోల్ చేశారు. హోస్ట్ గా సామ్ ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయిందని విమర్శించారు. ఈ ఎపిసోడ్ కి పూర్ రేటింగ్ వస్తాయని ముందే జోస్యం చెప్పేశారు. బిగ్ బాస్ షో అక్కినేని ఫ్యామిలీ షోగా మారిందంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. సమంత హోస్ట్ గా పనికిరాదంటూ ట్రోల్ చేశారు. కానీ తాజాగా ఈ ఎపిసోడ్ కి సంబంధించిన టీఆర్ఫీ రేటింగ్ బయటకు రావడంతో విమర్శలు చూసినవారంతా సైలెంట్ అయ్యారు.

దసరా నాడు టెలికాస్ట్ అయిన ఈ షోకి 11.4 రేటింగ్ వచ్చిందని అధికారిక సమాచారం. ఈ రేటింగ్ చూసిన సమంత ఫ్యాన్స్.. ”ఇదీ సామ్ రేంజ్” అంటూ తమ అభిమాన నటిని చూసుకొని మురిసిపోతున్నారు. ఒక్క ఎపిసోడ్ కే ఇంత టీఆర్ఫీ వస్తే.. ఇక ఆమెని హోస్ట్ గా కంటిన్యూ చేస్తే రికార్డ్స్ బద్దలవ్వడం ఖాయమని సలహాలిస్తున్నారు. కానీ ఆ ఛాన్స్ లేదని తెలుస్తోంది. నాగార్జున తన షూటింగ్ పనులు చూసుకుంటూనే వారాంతంలో హైదరాబాద్ వచ్చి బిగ్ బాస్ షూటింగ్ పూర్తి చేసుకొని వెళ్లాలని నిర్ణయించుకున్నారు. గత వారం కూడా ఇదే పద్ధతి ఫాలో అయ్యారు.

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus