Monal: వామ్మో.. మోనాల్ పై అఖిల్ కు ఇంత ప్రేమ ఉందా..?

బిగ్ బాస్ షో సీజన్ 4లో పాల్గొని ప్రేమ జంటగా పేరు తెచ్చుకున్న అఖిల్ మోనాల్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా తమ ప్రేమను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే లవ్ లో ఉన్నట్టు ఈ జోడీ డైరెక్ట్ గా చెప్పకపోయినా అఖిల్ మోనాల్ చేసే పనులు మాత్రం వారు ప్రేమలో ఉన్నట్టు చెప్పకనే చెబుతున్నాయి. మేము మంచి ఫ్రెండ్స్ అని అఖిల్ మోనాల్ క్లారిటీ ఇస్తున్నా వాళ్ల మధ్య ఏదో ఉందనే ప్రచారం మాత్రం ఆగడం లేదు.

తెలుగులో చాలా సినిమాల్లో నటించినా పెద్దగా క్రేజ్ రాని మోనాల్ గజ్జర్ బిగ్ బాస్ షో ద్వారా భారీగా పాపులారిటీ సంపాదించుకున్నారు. బిగ్ బాస్ షోకు ముందు అఖిల్ సార్థక్ పలు సీరియళ్లలో నటించినా ఈ షో ద్వారానే అఖిల్ ప్రేక్షకులకు సుపరిచితులయ్యారు. అయితే మోనాల్ గజ్జర్ పుట్టినరోజు సందర్భంగా అఖిల్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. రాణులకు సంబంధించి చాలా కథలు విన్నా రియల్ లైఫ్ రాణి మాత్రం నువ్వేనంటూ మోనాల్ పై ప్రేమను అఖిల్ చెప్పుకొచ్చారు.

మోనాల్ గురించి వర్ణించడానికి తాను వాడిన పదాలు చిన్న పదాలు అని అయితే ఆ పదాలను మించి వర్ణించడం తన వల్ల కావడం లేదని అఖిల్ వెల్లడించారు. మోనాల్ లాంటి వ్యక్తిని పరిచయం చేసినందుకు బిగ్ బాస్ షోకు థ్యాంక్స్ అని అఖిల్ పేర్కొన్నారు. అఖిల్ మోనాల్ పై ప్రేమను వ్యక్తం చేస్తూ పెట్టిన పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఎల్లప్పుడూ తాను మోనాల్ వెంటే ఉంటానని అఖిల్ మోనాల్ కు అభయమిచ్చారు.

మోనాల్ ఫ్యూచర్ లో చాలా ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నానని అఖిల్ పేర్కొన్నారు. ప్రేమతో జైకృష్ణ జై శ్రీరామ్ అంటూ అంటూ అఖిల్ తన పోస్ట్ ను ముగించారు. అఖిల్ పోస్టును చూసిన నెటిజన్లు మోనాల్ పై అఖిల్ కు ఇంత ప్రేమ ఉందా..? అని కామెంట్లు చేస్తున్నారు.


Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus