Vasanthi Krishnan Marriage: ఘనంగా జరిగిన ‘బిగ్ బాస్’ వాసంతి కృష్ణన్ పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు.!

పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. వరుసగా సినీ సెలబ్రిటీలు పెళ్లిపీటలెక్కుతున్నారు. ఇటీవల దిల్ రాజు తమ్ముడు శిరీష్ కొడుకు అయిన ఆశిష్ పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడయ్యాడు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. అలాగే ‘ఎక్స్ట్రా’ సినిమాలో విలన్ గా నటించిన సుదేవ్ నాయర్ కూడా పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యాడు. అలాగే స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా తన ప్రియుడు జాకీ భగ్నానీని ఈరోజు గోవాలో కొద్దిపాటి బంధు మిత్రుల సమక్షంలో ఘనంగా పెళ్లి చేసుకుంది.

అలాగే మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ కూడా వివాహం చేసుకుని షాకిచ్చింది. వివరాల్లోకి వెళితే.. ‘బిగ్ బాస్’ తెలుగు సీజన్ 6 కంటెస్టెంట్ అయిన వాసంతి కృష్ణన్ అందరికీ సుపరిచితమే. కొన్నాళ్లుగా ఈమె పవన్ కల్యాణ్‌ అనే వ్యక్తితో డేటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. వీళ్ళు అనేక షోలలో కూడా సందడి చేస్తూ వచ్చారు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లిప్ లాక్ ..ల టైపులో ఉండే ఓ గేమ్ ఆడి సోషల్ మీడియాకి హీటెక్కించారు.

అయితే చాలా సైలెంట్ గా వీరు పెళ్లి చేసుకుని అందరికీ పెద్ద షాకిచ్చారు. తిరుపతిలో తమ కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల సమక్షంలో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. 2023 చివర్లో అంటే డిసెంబర్ 7న వీరు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. వీరి (Vasanthi Krishnan) పెళ్లి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

‘యానిమల్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసింది.. లాభం ఎంత?

ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ .. ల లిస్ట్.!
కోపంతో ఊగిపోయిన మిడ్ రేంజ్ హీరో.. ఏం అయ్యిందంటే?

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus