Bigg Boss Telugu 6: సూపర్ ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్..! కన్ఫూజన్ లో హౌస్ మేట్స్..!

  • November 15, 2022 / 10:53 AM IST

బిగ్ బాస్ హౌస్ లో 11వ వారం నామినేషన్స్ అయిపోయిన తర్వాత హౌస్ మేట్స్ కి బంపర్ ఆఫర్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈవారం నామినేషన్స్ నుంచీ సేఫ్ అవ్వాలంటే ప్రైజ్ మనీ లో కటాఫ్ పేమెంట్ ఎంతో రాయమని చెప్పాడు. దీనిని బిడ్ గా వేసి బాక్స్ లో వేయమని టాస్క్ ఇచ్చాడు. ప్రైజ్ మనీ 50 లక్షలు నుంచీ ఎవరైతే అత్యధింకగా బిడ్ వేస్తారో వాళ్లకి ఈవారం సేప్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పాడు. ఇక దీనికోసం హౌస్ మేట్స్ ఆలోచనలో పడ్డారు.

నిజానికి ఎప్పుడూ కూడా టాప్ – 3 మెంబర్స్, లేదా టాప్ 4 మెంబర్స్ ఉన్నప్పుడు సిల్వర్ బ్రీఫ్ కేస్, గోల్డెన్ బ్రీఫ్ కేస్ లని పంపించి బిగ్ బాస్ గేమ్ ఆడతాడు. హౌస్ మేట్స్ ని టెమ్ట్ చేస్తూ ఊరిస్తాడు. ఈ క్యాష్ ప్రైజ్ 50 లక్షల్లో నుంచీ విన్నర్ తీసుకునే మనీ లోనుంచీ తగ్గిపోతుంది. ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్ ఇలాంటిందే ఈవారం సేఫ్ అయ్యేందుకు హౌస్ మేట్స్ కి ఇచ్చాడు బిగ్ బాస్.

50 లక్షల రూపాల్లోనుంచీ ఏ హౌస్ మేట్ అయితే అత్యధికంగా తనకి వద్దని ఎమౌంట్ ని బిడ్ గా వేస్తాడో ఆ వ్యక్తి ఈవారం నామినేషన్స్ నుంచీ సురక్షితుడు అవుతాడు. ఉదాహరణకి 49లక్షలు అందరికంటే ఎక్కువ ఉంటే ఆ ఎమౌంట్ ని పరిగణలోకి తీస్కుంటారు. అప్పుడు ప్రైజ్ మనీ అతడు విన్నర్ అయినా కూడా అతనికి కేవలం లక్షరూపాయాలు మాత్రమే వస్తుంది. అంటే ఈవారం ఇమ్యూనిటీ కాస్ట్ అన్నమాట. మరి హౌస్ మేట్స్ లో ఎవరు ఎక్కువ బిడ్ వేశారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

నిజానికి ఈవారం నామినేషన్స్ లో కెప్టెన్ ఫైమా తప్ప అందరూ ఉన్నారు. వీళ్లలో సింగిల్ ఓటుతో వచ్చినవాళ్లు కూడా ఉన్నారు. వీళ్లలో ఎవరు డేంజర్ లో ఉన్నారంటే., అన్ అఫీషియల్ పోలింగ్స్ లో చూస్తే ఆదిరెడ్డి, రాజ్, కీర్తి, శ్రీసత్య, మెరీనా, రోహిత్ డేంజర్ జోన్ లో కనిపిస్తున్నారు. అందరికంటే ఇప్పుడు ఇమ్యూనిటీ వీళ్లకే అవసరం. మరి వీళ్లు ఎక్కువ బిడ్ వేస్తారా.. టాస్క్ లో గెలుస్తారా లేదా అనేది చూడాలి. అదీ మేటర్.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus