బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీ సీజన్ – 1 గ్రాండ్ ఫినాలే ఓటింగ్ ముగిసింది. నిజానికి శుక్రవారం రాత్రి వరకూ ఓటింగ్ లైన్స్ ఓపెన్ ఉంటాయని బిగ్ బాస్ లవర్స్ అందరూ అనుకున్నారు. కానీ, అనూహ్యంగా బుధవారం రాత్రికే ఓటింగ్ లైన్స్ క్లోజ్ చేసేశారు. దీనికి అసలు కారణం ఏంటి ? ఎందుకు అంత త్వరగా క్లోజ్ చేయాల్సి వచ్చిందని బిగ్ బాస్ వ్యూవర్స్ ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
అసలు మేటర్లోకి వెళితే, ప్రతిసారి బిగ్ బాస్ సీజన్స్ లో ఓటింగ్ లైన్స్ ఐదురోజుల పాటు ఉంచుతారు. ఆదివారం రాత్రి నుంచీ శుక్రవారం రాత్రి వరకూ కూడా ఓటింగ్ అనేది జరుగుతుంది. టాప్ 5 లో ఉన్న కంటెస్టెంట్స్ కి సంబంధించిన ఫేవరెట్స్ వాళ్లకి ఓట్లు అనేది వేస్తుంటారు. వాళ్లకి నచ్చిన వాళ్లని గెలిపించుకునే ప్రయత్నం చేస్తుంటారు. అయితే, ఈసారి ఓటీటీలో మాత్రం ముందుగానే ఓటింగ్ ని క్లోజ్ చేశారు.
దీనికి కారణం మిడ్ వీక్ ఎలిమినేషన్ అని టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే, హౌస్ లో ప్రస్తుతం 7గురు ఇంటి సభ్యులు ఫినాలేకి వచ్చారు. నిజానికి ఫైనల్స్ లో ఎప్పుడూ కూడా టాప్ 5 కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలి ఉంటారు. కానీ, ఈసారి టాప్ – 7 కంటెస్టెంట్స్ ని ఉంచాడు బిగ్ బాస్. వాళ్ల జెర్నీలు సైతం చూపిస్తూ వాళ్లని కూడా ఫైనలిస్ట్ లని చేశారు.
బాబాభాస్కర్ వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చి ఎవిక్షన్ ఫ్రీ పాస్ ద్వారా సేవ్ అయ్యారు. దీంతో ఫైనల్ గా ఏడుగురు మిగిలారు. ఇప్పుడు ప్రస్తుతం 7గురు ఇంటి సభ్యులు ఉన్నారు కాబట్టి మిడ్ వీక్ ఇద్దరిని ఎలిమినేట్ చేయాల్సి వస్తుంది. అందుకే, ఓటింగ్ లైన్స్ ని కావాలనే బుధవారానికి క్లోజ్ చేశారనేది టాక్. ఇలా క్లోజ్ చేయడం వల్ల ఇక బిగ్ బాస్ పార్టిసిపెంట్స్ లో ఎవర్ని ఎలిమినేట్ చేసినా కూడా ప్రాబ్లమ్ ఉండదు.
బోటమ్ లో ఉన్న ఇద్దరిని ఎలిమినేట్ చేయచ్చు. అయితే, ఇక్కడే బిగ్ బాస్ ట్విస్ట్ ఇస్తాడా ? హౌస్ లో ఓటింగ్ పెట్టి ఎలిమినేట్ చేస్తాడా ? లేదా ఆడియన్స్ ఓటింగ్ ని బట్టీ ఎలిమినేట్ చేస్తాడా అనేది ఆసక్తికరం. ఎందుకంటే, లాస్ట్ వీక్ హౌస్ మేట్స్ ఓటింగ్ తో నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు. ఇలాంటి ప్రక్రియ చేసిన తర్వాత స్టేజ్ పైన నాగార్జున ఆడియన్స్ ఓటింగ్ ప్రకారమే నటరాజ్ మాస్టర్ ని ఎలిమినేట్ చేశామని చెప్పాడు.
కానీ, ఎక్కడో ఈ ప్రక్రియ అనేది బిగ్ బాస్ నిర్వాహకులకి బెడిసి కొట్టింది. బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీలో ప్రస్తుతం ఉన్నవారిలో ఓటింగ్ ప్రకారం చూస్తే బాబాభాస్కర్, ఇంకా అనిల్ రాథోడ్ ఇద్దరూ లీస్ట్ లోనే ఉన్నారు. బహుశా మిడ్ వీక్ ఎలిమినేషన్ లో భాగంగా వీరిని ఎలిమినేట్ చేస్తే, ఇక మిగిలిన వారిని టాప్ 5గా ఫినాలేలో ఎలిమినేట్ చేయచ్చు. ఇందులో మిత్రా శర్మా, అరియానా, బిందుమాధవి, అఖిల్, ఇంకా యాంకర్ శివలు ఉంటారు. అందుకే ఓటింగ్ క్లోజ్ చేసి ఉండచ్చని బిగ్ బాస్ ఆడియన్స్ భావిస్తున్నారు. అదీ మేటర్.