Bigg Boss6: వైరల్ అవుతోన్న బిగ్ బాస్ 6 కంటెస్టెంట్స్ లిస్ట్..సెప్టెంబర్ 4th పక్కా..!

బిగ్ బాస్ తెలుగు సీజన్ – 6 ప్రారంభం కాబోతోంది. ఇది నిజంగా బిగ్ బాస్ లవర్స్ కి పండగనే చెప్పాలి. అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టిసిపెంట్స్ ఎవరు వస్తున్నారు అనే దానిపైనే షో హిట్టా ఫట్టా అనేది ఆధారపడి ఉంది. ఫస్ట్ రెండు మూడు వారాలు రేటింగ్ రావాలంటే ఖచ్చితంగా సెలబ్రిటీలు ఒక రేంజ్ లో ఉండాలి. అయితే, ఈసారి సీజన్ – 6 లోకి ఎవరు రాబోతున్నారు అనేది బిగ్ బాస్ లవర్స్ లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. బిగ్ బాస్ సీజన్ -6 హోస్ట్ గా ఈసారి కూడా కింగ్ నాగార్జునే ఉండబోతున్నారు.

ఓటీటీలో షోని చాలా బాగా డీల్ చేసిన నాగార్జున మరోసారి సరికొత్తగా బిగ్ బాస్ షోని డీల్ చేయబోతున్నాడు. ఇక ఈ రియాలిటీ షో సెప్టెంబర్ 4వ తేదిన సాయంత్రం 6గంటల నుంచీ ప్రారంభం కాబోతోందని సమాచారం తెలుస్తోంది. తేదిలో ఎలాంటి మార్పు ఉండదని, అతి త్వరలోనే దీనికి సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేయబోతున్నారని సమాచారం. నిజానికి ఆగష్టు చివరి వారంలోనే ఈ షోని ప్లాన్ చేశారు. కానీ, కొన్ని కారణాల వల్ల ఇది సెప్టెంబర్ ఫస్ట్ వీక్ కి వాయిదా పడింది. ఇక ఈసారి బిగ్ బాస్ బజ్ హోస్ట్ గా యాంకర్ శివ ఉండబోతున్నాడని సమాచారం.

లాస్ట్ టైమ్ ఓటీటీలో దుమ్మురేపిన యాంకర్ శివ సోషల్ మీడియాలో కాంట్రవర్సీ శివగా బాగా పేరు. అందుకే, బిగ్ బాస్ హోస్ట్ గా యాంకర్ శివని తీస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక పార్టిసిపెంట్స్ విషయానికి వస్తే, ఈసారి 15మందిని ఒకేసారి స్టేజ్ పై నుంచీ హౌస్ లోకి పంపించబోతున్నారు. మిగతా ఇద్దర్నీ వైల్డ్ కార్డ్ ద్వారా పంపిస్తారట. ప్రస్తుతానికి సోషల్ మీడియాలో చాలామంది పేర్లు వినిపిస్తున్నా కూడా ఇప్పటి వరకూ అధికారికంగా అయితే ఎవర్నీ ప్రకటించలేదు. ఇక సోషల్ మీడియాలో వినిపిస్తున్న పేర్లు చూసినట్లయితే,

1) యాంకర్ ఉదయభాను :

ఉదయభాను అందరికీ చాలా సుపరిచితురాలే. యాంకర్ గా తన కెరియర్ ని స్టార్ట్ చేసినప్పటినుంచీ ఎన్నో రియాలిటీ షోలు, స్టేజ్ షోలు దిగ్విజయంగా చేసింది. అంతేకాదు, తన పర్సనల్ లైఫ్ లో కూడా చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. రకరకాల ఊహాగానాలు కూడా ఉన్నాయి. ఈసారి వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ ఈషోలో అసలు నిజాలు చెప్పబోతోందని అంటున్నారు. బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేయడం ద్వారా ఉదయభాను కెరియర్ మళ్లీ రీ ఎంట్రీ అవుతుందని చెప్పొచ్చు. మరి ఉదయభాను ఈసారి సీజన్ 6లోకి వస్తే మాత్రం ఖచ్చితంగా అది షోకి ప్లస్ పాయింట్ అవుతుంది.

2) నేహా చౌదరి

యాంకర్ గా నేహా చౌదరి అందరికీ పరిచయమే. ఆర్టిస్ట్ గా ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తోంది. ముఖ్యంగా ఐపియల్ చూసే వారికి నేహా చౌదరి బాగా పరిచయం. స్పోర్ట్స్ యాంకర్ గా మంచిగా సెటిల్ అయ్యింది నేహా చౌదరి. బిగ్ బాస్ హౌస్ లోకి వస్తే మాత్రం తన గ్లామర్ తో అందర్నీ ఆకట్టుకోవడం ఖాయం.

3) చలాకీ చంటి

జబర్ధస్త్ ఫేమ్ చలాకీ చంటి తెలుగువారికి అందరికీ బాగా తెలుసు. ఈసారి జబర్ధస్త్ షో నుంచీ చలాకీ చంటి బిగ్ బాస్ హౌస్ కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి చలాకీ చంటి వస్తే తన జోక్స్ తో మంచి ఎంటర్ టైన్ చేస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు.

4) ఆర్జే సూర్య

ఆర్జే సూర్య విజయ్ దేవరకొండ మిమిక్రీ చేస్తూ బాగా పాపులర్ అయ్యాడు. కొండబాబుగా తెలుగు వారికి దగ్గరయ్యాడు. రెడ్ ఎఫ్ ఎమ్ లో జాబ్ చేస్తూనే తను యాంకర్ గా కూడా అడుగులు వేశాడు. ఈసారి బిగ్ బాస్ కి వస్తే ఆర్జే సూర్య కెరియర్ కి మంచి ప్లస్ అయ్యే అవకాశం ఉంది.

5) టివి – 9 ప్రత్యూష

ప్రతి సీజన్ లో టివి 9 లో నుంచీ ఎవరో ఒకరు బిగ్ బాస్ షోకి రావడం అనేది ఆనవాయితీగా వస్తునే ఉంది. ఈసారి టివి – 9 యాంకర్ ప్రత్యూష బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

6) యూట్యూబర్ నిఖిల్

నిఖిల్ కి యూట్యూబ్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. సెలబ్రిటీ ఇంటర్య్వూస్ చేస్తూ తనదైన స్టైల్లో యూట్యూబర్ గా ట్రెండ్ క్రియేట్ చేస్తాడు. లాస్ట్ సీజన్ లో స్టేజ్ పైన నాగార్జునతో కలిసి తన మిత్రులని పలకరించాడు కూడా. ఈసారి యూట్యూబర్ నిఖిల్ బిగ్ బాస్ షోకి రాబోతున్నట్లుగా సమాచారం.

7) శ్రీహాన్ 

ఈసారి సోషల్ మీడియా ఫేమ్, ఆర్టిస్ట్ అయిన శ్రీహాన్ కూడా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. లాస్ట్ సీజన్ లో షణ్ముక్ – సిరి ఇద్దరూ సోషల్ మీడియా నుంచీ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈసారి సిరి బాయ్ ఫ్రెండ్ అయిన శ్రీహాన్ సందడి చేయబోతున్నాడు.

8) సింగర్ మోహన భోగరాజ్

2017లో దిక్కులు చూడకు రామయ్య సినిమాతో సింగర్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పట్నుంచీ చాలా పాటలు పాడుతూ ఫేమస్ అయ్యింది. కీరవాణి, మిక్కీ జే మేయర్, థమన్, మణిశర్మ ఇలా చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర పాటలు పాడుతూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకుంది. ఈసారి సింగల్ మోహన భోగరాజ్ కూడా బిగ్ బాస్ లోకి అడుగుపెట్టబోతోందని టాక్.

9) ఆర్టిస్ట్ నందు

ఫోటో సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన నందు, ఆ తర్వాత సింగర్ గీతామాధురిని పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యాడు. స్టార్ స్పోర్ట్స్ లో యాంకర్ గా చేస్తూనే , సినిమా హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నాడు. రీసంట్ గా సిక్స్ ప్యాక్ చేసిన నందు బిగ్ బాస్ సీజన్ – 6 లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.

10) యాంకర్ వర్షిణి

లాస్ట్ సీజన్ లో యాంకర్ వర్షిణి వైల్డ్ కార్డ్ గా ఎంట్రీ ఇస్తుందని అందరూ అనుకున్నారు. కానీ, లాస్ట్ మినిట్ లో డ్రాప్ అయ్యింది. కానీ, ఈసారి సీజన్ – 6లోకి మాత్రం తనదైన స్టైల్లో ఎంట్రీ ఇవ్వబోతోందని టాక్ వినిపిస్తోంది.

11) హీరో భరత్

చైల్డ్ ఆర్టిస్ట్ గా భరత్ తెలుగు వారికి చాలా సుపరిచితుడు. రీసంట్ గా హీరోగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ -6లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆచారి అమెరికా యాత్ర, ఇద్దరి లోకం ఒకటే, ఎబిసిడి, ఇలా సినిమాల్లో యంగ్ రోల్ లో నటించాడు భరత్.

12) యాంకర్ స్రవంతి చొక్కారపు

లాస్ట్ టైమ్ ఓటీటీ సీజన్ లో తనదైన స్టైల్లో దుమ్మురేపింది. ఈసారి బిగ్ బాస్ సీజన్ 6లోకి అడుగుపెట్టబోతోంది. నిజానికి లాస్ట్ టైమ్ సీజన్ – 5లోనే స్రవంతి రావాల్సి ఉంది. అయితే, ఇప్పుడు తనకి ఇది బెస్ట్ ఆపుర్చునిటీ అని చెప్పొచ్చు.

13) అజయ్

అజయ్ కూడా ఓటీటీ సీజన్ లో దుమ్మురేపాడు. ఎలాంటి అంచనాలు లేకుండా హౌస్ లోకి వెళ్లి తనకంటూ ఫ్యాన్ బేస్ ని పెంచుకున్నాడు. అజయ్ కూడా ఈసారి బిగ్ బాస్ సీజన్ – 6లోకి అడుగు పెట్టే అవకాశం కనిపిస్తోంది.

14) కొరియోగ్రాఫర్ పప్పీ మాస్టర్

కొరియోగ్రాఫర్ పప్పీ మాస్టర్ ఢీ షో ద్వారా తెలుగు వారికి బాగా సుపరిచితురాలు. ఈసారి పప్పీ మాస్టర్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్ట బోతోందని టాక్.

15) సంజనా చౌదరి

హీరోయిన్ సంజనా చౌదరి. చిన్న బడ్జెట్ మూవీస్ లో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది సంజనా. ఈసారి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా బిగ్ బాస్ సీజన్ – 6లోకి అడుగు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలర్ట్ సినిమా, బొమ్మ అదిరింది సినిమాల్లో హీరోయిన్ గా లీడ్ క్యారెక్టర్స్ లో నటించింది సంజనా.

ప్రస్తుతానికి సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తున్న పేర్లు అయితే ఇవే. ఇంకా ఇద్దరు ముగ్గురు వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మరి ఈసారి బిగ్ బాస్ సీజన్ – 6 అనేది ఎంత రసవత్తరంగా ఉండబోతోంది అనేది చూడాలి.

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus