బిగ్ బాస్ సీజన్ 9 3 వ వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. 15 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ సీజన్లో.. ఆల్రెడీ ఇద్దరు శ్రేష్టి వర్మ, మర్యాద మనీష్..లు ఎలిమినేట్ అయ్యారు.తాజాగా కొత్త కంటెస్టెంట్ ను వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇప్పించారు. హౌస్మేట్స్ ఓటింగ్ ను పరిగణలోకి తీసుకోకుండా తనకు నచ్చిన కంటెస్టెంట్ ను హౌస్లోకి తీసుకొచ్చి అందరికీ పెద్ద షాకిచ్చాడు బిగ్ బాస్. ఆమెనే దివ్య. ఆమె హౌస్లో తీసుకు రావడమే ఆమెకు ఓ పవర్ కూడా ఇచ్చాడు బిగ్బాస్.అదేంటంటే ఇప్పటివరకు ఆమె బయట ఉండి చూసిన గేమ్ ను బట్టి.. ఏ హౌస్ మేట్ ఎలా ఆడుతున్నాడు అనే ఆర్డర్ లో వాళ్ళను నిల్చోబెట్టాలి అంటూ ఆదేశించాడు.
అంటే వాళ్ళని ఆర్డర్లో పెట్టిన తీరుని బట్టి.. దివ్య ఎలాంటిది అనే ఐడియా హౌస్మేట్స్ కి వచ్చేసి.. ఆమె విషయంలో మాస్క్ లేకుండా ప్రవర్తిస్తారు అనేది బిగ్ బాస్ ఒపీనియన్ కావచ్చు. అలా చేయకపోతే.. హౌస్మేట్స్ తో ఆమె మింగిల్ అవ్వడానికి టైం తీసుకునే అవకాశం ఉంది. అందుకే ర్యాంకింగ్ ప్రకారం ఆమె కంటెస్టెంట్స్ ని నిల్చోబెడితే.. హౌస్మేట్స్ విషయంలో ఆమెకు ఎలాంటి అభిప్రాయం ఉంది అనేది కూడా బయటపడుతుంది.
ఈ నేపథ్యంలో దివ్య ఫ్లోరా షైనీని చివరి స్థానంలో నిల్చోబెట్టింది. మొదటి స్థానంలో భరణిని నిల్చోబెట్టింది. ఇమ్మాన్యూల్ ని 2 వ స్థానంలో, సంజనని 3వ స్థానంలో, పవన్ ని 4 వ స్థానంలో, తనూజని 5 వ స్థానంలో పెట్టింది. దివ్య నిల్చోబెట్టిన కంటెస్టెంట్స్ లో టాప్ 5లో ఉన్న వాళ్ళతో ఆమె కెప్టెన్సీ టాస్క్ ఆడటం.. వాళ్ళలో ఇమ్మాన్యూల్ గెలిచి కెప్టెన్ అవ్వడం జరిగింది. అయితే దివ్య ఇచ్చిన ర్యాంకింగ్ ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయ్యింది.