బిగ్‌బాస్‌ 4 హైలెట్స్: 12వ రోజు ఏం జరిగిందంటే?

బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌లో ఈ రోజు కూడా చాలా చప్పగా సాగింది. ఓ రోజు మొత్తం ఎలాంటి టాస్క్‌ లేకుండా పూర్తయిందంటే మీకే అర్థమవుతుంది. ఈ రోజు ఏం చూపించారో. ముందు రోజుకు చెందిన బీబీ టీవీ కామెడీ షో అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత కెప్టెన్‌ ఎంపిక టాస్క్‌ కూడా అంతే చప్పగా పూర్తి చేశారు. ఇంకా ఈ రోజు ఏం జరిగాయంటే?

* బీబీ టీవీ కామెడీ షోతో 12వ రోజు టెలీకాస్ట్‌ మొదలైంది. డ్రామా కంపెనీ నేపథ్యంలో కుమార్‌ సాయి టీమ్‌ స్కిట్‌ వేసింది. అమ్మ రాజశేఖర్‌, దేవీ నాగవల్లి, దివి, హారిక అందులో నటించారు. ఇందులో రాజశేఖర్‌ రాజు కాగా, దేవీ రాణిగా కనిపించింది. దివి మంత్రిగాను, హారిక భటుడుగా నటించారు. ఓవర్‌ డ్రామాలు చేసి ఉన్న అవకాశాలు పోగొట్టుకొని మూడు నెలలుగా పనులు లేకుండా, పస్తులతో ఉంటున్న డ్రామా కంపెనీ అది. ఎవరైనా డ్రామా వేసే అవకాశం ఇస్తారా అని ఎదురు చూస్తుంటారు. చింత చచ్చినా పులుపు చావదు అనే స్టైల్‌లో అవకాశాలు లేకపోయినా, డ్రామా రాజసం చూపించాలని కంపెనీ ఓనర్‌ అమ్మ రాజశేఖర్‌ అంటుంటాడు. డ్రామా అవకాశాలు లేకపోవడం వల్ల వచ్చే ఫ్రస్టేషన్‌ను చూపించాలని అనుకున్నారు. కానీ వర్కౌట్‌ కాలేదు. మధ్యలో దేవీ వేసిన… ఒకటి రెండు జోకులు ఫర్వాలేదనిపించాయి.

* అవినాష్‌ టీమ్‌ వేసిన స్కిట్‌ కాస్త బాగుంది. ఊళ్లలో షూటింగ్‌ జరిగినప్పుడు స్థానికులు చేసే సందడి నేపథ్యంలో ఈ స్కిట్‌ చేశారు. ఇందులో కళ్యాణి డైరెక్టర్‌ కాగా… మోనాల్‌, అఖిల్‌ హీరోయిన్‌ హీరోలు. సుజాత కెమెరా ఉమెన్‌. ఇక అవినాష్‌ లోకల్‌ ఫ్యాన్‌. సినిమా షూటింగ్‌ను అవినాష్‌ ఎలా చెడగొట్టాడు అనేదే స్కిట్‌. స్కిట్‌లో అవినాషే హైలైట్‌గా నిలిచాడు. అయితే ఇదంతా పిచ్చోళ్లు చేస్తున్న షూటింగ్‌ అని ఫైనల్‌ ట్విస్ట్‌ ఇచ్చారు. అయితే రెండో స్కిట్‌ గంగవ్వకు నచ్చడంతో దానినే గెలిపించారు.

* బెస్ట్‌ స్కిట్‌ ఇచ్చిన అంశంలో నిర్ణయం అమ్మ రాజశేఖర్‌ మాస్టర్‌కు నచ్చేలేదు. స్కిట్‌ నియమాల ప్రకారం జరగకపోయినా ఇచ్చేశారు అంటూ తన అభ్యంతరం వ్యక్తం చేశాడు. మూడు నిమిషాల సమయం ఇస్తే ఐదు నిమిషాలు చేశారనే పాయింట్‌ కూడా తీసుకొచ్చాడు. నోయల్‌ చేసింది కరెక్ట్‌ కాదు అని కూడా అన్నాడు. ఆ తర్వాత నోయల్‌, లాస్య ఈ విషయంలో చర్చించారు. అందరూ బాగా కష్టపడి చేసినా, అవినాష్‌ది ఎంటర్‌టైన్‌గా ఉంది కదా అని అనుకున్నారు. ఆఖరికి అమ్మ రాజశేఖర్‌ మాస్టర్‌ను కూల్‌ చేసే పనిని నోయల్‌కు లాస్య అప్పగించింది.

* నోయల్‌ వెళ్లి మాట్లాడితే ‘ఇద్దరికీ ఇచ్చేసుంటే బాగుండేది’ అని రాజశేఖర్‌ మాస్టర్‌ చెప్పారు. కళ్యాణి కూడా మాస్టర్‌నే సపోర్టు చేయడం గమనార్హం. ఆఖరికి బిగ్‌బాస్‌ కూడా ఇద్దరినీ సపోర్టు చేస్తూ ముందుగా చెప్పినట్లు కాకుండా రెండు కూల్‌ డ్రింక్స్‌ పంపించాడు. దాంతో కుమార్‌ సాయి టీమ్‌ చాలా ఆనందించారు.

* ‘చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా..’ పాటను కళ్యాణి పాడగా, నోయల్‌ దరువేశాడు. దానికి ఇంట్లో వాళ్లందరూ లివింగ్‌ రూమ్‌లో డ్యాన్స్‌ చేస్తూ సందడి చేశారు. ఓ మూలకు మోనాల్‌, అభిజీత్‌ కూర్చొని ఆ సందడిని చూస్తూ ఎంజాయ్‌ చేశారు.

* ఒరిజినల్‌ 12వ రోజును ‘నీ కళ్లు నీలి సముద్రం…’ పాటతో ప్రారంభించాడు బిగ్‌బాస్‌. ఎప్పటిలాగే అఖిల్‌ ఒంటరిగా డ్యాన్స్‌ వేసుకోగా, హౌస్‌ మేట్స్‌ అందరూ కలసి స్టెప్పులేశారు. అభిజీత్‌, మోనాల్‌ మాత్రం బెడ్‌ దగ్గర కూర్చొని ముచ్చట్లు పెట్టుకోవడం కనిపించింది.

* తనను అవాయిడ్‌ చేస్తున్నారు అంటూ దేవీ నాగవల్లి చర్చ పెట్టింది. ఎవాయిడ్‌ చేస్తున్నారు కాబట్టి మీరు వండిన ఫుడ్‌ తినను అంది. నామినేషన్స్‌ తర్వాత నన్ను అవాయిడ్‌ చేస్తున్నారు అనిపిస్తోందని దేవీ కరాఖండిగా చెప్పేసింది. గతంలో మనం పెట్టుకున్న వేరే డిస్కషన్‌ చూసి దేవీ అలా అనుకుందేమో అంటూ అమ్మ రాజశేఖర్‌, కళ్యాణి, లాస్య అనుకున్నారు.

* బిగ్‌బాస్‌ ఇంటి నియమాలు పాటించడం లేదంటూ ఇంటి సభ్యులకు శిక్ష వేశాడు. మోనాల్‌, అభిజీత్‌, అఖిల్‌, నోయల్‌, హారిక… తెలుగులో కాకుండా ఇతర భాషల్లో మాట్లాడుతున్నారు. తక్షణమే రండి అంటూ బిగ్‌బాస్‌ పిలిచినా కూడా కొంతమంది రావడం లేదు. వారిలో అమ్మ రాజశేఖర్‌, దేవి, మోనాల్‌, నోయల్‌, కళ్యాణి, దివి ఉన్నారు. అంతేకాకుండా కొంతమంది మైక్స్‌ను సరిగా ధరించడం లేదు. దీంతో క్రమశిక్షణ నేర్పించాల్సిన అవసరం ఉందని బిగ్‌బాస్‌ భావించాడు.

* బిగ్‌బాస్‌ తదుపరి ఆదేశాలు వచ్చేవరకు మోనాల్, అభిజీత్‌, అఖిల్‌, నోయల్‌, హారిక తెలుగు నేర్చుకోవాలని సూచించాడు. సుజాత దగ్గర ఆ తెలుగు నేర్చుకోవాలని సూచించాడు. ‘బిగ్‌బాస్‌ నన్ను క్షమించండి… ఇకపై మేము తెలుగులోనే మాట్లాడతాం’ అని చెబుతూ రాయాల్ని ఉంటుంది అని బిగ్‌బాస్‌ చెప్పాడు.

* ప్రతిసారి బెల్‌ మోగినప్పుడు ఇంటి సభ్యులందరూ గార్డెన్‌ ఏరియాలో నిలబడి ‘బిగ్‌బాస్‌ మేం ఇప్పటి నుంచి సమయపాలన పాటిస్తాం’ అని చెబుతూ 20 గుంజీలు తీయాల్సి ఉంటుంది. నియమ ఉల్లంఘనకు సంబంధించిన ఆదేశం వచ్చిన ప్రతిసారి కెప్టెన్‌ లాస్య తన వ్యక్తిగత వస్తువును త్యాగం చేసి స్టోర్‌ రూమ్‌లో పెట్టాలని ఆదేశించాడు.

* ‘చిట్టి చిలకమ్మ… పద్యాన్ని మోనాల్‌కు నేర్పించడానికి సుజాత చాలా కష్టపడింది. మోనాల్‌ పద్యం చదువుతున్నంసేపు వీక్షకులు నవ్వుతూనే ఉండుంటారు. ఖర్మకు.. ఖరేమా అని మార్చేసింది మోనాల్‌. శిక్షను బట్టి లాస్య తన చెవి రింగులు, నెయిల్‌ పాలిస్‌ ఇచ్చేసింది.

* చిరాకు మీదున్న నోయల్‌ను నవ్వించాలని సుజాత ప్రయత్నించినా విఫలమైంది. నా నిద్ర చెడగొట్టినందకు అందరూ వచ్చి సారీ చెప్పాలని నోయల్‌ పట్టుబట్టాడు. బిగ్‌బాసే సారీ చెప్పాలని కూడా అన్నాడు. ‘బిగ్‌బాస్‌ నాకొచ్చి సారీ చెప్పాలే’ అంటూ కరాఖండిగా చెప్పేశాడు. బస్తీ మే సవాల్‌ అంటూ సవాలు విసిసాడు కూడా. ప్రోమోలో చూపించిన ‘నేను శనివారం వెళ్లిపోతా’ అనే మాట కూడా ఇక్కడే అనేశాడు.

* బిగ్‌బాస్‌ ఇంటి కొత్త కెప్టెన్‌ ఎంపిక కూడా ఈ రోజే చేశారు. లగ్జరీ బడ్జెట్‌ టాస్క్‌లో బెస్ట్‌ ఎంటర్‌టైనర్‌గా నిలిచిన నలుగురి పేర్లను బిగ్‌బాస్‌కు చెప్పమని అడిగాడు. వారి నుంచి ఒకరిని కెప్టెన్‌ చేయాలని అనుకున్నారు. ఇంట్లో వాళ్లందరూ కలసి అభిజీత్‌, కళ్యాణి, నోయల్‌, మోహబూబ్‌ను కొత్త కెప్టెన్‌ రేసులో ఉంచారు.

* ఇంట్లో వాళ్లను ఇంకా అర్థం చేసుకొని, ఎక్స్‌ప్లోర్‌ చేయాల్సి ఉంది కాబట్టి… నేను కెప్టెన్‌గా నిలవడం తొందర అవుతుందని అభిజీత్‌ స్పష్టం చేశాడు. ఇంట్లో వాళ్లందరి గురించి తెలుసునని, వాళ్లకు ఏ పని ఇస్తే బాగా చేస్తారో కూడా తెలుసు అని.. అదే తన బలమని కళ్యాణి చెప్పింది. ఈ చిన్న జర్నీలో నేను తెలుసుకున్నది తెలుసుకున్నా… అయితే కెప్టెన్‌గా నోయల్‌ బెటర్‌ అనిపిస్తోందని తన అభిప్రాయం చెప్పాడు. నాకు వచ్చినా మంచిదే.. లేకపోయినా ఓకే అనుకున్నారు. ఇంట్లో వాళ్లందరితో మాట్లాడి… వాళ్లకు తగ్గట్టుగా కెప్టెన్‌గా ఉంటాను అని నోయల్‌ చెప్పాడు. ఆఖరికి అందరూ ఏకాభిప్రాయంతో నోయల్‌ను కొత్త కెప్టెన్‌గా ఎంచుకున్నారు.

* కిచెన్‌ టీమ్‌ గొడవ ఇంకా సమసిపోలేదు. కొత్త వారానికి కిచెన్‌ టీమ్‌ ఎవరు అనే విషయలో మరోసారి చర్చ వచ్చింది. దేవి, మెనాల్‌, లాస్య, కళ్యాణిని కొత్త కిచెన్‌ టీమ్‌గా ఎంచుకున్నారు. అయితే కిచెన్‌ టీమ్‌ను పూర్తిగా మార్చాలి అని దేవీ అనేసరికి కళ్యాణి టీమ్‌ నుంచి బయటకు వచ్చేసింది. ఆ తర్వాత కూడా దానిపై చర్చ కూడా జరిగింది. నాకు పని లేకపోతే గాసిప్స్‌ వస్తాయనే కిచెన్‌ అడిగాను… కానీ దాని వల్ల ఎవరి మనసులో మార్చడానికి కాదు అని కళ్యాణి కుండబద్దలుకొట్టేసింది.

* రాత్రి అందరూ లివింగ్‌ ఏరియాలో అందరూ రిక్వెస్ట్‌ చేస్తే… అఖిల్‌-మోనాల్‌ను అవినాష్‌ సరదాగా ఇమిటేట్‌ చేశాడు. తొలుత అందరూ నవ్వుకున్నా, ఆఖరికి అఖిల్‌ కూడా నవ్వుకున్నాడు. కానీ మోనాల్ ఎందుకో బాధపడింది. ఇలాంటి పెద్ద ప్లాట్‌ఫామ్‌ మీద నన్ను ఇమిటేట్‌ చేయడం నచ్చలేదంటూ బాధపడింది. కోసం కూడా వస్తోంది అని చెప్పింది. అవినాష్‌ వెళ్లి ఆమెకు సారీ కూడా చెప్పాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus