బిగ్‌బాస్‌ 4: కారణాలు బోర్‌ కొట్టేస్తున్నాయ్‌… బిగ్‌బాస్‌!

బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌ నాలుగో వారం నామినేషన్‌ ప్రాసెస్‌ బిగ్‌బాస్‌ కాస్త డిఫరెంట్‌గా ప్లాన్ చేశాడు. హిట్‌ మ్యాన్స్‌, డెన్‌, సుపారి, హత్య అంటూ ఓ సెటప్‌ పెట్టాడు. ఎవరిని నామినేట్‌ చేయాలో హౌస్‌మేట్‌ చెబితే… హిట్‌ మ్యాన్స్‌ వారిని కిల్‌ చేసి నామినేట్‌ చేస్తారు. ఈ ప్రాసెస్‌లో తక్కువ డబ్బులు వచ్చిన హిట్‌ మ్యాన్‌ కూడా నామినేట్‌ అవుతాడని చెప్పారు. దీంతో చంపమని చెప్పేవాళ్ల మధ్య, చంపేవాళ్ల మధ్య కూడా పోటీ ఏర్పడింది. అయితే నామినేషన్‌ కోసం ఇంటి సభ్యులు చెప్పే కారణాలు మాత్రం బోర్‌ కొట్టిస్తున్నాయ్‌.

కొత్తగా ఇంటికి వచ్చిన స్వాతి దీక్షిత్‌ను అమ్మ రాజశేఖర్‌ నామినేట్‌ చేశాడు. ఇంటికి వచ్చిన వెంటనే కొందరితోనే ఉంటోంది. అందరి దగ్గర మంచి అనిపించుకోవాలని అనుకుంటోంది. ఆమె ఇంకా బాగా కనెక్ట్‌ అయితే బాగుంటుంది అని కారణంగా చెప్పాడు. ‘ఉక్కు హృదయం’ టాస్క్‌ సమయంలో అభిజీత్‌ తీరు నచ్చక నామినేట్‌ చేస్తున్నానని మెహబూబ్‌ చెప్పాడు. టాస్క్‌ సమయంలో గల్లీ ఫైటర్స్‌ అనడం తనకు నచ్చలేదని కూడా చెప్పాడు.

గత నామినేషన్‌ సందర్భంగా లాస్యతో జరిగిన డిస్కషన్‌ కారణంగా చెబుతూ ఆరియానా చెప్పింది. ‘నా వల్ల ఇంట్లో వాళ్లు ఇరిటేట్‌ అవుతున్నారు’ అంటూ లాస్య చెప్పింది. కానీ ఇంట్లో వాళ్లు ఎవరూ ఆ మాట అనలేదు. అందుకే ఈ విషయంలో క్లారిటీ కోసం నామినేట్‌ చేస్తున్నట్లు తెలిపింది. ‘ఉక్కు’ టాస్క్‌ సమయంలో మెహబూబ్‌ బాగా హైపర్‌ అయ్యాడు. అంత అగ్రెసివ్‌గా ఉండటం సరికాదు అందుకే నామినేట్‌ చేస్తున్నట్లు హారిక చెప్పింది.

కుమార్‌ సాయిని సుజాత నామినేట్‌ చేసింది. అతనితో మాట్లాడటానికి ఎంత ప్రయత్నించినా.. ఆయన నుంచి ఇనీషియేషన్‌ రావడం లేదు. ఇంట్లో ఎక్కువమందితో కలవడం లేదు అనే కారణం చెప్పింది. దాంతోపాటు వీకెండ్‌లో నాగార్జునతో ‘నేను సింగిల్‌గా ఆడుతున్నా’ అని చెప్పడం కూడా సరికాదు అని సుజాత కారణంగా చెప్పింది.

ఈ మొత్తం ప్రాసెస్‌ జరుగుతున్నప్పుడు సోహైల్‌ – అఖిల్‌ మధ్య పోటీ కూడా జరిగింది. గన్‌ సౌండ్‌ రాగానే అఖిల్‌ ఠక్కున గన్‌ అందుకున్నాడు. మొత్తం ఐదుసార్లులో నాలుగుసార్లు అఖిల్‌ గన్‌ అందుకున్నాడు. దీంతో సోహైల్‌ స్మార్ట్‌ థాట్‌ చేశాడు. అఖిల్‌ బ్రీఫ్‌కేసు నుంచి డబ్బులు దొంగిలించాడు. ఆ తర్వాత మరోసారి మొత్తం బ్రీఫ్‌ కేసు మార్చేశాడు. అయినప్పటికీ అఖిల్‌ బ్రీఫ్‌ కేసులో డబ్బులు ఎక్కువ ఉండటంతో సోహైల్‌ నామినేట్‌ అయ్యాడు.

హిట్‌ మ్యాన్‌ల టాస్క్‌ నుంచి సేఫ్‌ అయిన అఖిల్‌కు బిగ్‌బాస్‌ ఓ అవకాశం ఇచ్చాడు. ఎవరినైనా డైరెక్ట్‌గా నామినేట్‌ చేయొచ్చని తెలిపాడు. దీంతో అఖిల్‌… హారికను నామినేట్‌ చేశాడు. అభిజీత్‌తో మాట్లాడదామని ట్రై చేస్తుంటే… హారిక మధ్యలో వచ్చి కలుగజేసుకుంటోంది అంటూ కారణంగా చెప్పాడు. అలా స్వాతి, అభిజీత్‌, లాస్య, మెహబూబ్‌, కుమార్‌, సోహైల్‌, హారిక ఈ వారం నామినేట్‌ అయ్యారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus