ఎన్టీఆర్, నాని, నాగార్జున ల ‘బిగ్ బాస్’ పారితోషికాల లిస్ట్..!

నార్త్ లో ఎంతో పాపులర్ అయిన ‘బిగ్ బాస్’ రియాలిటీ షో.. సౌత్ లో కూడా ప్రారంభం అవుతుంది అన్నప్పుడు ఎన్నో నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి. ‘ఈ షో ఇక్కడ అంతగా సక్సెస్ కాదు’.. ‘ఇలాంటి రియాలిటీ షో లు ఇక్కడ ఎవరు చూస్తారు’ ‘కనీసం ఒక్క సీజన్ అయినా కంప్లీట్ గా టెలికాస్ట్ అవుతుందా’… అంటూ ఇలా ఎన్నో నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి. అయితే వాటన్నిటినీ పటాపంచలు చేస్తూ .. సౌత్ లో అన్ని భాషల్లోనూ ‘బిగ్ బాస్’ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది.

మొదటి సీజన్ ను ఎన్టీఆర్ వంటి స్టార్ హీరో హోస్ట్ చెయ్యడంతో ఈ షోకి శుభారంభం దక్కినట్టు అయ్యిందని చెప్పాలి. ఇక రెండో సీజన్ ను నేచురల్ స్టార్ నాని హోస్ట్ చెయ్యడం జరిగింది.ఈ సీజన్లో కొన్ని కాంట్రావర్సీలతో హోస్ట్ నాని ఇబ్బంది పడినప్పటికీ.. తన మార్క్ తో ఈ సెకండ్ సీజన్ ను కూడా సూపర్ హిట్ చేశాడు. ఇక మూడో సీజన్ ను ‘కింగ్’ నాగార్జున హోస్ట్ చెయ్యగా.. మొదటి రెండు సీజన్ల కంటే పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందని చెప్పొచ్చు. ఇప్పుడు నాలుగో సీజన్ కు కూడా నాగార్జునే హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ‘బిగ్ బాస్4’ ఆలస్యంగా సెప్టెంబర్ 6న(నిన్న) ప్రారంభం అయినప్ప్పటికీ.. హైప్ మాత్రం ఓ రేంజ్లో పెరిగిందనే చెప్పాలి. ఇదిలా ఉండగా.. ఇప్పటి వరకూ కంప్లీట్ అయిన మూడు సీజన్లు అలాగే ఈ నాలుగో సీజన్ కు.. హోస్ట్ ల రెమ్యూనరేషన్స్ తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది.కేవలం శని, ఆదివారాలు వచ్చి కంటెస్టెంట్ లను గైడ్ చేసే హోస్ట్ ల రెమ్యూనరేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రండి :

బిగ్ బాస్1:

‘బిగ్ బాస్1’ ను హోస్ట్ చేసిన ఎన్టీఆర్.. ఒక్కో ఎపిసోడ్ కు రూ.35 లక్షల పారితోషికం అందుకునేవాడు.

బిగ్ బాస్2:

‘బిగ్ బాస్ 2’ ను హోస్ట్ చేసిన నాని.. ఒక్కో ఎపిసోడ్ కు రూ.10 లక్షల నుండీ రూ.12 లక్షల వరకూ అందుకునేవాడు.

బిగ్ బాస్ 3:

‘బిగ్ బాస్3’ ను హోస్ట్ చేసిన ‘కింగ్’ నాగార్జున.. ఒక్కో ఎపిసోడ్ కు రూ.10లక్షల నుండీ రూ.12 లక్షల వరకూ అందుకునేవాడు.

బిగ్ బాస్ 4:

‘బిగ్ బాస్ 4’ ను కూడా ‘కింగ్’ నాగార్జునే హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా వైరస్ కారణంగా ఈయన రెమ్యూనరేషన్ తగ్గించారు అనే ప్రచారం జరిగింది. అయితే ఆ వార్తల్లో నిజం లేదు. ఈ సీజన్ కు కూడా నాగార్జున రూ.12 లక్షల నుండీ రూ.14 లక్షల వరకూ అందుకుంటున్నారట.

Most Recommended Video

వి సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్…!
ఆ చిత్రాలు పవన్ చేసి ఉంటే బాక్సాఫీస్ బద్దలు అయ్యేది..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus