బిగ్ బాస్ ఇంట్లో సందడి చేసిన మాజీ కంటెస్టెంట్లు.. కొన్ని గంటలలో ముగియనున్న బిగ్ బాస్ 6!

బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమం మరికొన్ని గంటలలో ముగియనుంది.మరి కాసేపట్లో ఈ సీజన్ విన్నర్ ఎవరు రన్నర్ ఎవరు అనే విషయం తెలియనుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఈ సీజన్ విన్నర్ రేవంత్ అని బలంగా వార్తలు వస్తున్నాయి. ఇకపోతే ఈ కార్యక్రమం డిసెంబర్ 17వ ఎపిసోడ్లో భాగంగా హౌస్ లోకి బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్లు వచ్చి పెద్ద ఎత్తున సందడి చేశారు.

త్వరలోనే బిగ్ బాస్ జోడి కార్యక్రమం ప్రారంభం కాబోతున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే బిగ్ బాస్ జోడీలు హౌస్ లోకి వెళ్లి అక్కడ ఉన్నటువంటి కంటెస్టెంట్లకు పలు టాస్కులను ఇస్తూ ఎంటర్టైన్ చేశారు. ఇలా మాజీ కంటెస్టెంట్లతో బిగ్ బాస్ హౌస్ లో ఎంతో సందడి వాతావరణం నెలకొంది. ఇదిలా ఉండగా బిగ్ బాస్ సీజన్ సిక్స్ కంటెస్టెంట్ గా టాప్ ఫైవ్ లో కొనసాగుతున్నటువంటి శ్రీహన్ ఏకంగా ఐదు లక్షల ప్రైజ్ మనీ సంపాదించుకున్నారు.

గత కొద్దిరోజులుగా ఆన్లైన్లో లెన్స్ కార్ట్ స్టైలిష్ కంటెస్టెంట్ల పోటీ జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇందులో శ్రీహన్ విజేతగా నిలిచారు. ఈ క్రమంలోనే స్టైలిష్ కంటెస్టెంట్ ఆఫ్ ది సీజన్ గా నిలవడమే కాకుండా ఐదు లక్షల రూపాయల ప్రైజ్ మనీ అందుకున్నారు. ఈ విధంగా శ్రీహన్ 5 లక్షల రూపాయల ప్రైజ్ మనీ అందుకోవడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే ఈ సీజన్ విన్నర్ ఎవరు అనే విషయం గురించి ఆత్రుత కనబరుస్తున్న ప్రేక్షకులకు మరికొన్ని గంటలలో ఈ సీజన్ విన్నర్ ఎవరో తెలిసిపోనుంది. కీర్తి, రోహిత్, ఆదిరెడ్డి, రేవంత్, శ్రీహాన్ ఉన్న విషయం మనకు తెలిసిందే. మరి వీరిలో విన్నర్ ఎవరు రన్నర్ ఎవరు తెలియాలంటే కొన్ని గంటలు వేచి చూడాల్సిందే.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus